• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విదేశీ ఆటగాళ్లు...

విదేశీ ఆటగాళ్లు లేకున్నా.. ఐపీఎల్​ కొనసాగిస్తాం..!

By - Tupaki Desk
Update: 2021-05-29 13:30 GMT
కరోనా ఎఫెక్ట్​ తో ఐపీఎల్​ 2021 ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్​ ఎప్పుడు కొనసాగిస్తారు.  అసలు కొనసాగిస్తారా లేదా అన్న అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. అయితే ఐపీఎల్ కొనసాగించి తీరతామని.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అధికారికంగా ప్రకటించారు. దీంతో ఐపీఎల్​ కొనసాగింపుపై ఉన్న అనుమానాలు తీరిపోయాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్​ 2021 కొనసాగింపు మ్యాచ్​ లు యూఏఈలో జరగనున్నాయి. ఈ క్రమంలో విదేశీ ఆటగాళ్లు ఈ మ్యాచ్​ లో ఆడతారా? లేదా? అన్న విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ప్రశ్నలకు శుక్లా సమాధానాలు చెప్పారు. విదేశీ ఆటగాళ్లు వచ్చినా.. రాకపోయినా.. మ్యాచ్​లు కొనసాగించి తీరతామని ఆయన చెప్పారు.

ఇవాళ వర్చువల్‌ గా జరిగిన బోర్డు ప్రత్యేక సర్వ సభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మిగిలిపోయిన 31 మ్యాచ్‌ లను సెప్టెంబర్ - అక్టోబర్‌ లో పూర్తి చేయబోతున్న విషయం తెలిసిందే.

షార్జా, దుబాయ్, అబుదాబి వేదికగా ఐపీఎల్​ మ్యాచులు కొనసాగనున్నాయి. విదేశీ ఆటగాళ్లు లేకపోయినా ఐపీఎల్​ను కొనసాగిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్​ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని బీసీసీఐ అంటున్నది.

అయితే న్యూజిలాండ్​, ఇంగ్లండ్​ క్రికెటర్లు వచ్చే పరిస్థితి లేదని సమాచారం. ఐపీఎల్​ 2021 ఆగిపోవడంతో ఫ్యాన్స్​ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. బయోబబుల్​ లో ఐపీఎల్​ నిర్వహించనప్పటికీ .. కొందరు క్రికెటర్లకు కరోనా సోకింది. దీంతో అర్ధాంతరంగా టోర్నీ ఆగిపోయింది. అయితే మ్యాచ్​ కొనసాగింపు ప్రకటన కోసం అప్పటినుంచి ఫ్యాన్స్​ ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఐపీఎల్​ 2021పై బీసీసీఐ నిర్ణయం తీసుకున్నది. ఈ సమావేశంలో బీసీసీఐ చైర్మన్​ సౌరవ్​ గంగూలీ కూడా పాల్గొన్నారు.
Tags:    
  • IPL 
  • IPL 2021 
  • IPL Matches 
  • IPL 2021 Updates 
  • IPL Latest Updates 
  • BCCI 

Similar News

ఏపీ జనం తీర్పు... గుప్పిట పట్టి ఉండిపోయిందా ?

2026-11-11 01:48 GMT

బొత్స కూతుర్ని ఓడించిన నీరజకే జెడ్పీ పట్టం ?

2026-11-11 01:47 GMT

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ?

2026-11-11 01:46 GMT

పవన్ కళ్యాణ్ విడాకులపై ’అంబటి’ రియాక్షన్ వైరల్

2026-11-11 01:45 GMT

డబ్బుల్లేవ్.. బీఆర్ఎస్‌కు ఇన్చార్జుల షాక్.. !

2026-11-11 01:44 GMT

విశాఖలో పెట్టుబడుల పండుగకి కౌంట్ డౌన్

2026-11-11 01:43 GMT

వైసీపీ బెస్ట్ డెసిషన్...కరెక్ట్ రూట్ లోనే !

2026-11-11 01:43 GMT

మంచు తెరలతో పర్యాటకులకు స్వాగతం

2026-11-11 01:42 GMT

సోనియా పుస్త‌కంలో తెగవెతికేసిన అంశాలు ఇవే!

2026-11-10 14:30 GMT

అనంతపురం వైసీపీ మేయర్.. కూటమి పక్కా ప్లానింగ్, ఆ ఒక్కరినీ లాగేస్తారా?!

2026-11-10 14:13 GMT

ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో ఊహించ‌ని ఘ‌ట్టం!

2026-11-10 13:12 GMT

ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ అత్యవసర భేటీ.. తమిళనాడులో ఏం జరగబోతోంది?

2026-11-10 12:56 GMT

Copyright @2026

Powered by Blink CMS