గణపతి విగ్రహాలు ధ్వంసం చేసిన మహిళలు..ఎందుకంటే ?

Update: 2020-08-17 10:50 GMT
మరికొద్ది రోజుల్లోనే గణపతి ఉత్సవాలు మొదలుకాబోతున్నాయి. అన్ని పరిస్థితులు బాగున్నింటే ఈపాటికే గణపతి ఉత్సవాల హడావిడి ఊరువాడా  అన్న తేడా లేకుండా సందడి సందడిగా మొదలైయ్యేవి. కానీ , కరోనా నేపథ్యంలో గణపతి ఉత్సవాలకి కుడి చాలా చోట్ల బ్రేక్స్ పడ్డాయి. వినాయక చవితి సందర్భంగా ,,మన దేశంతో పాటుగా ఇతర దేశాల్లో కూడా గణపతి విగ్రహాలు తయారు చేస్తారు. అక్కడ ఉన్న భారతీయుల కోసం వాటిని తయారుచేసి అమ్మకానికి పెడతారు. అయితే, ఓ దుకాణంలో పెట్టిన గణపతి  విగ్రహాలను ఇద్దరు ముస్లిం మహిళ ధ్వంసం చేసింది. ఈ సంఘటన బహ్రెయిన్‌ రాజధాని మనామాలో చోటు చేసుకుంది.

మనామాలో  ఓ దుకాణంలో వినాయక విగ్రహాలను చూసిన ఇద్దరు ముస్లిం మహిళలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఏదేమైనా హిందువుల దేశమా ..ఇది ముస్లింల దేశం అని .. గణేష్ విగ్రహాలు ఎందుకుపెట్టారంటూ ఆ విగ్రహాలను ఒక్కటొక్కటిగా నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. షాపు సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆ మహిళల పై విరుచుకుపడుతున్నారు.

అంత విద్వేషం ఎందుకు..   అంటూ భారతీయులతోపాటు ప్రపంచంలోని ఇతర నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అలాగే ఆ మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బహ్రెయిన్ ప్రభుత్వం కూడా స్పందించింది. విగ్రహాల విధ్వంసానికి పాల్పడిన 54ఏళ్ల సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేసినట్లు, ఈ ఘటనకు సంబంధించి ఆమెను విచారిస్తున్నట్లు బహ్రెయిన్ మంత్రి ఒకరు వెల్లడించారు. Full View
Tags:    

Similar News