• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Weather >  ఊపిరి ఆడడం లేదు.....

ఊపిరి ఆడడం లేదు.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్య భూతం.. బతికేదెలా?

| ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో నగరం గ్యాస్ ఛాంబర్‌ను తలపిస్తోంది. వాహనాల పొగ, పరిశ్రమలు, రోడ్ల ధూళి, పంట వ్యర్థాల దహనం కాలుష్యానికి కారణమవుతున్నాయి. PM2.5 స్థాయులు పెరగడంతో చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

By - A.N.Kumar
Update: 2026-11-09 05:26 GMT

మనం పీల్చే ప్రతి గాలీ ప్రాణాన్ని బలిగొనే విషంగా మారుతుంటే.. దేశ రాజధానిలో బతకడమే ఒక నేరమా? రేపు ఉదయం బ్రతికి బయటపడతామో లేదోనన్న భయంతో ప్రతి రోజూ పొగమంచు తెరల చాటున ఊపిరిసలపకండా గడిపే ఆ అభాగ్యుల ఆవేదన ఎవరికి వినిపిస్తుంది? గుండెల నిండా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం ప్రతి మనిషి ప్రాథమిక హక్కు. కానీ అభివృద్ధికి ప్రతీకగా నిలవాల్సిన దేశ రాజధానిలో చిన్నారులు పసి ప్రాయంలోనే ఉబ్బసంతో కొట్టుమిట్టాడుతుంటే వృద్ధులు ఆక్సిజన్ అందక ఉక్కిరిబిక్కిరవుతుంటే.. కన్నతల్లి లాంటి ఈ సమాజం నిశ్శబ్దంగా వారిని ఊపిరిసలపకుండా చూస్తూ కూర్చోవడం కంటే పెద్ద విషాదం మరొకటి ఉంటుందా? మన నిర్లక్ష్యం వల్ల భావితరాలకు మనం ఇస్తున్న కానుక ఈ కాలుష్య నరకమేనా?

అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలవాల్సిన దేశ రాజధాని ఢిల్లీ.. ప్రతి ఏటా శీతాకాలం వచ్చేసరికి దేశం గర్వపడేలా చేయడం మానేసి.. శ్వాస ఆడక విలవిల్లాడేలా చేయడంలో రికార్డులు సృష్టిస్తోంది. ఈసారీ అదే తంతు పునరావృతం కావడంతో నగరమంతా ఒక పెద్ద గ్యాస్ ఛాంబర్‌ను తలపిస్తోంది. ఎటు చూసినా దట్టమైన కాలుష్య మేఘాలు కమ్ముకుని ఏకంగా పగటిపూటే సూర్యుడికి సెలవు ప్రకటించే పరిస్థితి వచ్చింది!

రోడ్లపై నడుస్తుంటే ఎవరో కావాలనే పొగతెరలు అడ్డుపెట్టారా అనిపిస్తుంది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక డ్రైవర్లు దేవుడిపై భారమేసి బండ్లు నడుపుతున్నారు. ఉద్యోగాలకు వెళ్లే అమాయక జీవులు.. బడికి వెళ్లే చిన్నారులు ఈ విషపూరిత వాతావరణంలోనే మార్నింగ్ వాక్‌లు, జాగింగ్‌లు చేస్తూ ఉబ్బసపు వ్యాధులకు స్వాగతం పలుకుతున్నారు. కళ్ల మంటలు.. గొంతు బొంగురుపోవడం ఇక్కడ సర్వసాధారణమైన సౌకర్యాలుగా మారిపోయాయి.

