• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Weather >  తీరం దిశగా దూసుకొస్తున్న...

తీరం దిశగా దూసుకొస్తున్న అక్వాన్ : ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన హెచ్చరికలు

| బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తుపాను గురువారం నాటికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శుక్రవారం నెల్లూరు-తుని మధ్య తీరం దాటే సూచనలు ఉన్నాయని, గంటకు 120-130 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముందని అంచనా వేశారు. గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అత్యవసర సాయం కోసం 112, 1070 నంబర్లను సంప్రదించాలి.

By - Tupaki Political Desk
Update: 2026-11-16 19:08 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ తుపానుకు 'అక్వాన్'గా నామకరణం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను, ప్రస్తుతం చెన్నైకి 610 కి.మీ, మచిలీపట్నానికి 660 కి.మీ, విశాఖపట్నానికి 670 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. రేపు సాయంత్రానికి ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం అక్వాన్ తుపాను పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణిస్తూ గురువారం ఉదయానికి 'అతి తీవ్ర తుపాను'గా బలపడనుంది. అనంతరం శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు - తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్లు, గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని తెలిపారు. సముద్రం అత్యంత అలజడిగా మారి అలలు భారీగా ఎగసి పడనున్నందున మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని, పడవలు, తెప్పలను సురక్షిత ప్రాంతాల్లో బలమైన తాడులతో కట్టి ఉంచాలని సూచించారు.

తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో ఎల్లుండి నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు ప్రారంభమవుతాయని, ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 19వ తేదీ గురువారం ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ బలమైన ఈదురు గాలులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు; శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఇక 20వ తేదీ శుక్రవారం తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో అత్యంత భారీ వర్షాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తమ వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తుపాను ముప్పు నుంచి ప్రాణ, ఆస్తినష్టాలను నివారించేందుకు ప్రజలు తగిన ముందస్తు జాగ్రత్తలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరుతోంది. ప్రజలు ఎటువంటి వదంతులను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని, విపత్తుల సంస్థ, ఆర్టీజిఎస్, ఐఎండి అందించే అధికారిక సమాచారాన్ని మాత్రమే గమనించాలని స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్లను పూర్తిగా ఛార్జ్ చేసి ఉంచుకోవడంతో పాటు విలువైన పత్రాలను వాటర్ ప్రూఫ్ కవర్లలో భద్రపరుచుకోవాలని సూచించింది. కనీసం వారం రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, తాగునీరు సిద్ధం చేసుకోవాలి. ఇంటి పైకప్పు, తలుపులు, కిటికీలు బలంగా ఉన్నాయో లేదో ముందే తనిఖీ చేసుకోవాలి.

తుపాను తీరం దాటే సమయంలో ఇంట్లో ఉండేవారు ఎలక్ట్రికల్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి, గ్యాస్ కనెక్షన్లను తొలగించి తలుపులు, కిటికీలు గట్టిగా మూసి ఉంచాలి. ఇల్లు సురక్షితంగా లేదని భావిస్తే ముందే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లడం ఉత్తమం. వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనల మేరకు ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ఇంట్లో ఉన్నవారు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. ఒకవేళ భవనం దెబ్బతినే సూచనలు కనిపిస్తే బలమైన టేబుల్ లేదా బెంచ్ కింద తలదాచుకోవాలి. బయట ఉన్నవారు పాత భవనాల్లోకి వెళ్లకూడదని, చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల కింద అస్సలు నిలబడకూడదని అధికారులు హెచ్చరించారు.

తుపాను వెలిసిన తర్వాత కూడా అధికారిక ప్రకటన వచ్చే వరకు పునరావాస కేంద్రాలను వదిలి ఇళ్లకు వెళ్లకూడదు. తెగిపడిన విద్యుత్ తీగలు, విరిగిన స్తంభాల పట్ల తీవ్ర అప్రమత్తతతో వ్యవహరించాలి. నీటిలో తడిసిన లేదా దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలక్ట్రీషియన్ చేత తనిఖీ చేయించిన తర్వాతే వినియోగించాలి. ఇప్పటికే ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, తుపాను వల్ల ఎలాంటి సమస్య ఎదురైనా 'మన మిత్ర' వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా వెంటనే తెలియజేయవచ్చని ప్రఖర్ జైన్ తెలిపారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101 లను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Tags:    
  • cycloneaqwan 
  • andhrapradesh 
  • cyclonealert 

Similar News

నెమ్మదిగా కదులుతున్న తీవ్ర వాయుగుండం.. తీరానికి భారీ ముప్పు

2026-11-16 07:56 GMT

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

2026-11-15 06:18 GMT

ఉత్తర కోస్తాకు మరో తుపాను ముప్పు: 18న అర్ధరాత్రి తీరం దాటే అవకాశం

2026-11-14 06:54 GMT

మంచు తెరలతో పర్యాటకులకు స్వాగతం

2026-11-11 01:42 GMT

ఊపిరి ఆడడం లేదు.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్య భూతం.. బతికేదెలా?

2026-11-09 05:26 GMT

25 ఏళ్లలో ప్రకృతి ఎంత మారిపోయింది.. సీతాకోకచిలుకలే కనిపించకుండా పోతున్నాయా?

2026-11-01 05:47 GMT

రాబోయే 72 గంటలు ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకం.. మరో తుఫాన్ ఎక్కడ తీరం దాటుతోందంటే?

2026-11-01 04:11 GMT

తెలంగాణ లో వారానికి ఐదు రోజులే ...ఎల్ నినో ఎఫెక్ట్ ?

2026-10-31 04:01 GMT

ఏపీకి మరో బిగ్ అలర్ట్: ఆదివారం నుంచి రెండు రోజుల భారీ వర్షాలు!

2026-10-30 07:31 GMT

ఎల్ నినో పడగ ... భారత్ లో 55 వేల మరణాలు తధ్యమా ?

2026-10-30 03:33 GMT

ఆర్నాద్ ఏపీకి చేసిన గొప్ప మేలు ఇదే !

2026-10-30 03:31 GMT

Copyright @2026

Powered by Blink CMS