• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Weather >  మంచు తెరలతో పర్యాటకులకు...

మంచు తెరలతో పర్యాటకులకు స్వాగతం

| అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, అరకు, చింతపల్లి, లంబసింగి ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. లంబసింగిలో 8, అరకులో 10, పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటలైనా మంచు వీడకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.

By - Satya P
Update: 2026-11-11 01:42 GMT

ఎల్ నినో ప్రభావంతో పట్టణాలు నగరాలలో చలి వాతావరణం అసలు లేదు. ఇంకా ఏసీలు గట్టిగానే పనిచేస్తున్నాయి. అలాగే ఫ్యాన్లు గిర్రున తిరుగుతున్నాయి. వేడితో సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా నమోదు అవుతోంది. వేసవి కంటిన్యూ అన్నట్లుగానే పరిస్థితి ఉంది. చమటలు పడుతూ తేమతో సావాసం చేస్తూ నగర పట్టణ జీవితాలు సాగుతున్నాయి. అయితే పచ్చని ప్రకృతి కొండల మధ్యన సేద తీరుతున్న ఏజెన్సీలలో మాత్రం మూడు కాలాలూ ఇంకా సవ్యంగానే సాగుతున్నాయి. దానికి నిదర్శనంగా అల్లూరి జిల్లాలోని ప్రాంతాలు అన్నీ చలి పట్టి వణుకుతున్నాయి.

దట్టంగానే పొగ మంచు :

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాన్ని దట్టమైన పొగ మంచు ప్రస్తుతం కమ్మేసింది. ఎటు చూసినా మంచు తెరలే దర్శనం ఇస్తున్నాయి. ఇక్కడ వేకువ జామున చూస్తే పరిసరాలు అన్నీ కూడా తెల్లటి మంచు తెరలు తప్ప అంతకు మించి మరేదీ ఏమీ కనిపించడం లేదు. స్థానికంగా ఏజెన్సీలోని గ్రామాలలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతూ వస్తున్నాయి. అంతే కాదు ఒక్కసారిగా ఏజెన్సీలో చలి తీవ్రత పెరుగుతోంది.

కనిష్టానికి చేరుకుని :

ఇదిలా ఉంటే అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా దట్టమైన పొగ మంచు కురుస్తోంది. ప్రత్యేకించి చూస్తే పాడేరు, అరకు, చింతపల్లి, లంబసింగి, మంచింగ్ పుట్ ప్రాంతాల్లో ఉదయం పది గంటలు అయినా కూడా దట్టమైన పొగ మంచు చుట్టుకునే ఉంటోంది. అది ఎక్కడా వీడటం లేదు. అదే విధంగా లంబసింగిలో ఉష్ణోగ్రత 8 డిగ్రీలకు పడిపోయింది. అరకులో 10 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీలు నమోదవుతోంది. రాత్రి వేళలలో చలి మరింత పెరుగుతోంది. గత వారం కంటే 3 నుంచి 4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న కాలంలో మరింతగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతాయని అంటున్నారు. ఇక ఈ దట్టమైన పొగ మంచు కారణంగా స్థానికంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రోడ్డుపై పది నుంచి పన్నెండు మీటర్ల దూరంలో ఉన్నది కూడా కనిపించడం లేదని అంటున్నారు.

పర్యాటకులకు ఆనందం :

ఇక చూస్తే ఏజెన్సీలోని ఈ రకమైన పరిస్థితులు పర్యాటకులకు ఎంతగానో ఆనందం కలిగిస్తున్నాయి. మంచు తెరలతో కప్పుకుని ఉన్న ఈ ప్రాంతాలను చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు ప్రతీ శీతాకాల సీజన్ లో వస్తారు. అల్లూరి జిల్లాలో ఎన్నో టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలీ అంటే వింటర్ సీజన్ పర్యాటకులకు ఇక్కడ ఒక స్వర్గధామంలా ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతంలో కురిసే దట్టమైన పొగమంచు కనువిందు చేసే తెల్లని మేఘాల ఊరేగింపు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇక లంబసింగిని ఆంధ్రా కాశ్మీర్ అని పిలుస్తారు. ఇక్కడ ఇటీవల కాలంలో ట్రెండింగ్‌లోకి వచ్చిన అత్యంత ప్రజాదరణ పొందిన వంజంగి కొండలు ఉంది. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండలపై నిలబడి చూస్తే కింద మేఘాల సముద్రంలా కనిపిస్తుంది. ఇక్కడి సూర్యోదయ దృశ్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.

ఎన్నెన్నో అందాలు :

అదే విధంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకునే వారికి అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు. సరైన ప్రదేశాలుగా ఎన్నో ఉన్నాయి. చాపరాయి వద్ద ప్రవహించే నీటి జలపాతాలతో పాటు అడవుల మధ్య ఉండే కటికి జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అల్లూరి జిల్లా ఏజెన్సీ అందాలను పూర్తిగా ఆస్వాదించడానికి నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు శీతాకాల సీజన్ అత్యంత అనుకూలమైనదిగా ఉంటుంది. గంభీరమైన కొండలు, ఉప్పొంగే జలపాతాలు మైమరిపింపజేస్తున్న మేఘాల దృశ్యాలు ఇవన్నీ ఇప్పుడు పర్యాటకులను తొందర పెడుతున్నాయి.

Tags:    
  • alluriagency 
  • lambasingi 
  • araku 
  • paderu 
  • chintapalli 
  • winterseason 

Similar News

ఊపిరి ఆడడం లేదు.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్య భూతం.. బతికేదెలా?

2026-11-09 05:26 GMT

25 ఏళ్లలో ప్రకృతి ఎంత మారిపోయింది.. సీతాకోకచిలుకలే కనిపించకుండా పోతున్నాయా?

2026-11-01 05:47 GMT

రాబోయే 72 గంటలు ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకం.. మరో తుఫాన్ ఎక్కడ తీరం దాటుతోందంటే?

2026-11-01 04:11 GMT

తెలంగాణ లో వారానికి ఐదు రోజులే ...ఎల్ నినో ఎఫెక్ట్ ?

2026-10-31 04:01 GMT

ఏపీకి మరో బిగ్ అలర్ట్: ఆదివారం నుంచి రెండు రోజుల భారీ వర్షాలు!

2026-10-30 07:31 GMT

ఎల్ నినో పడగ ... భారత్ లో 55 వేల మరణాలు తధ్యమా ?

2026-10-30 03:33 GMT

ఆర్నాద్ ఏపీకి చేసిన గొప్ప మేలు ఇదే !

2026-10-30 03:31 GMT

మున్సిపల్ ఎన్నికలకు గండం.. ఒకటో తేదీకి భారీ వర్ష సూచన

2026-10-29 07:00 GMT

ప్రకృతి పగబడితే ఎలా ఉంటుందో తెలుసా? ఈ వీడియో చూడండి

2026-10-29 06:43 GMT

తుఫాన్ తీరం దాటడం అంటే ఏంటి? నేల మీదికి వచ్చాక ఏమవుతుంది?

2026-10-28 10:34 GMT

Copyright @2026

Powered by Blink CMS