• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డబ్బుల్లేవ్.. బీఆర్ఎస్‌కు...

డబ్బుల్లేవ్.. బీఆర్ఎస్‌కు ఇన్చార్జుల షాక్.. !

| పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 40-50 నియోజకవర్గాల్లో భారీ సమావేశాలు నిర్వహించాలన్న కేటీఆర్ ప్లాన్‌కు ఇన్చార్జుల నుంచి స్పందన మందగించినట్లు సమాచారం. ఖర్చులు, అభ్యర్థి ఖరారు కాకపోవడంపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో నియోజకవర్గ స్థాయి సభలకు బదులుగా మండల స్థాయి సమావేశాలకే బీఆర్ఎస్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

By - Garuda Media
Update: 2026-11-11 01:44 GMT

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంటోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రత్యర్థులపై పైచేయి సాధించాలని పావులు కదుపుతున్నాయి. అయితే, అందరికంటే ముందుగానే అలర్ట్ అయ్యి, ప్రత్యేక వ్యూహాలతో గ్రౌండ్‌వర్క్ ప్రారంభించిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌లో మాత్రం ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తోంది. పార్టీ అధినాయకత్వం ఎంత గట్టిగా ప్లాన్ చేసినా, క్షేత్రస్థాయిలో ఇన్చార్జుల నుంచి వస్తున్న స్పందన మాత్రం గులాబీ బాస్‌లకు షాకిస్తోంది.

ఈ రెండు పట్టభద్రుల స్థానాల పరిధిలోని దాదాపు 40 నుంచి 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావించారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం ఊపందుకునేలా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక భారీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయాలని, తాను స్వయంగా వాటికి హాజరవుతానని కూడా ఆయన స్పష్టం చేశారు. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి ఆ ప్లాన్‌కు అనూహ్యంగా బ్రేక్ పడింది. అభ్యర్థి ఎవరో ఖరారు కాకుండా నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలు పెట్టడం కష్టమని, పైగా ఈ భారాంతా తమ భుజాల మీదే వేసుకోవడం ఇబ్బందికరమని ఇన్చార్జులు భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

పైసలేమన్నా చెట్లకు కాస్తున్నాయా..?

నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు అంటే మాటలు కాదని గులాబీ నేతలు లెక్కలు వేస్తున్నారు. భారీ హాల్స్ బుకింగ్స్, కార్యకర్తలకు భోజనాలు, ఇతర ఏర్పాట్ల కోసం తడిసిమోపెడవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. కేవలం రెండు మూడు నెలల క్రితమే ఎస్‌ఐఆర్ సన్నాహక సమావేశాల పేరుతో తాము భారీగా ఖర్చు పెట్టామని, అప్పట్లో కేటీఆర్, హరీష్ రావుల పర్యటనల కోసం జేబులు గుల్ల చేసుకున్నామని నేతలు వాపోతున్నారట. ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలంటూ భారీ సభలు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టే ఆర్థిక పరిస్థితి లేదని, "డబ్బులేమన్నా ఊరికే వస్తున్నాయా?" అంటూ ఇన్చార్జులు అంతర్గతంగా పెదవి విరుస్తున్నట్లు సమాచారం.

ఖర్చుల భయంతో పాటు రాబోయే రోజుల్లో జరిగే నియోజకవర్గాల పునర్విభజన అంశం కూడా నేతలను వెనకడుగు వేసేలా చేస్తోంది. భవిష్యత్తులో తమ పరిధిలో ఏయే మండలాలు ఉంటాయో, ఏవి మారుతాయో ఇప్పుడే స్పష్టత లేని పరిస్థితుల్లో.. కేవలం ఓటర్ల నమోదు కోసం ఇప్పుడు భారీగా ఖర్చు పెట్టడం దండుగ మారి పనేనని నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందన్న ఆలోచనతో, ఇప్పటికప్పుడు భారీగా నిధులు ఖర్చు చేయడం అనవసరమని అధిష్టానానికి తేల్చిచెప్పినట్లు గులాబీ శిబిరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఇన్చార్జుల నుంచి స్పందన మందగించడాన్ని గమనించిన అధిష్టానం కూడా పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ సభలు, ఆర్భాటాలకంటే కేవలం ఓటర్ల నమోదు ప్రక్రియే ముఖ్యమని భావించి పెద్ద ఎత్తున సమావేశాలు పెట్టాలనే ఆలోచనను పక్కనపెట్టింది. నియోజకవర్గాల వారీగా కాకుండా, మండల స్థాయిలోనే సింపుల్‌గా సమావేశాలు నిర్వహించు కోవాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు, ముందుగా అభ్యర్థిని ప్రకటించి, ఆ తర్వాత మీటింగ్‌లు పెడితేనే క్యాడర్‌లో జోష్ వస్తుందని, లేదంటే అనవసర ప్రయాస అవుతుందనే వాదనకు పార్టీ పెద్దలు కూడా సుముఖత చూపినట్లు తెలుస్తోంది. మొత్తానికి, డబ్బుల్లేవ్ అంటూ ఇన్చార్జులు చూపిన నిరాసక్తత ఇప్పుడు బీఆర్ఎస్ వ్యూహాత్మక సర్దుబాట్లకు కారణమవుతోంది.

Tags:    
  • brs 
  • ktr 
  • telangana 
  • mlcelections 
  • graduatesmlcelections 
  • telanganapolitics 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS