• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైసీపీ బెస్ట్...

వైసీపీ బెస్ట్ డెసిషన్...కరెక్ట్ రూట్ లోనే !

| పవన్ కళ్యాణ్ సహా రాజకీయ నేతల వ్యక్తిగత జీవితాలపై కామెంట్లు చేయవద్దని వైసీపీ తన నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలకు సూచించింది. డిబేట్లలోనూ, సోషల్ మీడియా పోస్టుల్లోనూ వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని, ఇతరులు పెట్టిన అలాంటి పోస్టులను రీపోస్ట్ చేయవద్దని స్పష్టం చేసింది. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేసింది.

By - Satya P
Update: 2026-11-11 01:43 GMT

వైసీపీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అది నిజంగా ఆ పార్టీకి ఎంతగానో మేలు చేసేది. ఒక విధంగా రాజకీయంగా తెలివిడితో వివేచనతో తీసుకున్న నిర్ణయంగా దీనిని అంతా భావిస్తున్నారు. వాస్తవంగా చూస్తే వైసీపీ ఎక్కడ చెడ్డ అవుతోంది అంటే దూకుడు వల్లనే అని అంటారు. తమకు సంబంధం లేని అంశాలలో కూడా వేలు పెడుతూ వైసీపీ అభిమానులు అనబడే సోషల్ మీడియా సైన్యం పెట్టే పోస్టులు చేసే ట్రోల్స్ అంతిమంగా వైసీపీకి చుట్టుకుంటున్నాయి. అలాగే కొందరు నాయకుల అతి వల్ల కూడా వైసీపీ దారుణంగా నష్టపోతోంది. వాటి అన్నింటి మీద వైసీపీ తాజా నిర్ణయం అయితే బాగానే ప్రభావం చూపించగలదు అని అంటున్నారు.

పవన్ విషయంలో :

ఇదిలా ఉంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా ప్రస్తావిస్తూ దానిని కూడా రాజకీయంగా వాడుకోవచ్చు అన్న దురూహతో కొంతమంది నాయకులు ఎపుడూ మీడియాలో ఉత్సాహం పడుతూంటారు. ఇక సోషల్ మీడియాలో చెప్పనవసరం లేదు . అలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ వైసీపీ రాజకీయ నేతల వ్యక్తిగత విషయాల మీద కామెంట్స్ వద్దు అంటూ ఒక అతి పెద్ద లక్ష్మణ రేఖనే గీసింది. దీనిని అంతా అనుసరించాలని కూడా కోరింది. ఎవరైనా డిబేట్లలో అలాగే పోస్టులు పెట్టేటపుడు కచ్చితంగా దీనిని పాటించాలని సూచించింది. అంతే కాదు ఎవరో వేరే వారు పెట్టే కంటెంట్ ని కూడా రీ పోస్ట్ చేయడం ప్రమోట్ చేయడం వంటివి చేయరాదు అని కూడా గట్టిగానే దిశానిర్దేశం చేసింది.

ఎంతో మేలుగా :

నిజానికి ఈ తరహా నిర్ణయాలను వైసీపీ చాలా ఏళ్ళ క్రితమే తీసుకుని ఉంటే ఇపుడు ఇంతటి ఇబ్బందికరమైన రాజకీయ పరిస్థితికి వచ్చేది కాదని అంటున్నారు. పవన్ ఒక వ్యక్తిగా అనుకుని చేసే కామెంట్స్ వైసీపీకి ఎపుడూ బూమరాంగ్ అవుతూ వచ్చాయి. ఆయన సినీ సెలిబ్రిటీ. టాప్ స్టార్. అంతే కాదు రాజకీయంగా కూడా ఆయన ఒక బలమైన సామాజిక వర్గానికి ఆశా జ్యోతి. అలాగే యూత్ కి ఆయన ఐకాన్ గా ఉంటూ వస్తున్నారు. ఆయనకు స్ట్రాంగ్ లేడీ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా గతంలో వైసీపీ నేతలు టాప్ టూ బాటం ఆయన వ్యక్తిగత జీవితం మీద ఎన్నో హాట్ కామెంట్స్ చేశారు. దాని ఫలితాలను వైసీపీ ఇప్పటికీ అనుభవిస్తోంది అని విశ్లేషిస్తారు.

మేలు కొలుపుగానే :

ఈ నేపధ్యంలో పవన్ వ్యక్తిగత జీవితంలో తాజాగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాలతో వైసీపీ దూకుడు ఏ విధంగా ఉండబోతోంది అన్నదే అంతా చర్చిస్తూ వచ్చారు. దీని మీద అయితే అందరికీ ఆశ్చర్యపరుస్తూ వైసీపీ తీసుకున్న నిర్ణయం మాత్రం భేష్ అనదగినదిగా ఉంది. రాజకీయంగా విమర్శలు ఉంటే చేయాలి కానీ వ్యక్తిగతాలు వద్దు అంటూ ఆ పార్టీ నేతలకు ఇచ్చిన సందేశం అభినందించదగినది. అంతే కాదు ఆ పార్టీకి మేలు కొలుపు లాంటిది అని అంటున్నారు. దీని వల్ల వైసీపీకి మంచే జరుగుతుంది అని అంటున్నారు. ఒక రాజకీయ పార్టీగా పదిహేనేళ్ల చరిత్ర ఉన్న వైసీపీ మాట్లాడాలి అంటే ఏపీలో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి. వాటి మీద ఫోకస్ పెడితే రానున్న కాలంలో ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. ఆ దిశగా వైసీపీ కొత్త ఆలోచనలు చేయాలని కోరుకునే వారే ఎక్కువ. ఇక ఏపీలో వ్యక్తిగత విమర్శలకు చెక్ పెట్టాలని అటు టీడీపీ నుంచి కూడా ప్రతిపాదన రావడంతో ఇకనైనా ఆరోగ్యకరమైన చర్చలకు ఆస్కారం ఉంటుందని అంతా ఆశిస్తున్నారు.

Tags:    
  • ysrcp 
  • pavankalyan 
  • janasena 
  • andhrapradeshpolitics 
  • ysrcpleaders 

Similar News

ఏపీ జనం తీర్పు... గుప్పిట పట్టి ఉండిపోయిందా ?

2026-11-11 01:48 GMT

బొత్స కూతుర్ని ఓడించిన నీరజకే జెడ్పీ పట్టం ?

2026-11-11 01:47 GMT

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ?

2026-11-11 01:46 GMT

పవన్ కళ్యాణ్ విడాకులపై ’అంబటి’ రియాక్షన్ వైరల్

2026-11-11 01:45 GMT

డబ్బుల్లేవ్.. బీఆర్ఎస్‌కు ఇన్చార్జుల షాక్.. !

2026-11-11 01:44 GMT

విశాఖలో పెట్టుబడుల పండుగకి కౌంట్ డౌన్

2026-11-11 01:43 GMT

మంచు తెరలతో పర్యాటకులకు స్వాగతం

2026-11-11 01:42 GMT

సోనియా పుస్త‌కంలో తెగవెతికేసిన అంశాలు ఇవే!

2026-11-10 14:30 GMT

అనంతపురం వైసీపీ మేయర్.. కూటమి పక్కా ప్లానింగ్, ఆ ఒక్కరినీ లాగేస్తారా?!

2026-11-10 14:13 GMT

ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో ఊహించ‌ని ఘ‌ట్టం!

2026-11-10 13:12 GMT

ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ అత్యవసర భేటీ.. తమిళనాడులో ఏం జరగబోతోంది?

2026-11-10 12:56 GMT

Copyright @2026

Powered by Blink CMS