క్రియేటర్ల ఆదాయంపై ఎలాన్ మస్క్ ఫోకస్

సోషల్ మీడియాను వదలకుండా సంపాదించే మార్గాలను వెతుకుతున్నాడు ట్విట్టర్‘ఎక్స్’ అధినేత ఎలన్ మస్క్. ప్రముఖ సోషల్ మీడియా యూట్యూబ్ కు సవాల్ విసిరేందుకు మస్క్ రెడీ అవుతున్నారు.;

Update: 2026-01-01 12:34 GMT

సోషల్ మీడియాను వదలకుండా సంపాదించే మార్గాలను వెతుకుతున్నాడు ట్విట్టర్‘ఎక్స్’ అధినేత ఎలన్ మస్క్. ప్రముఖ సోషల్ మీడియా యూట్యూబ్ కు సవాల్ విసిరేందుకు మస్క్ రెడీ అవుతున్నారు. ఇప్పటివరకూ ఆన్ లైన్ క్రియేటర్ ఎకానమీ లో ఏకఛత్రాధిపత్యం వహించిన యూట్యూబ్ కు ఇప్పుడు గట్టి పోటీనిచ్చేందుకు ఎలన్ మస్క్ రెడీ అవుతున్నారట.. ఈయన నేతృత్వంలోని ‘ఎక్స్’ క్రియేటర్ల ఆదాయం విషయంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టడమే దీనికి ప్రధాన కారణం.

ఆదాయం పెంపు దిశగా అడుగులు

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఎక్స్ లో క్రియేటర్ల కు ఇచ్చే రెవెన్యూ షేర్ ను గణనీయంగా పెంచాలని మస్క్ తన బృందాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రముఖ హ్యాండిల్స్ ఈ విషయాన్ని వెల్లడించడంతో నెటిజన్లలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. యూట్యూబ్ తో పోలిస్తే మెరుగైన ఆదాయం అందిస్తే.. క్రియేటర్లందరూ ఎక్స్ వైపు మల్లే అవకాశం ఉందని విశ్లేషఖులు భావిస్తున్నారు.

మస్క్ వ్యూహం ఏంటి?

ఎక్స్ సోషల్ మీడియాను కేవలం అక్షరాలతో కూడిన మైక్రో బ్లాగింగ్ సైట్ గా మాత్రమే ఉంచకుండా ఒక ఎవ్రీథింగ్ యాప్ గా మార్చాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని కోసం ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టారు. యూట్యూబ్ తరహాలోనే సుధీర్ఘమైన వీడియోలను అప్ లోడ్ చేసే సౌలభ్యం కల్పించనున్నారు. ఇక క్రియేటర్ల కంటెంట్ ను ఎక్కువమందికి చేరవేసేలా అల్గోరిథం మార్చనున్నారు. అడ్వటైజింగ్ రెవెన్యూలో క్రియేటర్లకు ఇచ్చే వాటాను పెంచనున్నాడు. యూట్యూబ్‌లో అడ్వర్టైజింగ్ పాలసీలు, కఠినమైన రూల్స్‌తో విసిగిపోయిన క్రియేటర్లను ఆకర్షించడమే మస్క్ మాస్టర్ ప్లాన్ గా కనిపిస్తోంది.

భారత్ లో ప్రభావం ఎంత?

భారత్ వంటి భారీ మార్కెట్ లో క్రియేటర్ ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఇక్కడి వ్లాగర్లు, టెక్ రివ్యూయర్లు పూర్తిగా యూట్యూబ్ పైనే ఆధారపడుతున్నారు. ఎక్స్ కనుక తెలుగు, హిందీ వంటి ప్రాంతీయ భాషా క్రియేటర్లకు ప్రోత్సాహకాలు అందిస్తే భారీ మార్పు ఖాయంగా కనిపిస్తోంది. భారత్ లో యూపీఐ వ్యవస్థ బలంగా ఉండడంతో ఆదాయ పంపిణీ ప్రక్రియ సులభతరం కానుంది.

అసలైన సవాల్ అక్కడే..

యూట్యూబ్ దశాబ్దాలుగా నిర్మించుకున్న వ్యవస్థను అధిగమించడం ఎక్స్‌కు అంత సులభం కాదు. కేవలం ఆదాయం పెంచడం మాత్రమే కాకుండా.. క్రియేటర్లకు అవసరమైన ఎనలిటిక్స్ టూల్స్, కాపీరైట్ ప్రొటెక్షన్, స్థిరమైన యాడ్ నెట్‌వర్క్‌ను ఎక్స్ అందించగలదా? అన్నది ఇప్పుడు మిగిలి ఉన్న ప్రశ్న. ఒకవేళ మస్క్ అనుకున్నట్లుగా పేఅవుట్లు భారీగా ఉంటే మాత్రం.. భవిష్యత్తులో క్రియేటర్లందరికీ 'ఎక్స్' ఒక లాభదాయకమైన అడ్డాగా మారడంలో సందేహం లేదు.




Tags:    

Similar News