ఇక కాలుష్యానికి కారణాలపై చర్చోపచర్చలు మాత్రం ప్రతి ఏటా హాట్ టాపిక్‌గానే మిగులుతాయి. వాహనాల పొగ, ఫ్యాక్టరీలు వదిలే మురుగు, రోడ్లపై ఎగిసే ధూళి.. వీటికి తోడు పొరుగు రాష్ట్రాల్లో తగలబెట్టే పంట వ్యర్థాలు.. అబ్బా వీటన్నింటికీ మన వాతావరణం కూడా లాలూచీ పడి కాలుష్యాన్ని మరింత రక్తి కట్టిస్తోంది. పీఎం 2.5 కణాలు ఏకంగా ఊపిరితిత్తుల్లోకి చొరబడి మనుషులను లోపలి నుంచే తొలిచేస్తున్నా.. నాయకులు మాత్రం అత్యవసర సమావేశాల పేరుతో ఏసీ గదుల్లో కూర్చుని చలికాచుకుంటూ ఉంటారు.

ప్రతిసారీ తాత్కాలిక హంగులతో.. కృత్రిమ వర్షాలంటూ బురద జల్లే ఆపరేషన్లంటూ కాలక్షేపం చేయడం మినహా శాశ్వత పరిష్కారం వైపు ఎవరూ కన్నెత్తి చూడరు. కోట్లాది మంది ప్రజల ప్రాణాలు గాలికొదిలేసి రాజకీయం చేసుకోవడానికి మాత్రం ఇదే అదనుగా భావిస్తారు. విదేశీ రాయబార కార్యాలయాలు కూడా ఢిల్లీ వాతావరణాన్ని చూసి జాలి పడుతుంటే మన పాలకులకు మాత్రం ఎన్నికల హడావుడి మినహా ఈ బ్రీతింగ్ సమస్య పెద్దగా పట్టనట్లుంది.

చివరకు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే హక్కు కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే ‘గ్యాస్ ఛాంబర్ రాజధాని’గా మారుతున్న ఢిల్లీని చూసి నవాబులు సైతం నవ్వుకుంటున్నారేమో.. ఇప్పటికైనా ఈ రాజకీయ కాలుష్యాన్ని పక్కన పెట్టి.. ప్రజల ఊపిరిని కాపాడే గట్టి చర్యలు తీసుకోకపోతే.. రాబోయే రోజుల్లో ఢిల్లీలో తిరగడానికి మాస్కులు కాదు కదా ఆక్సిజన్ సిలిండర్లు వీపున వేసుకునే దుస్థితి తప్పదు.

Visibility in Delhi! It is literally a gas chamber https://t.co/FZvXqPCaDx

— Anuradha Shukla (@anu1122) November 8, 2026
Tags:    
  • delhiairpollution 
  • delhipollution 
  • airquality 
  • airpollutioncrisis 
  • environment 

Similar News

భూమి మీద ఇక నివసించలేమా...భయపెడుతున్న నివేదిక !

2026-11-19 04:57 GMT

పాలకులకు 'ఎల్ నినో' దడ.. 2004 నాటి చరిత్ర మళ్లీ రిపీట్ కానుందా?

2026-11-17 17:38 GMT

తుఫాన్ విపత్తుల అసలు లింకు ఎక్కడ ఉందో తెలుసా?

2026-11-17 10:31 GMT

తీరం దిశగా దూసుకొస్తున్న అక్వాన్ : ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన హెచ్చరికలు

2026-11-16 19:08 GMT

నెమ్మదిగా కదులుతున్న తీవ్ర వాయుగుండం.. తీరానికి భారీ ముప్పు

2026-11-16 07:56 GMT

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

2026-11-15 06:18 GMT

ఉత్తర కోస్తాకు మరో తుపాను ముప్పు: 18న అర్ధరాత్రి తీరం దాటే అవకాశం

2026-11-14 06:54 GMT

మంచు తెరలతో పర్యాటకులకు స్వాగతం

2026-11-11 01:42 GMT

25 ఏళ్లలో ప్రకృతి ఎంత మారిపోయింది.. సీతాకోకచిలుకలే కనిపించకుండా పోతున్నాయా?

2026-11-01 05:47 GMT

రాబోయే 72 గంటలు ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకం.. మరో తుఫాన్ ఎక్కడ తీరం దాటుతోందంటే?

2026-11-01 04:11 GMT

తెలంగాణ లో వారానికి ఐదు రోజులే ...ఎల్ నినో ఎఫెక్ట్ ?

2026-10-31 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS