• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Guntur >  పవన్ కళ్యాణ్ విడాకులపై...

పవన్ కళ్యాణ్ విడాకులపై ’అంబటి’ రియాక్షన్ వైరల్

| పవన్ కళ్యాణ్ విడాకుల వ్యవహారం పూర్తిగా వ్యక్తిగత విషయమని, దీనిపై ఎవరూ స్పందించవద్దని టీడీపీ, వైసీపీ అధిష్టానాలు తమ నేతలు, కార్యకర్తలకు సూచించాయి. మరోవైపు, అంబటి రాంబాబు సైతం పవన్ వ్యక్తిగత విషయాలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు.

By - A.N.Kumar
Update: 2026-11-11 01:45 GMT

ఒక విషయంలో మాత్రం ఏపీ రాజకీయ పార్టీలను, రాజకీయ నేతలను మెచ్చుకొని తీరాలి. ఈరోజు తెల్లవారుతూనే ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ విడాకుల వార్త తెలుగు జనాలను షాక్ కు గురిచేసింది. అస్సలు ఊహించని ఈ వార్తతో అందరూ ఖిన్నులయ్యారు. అసలు ఇది ఫేక్ వార్త అని అథెంటిక్ సోర్స్ కోసం వెతికన వారు చాలా మంది ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఇది కన్ఫమ్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు.

ఇప్పటికే పవన్ విడాకులు ఎందుకు తీసుకున్నారు? కారణాలేంటి? అన్న దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చోపచర్చలు సాగుతున్నాయి. అయితే పవన్ విడాకులు అన్నది పూర్తిగా ఆయన వ్యక్తిగత వ్యవహారం. వారిద్దరూ పరస్పర అంగీకారంతో తీసుకున్న నిర్ణయమిదీ.. దానికి అందరూ గౌరవించాలి.

అయితే గత 2019లో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు పవన్ విమర్శలకు కౌంటర్ గా ఆయన పెళ్లిళ్లు విడాకులను టార్గెట్ చేసి మాట్లాడారు. అయితే అది 2024 ఎన్నికల్లో వైసీపీకి తీరని నష్టాన్ని మిగిల్చిందని విశ్లేషకులు అంచనావేశారు. వైసీపీకి కూడా పవన్ పై వ్యాఖ్యలు మైనస్ అయ్యాయని.. అందుకే వైఎస్ జగన్ సైతం ప్రెస్ మీట్లలో పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు.. స్కిప్ చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఏపీలోని రెండు ప్రముఖ పార్టీలు సైతం ఈరోజు ఒక గొప్పనిర్ణయం తీసుకొని స్ఫూర్తిని చాటాయి. తెలుగునేలపై ఇలాంటి అరుదైన సందర్భం రెండు వైసీపీ, టీడీపీ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ‘పవన్ విడాకుల’పై ఎవరూ స్పందించవద్దని.. నోరుపారేసుకోవద్దని రెండు పార్టీల అధిష్టానాలు తమ నేతలు, కార్యకర్తలకు బహిరంగంగా ఆదేశాలు జారీ చేయడం సంచలనమైంది. ఒక డిప్యూటీ సీఎం వ్యక్తిగత వ్యవహారంలో తలదూర్చవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. ఈ పరిణామం తెలుగునాట ఒక అర్థవంతమైన రాజకీయానికి నాంది పడిందనే చెప్పాలి.

ఇక ప్రతీసారి తోటి కాపు నేత అయిన పవన్ పై విరుచుకుపడే అంబటి రాంబాంబు సైతం ఈసారి పవన్ విడాకులపై హుందాగా స్పందించడం వైరల్ అయ్యింది. ‘పవన్ కళ్యాణ్ వివాహాలు, విడాకులు అనేవి పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయమని.. వాటి గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని’ అంబాబు రాంబాబు చాలా మెచ్చ్యూర్డ్ పొలిటీషియన్ లా స్పందించి శభాష్ అనిపించుకున్నారు.

ఇక పేర్ని నాని లాంటి నేతలు ఎప్పుడూ పవన్ ను తిట్టిపోస్తుంటారు. ఈ విడాకుల విషయంలో ఆయన కూడా సైలెంట్ గా ఉన్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో.. నేతల్లో వచ్చిన ఈ గొప్ప మార్పును అందరూ స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    
  • pawankalyan 
  • pawankalyandivorce 
  • tdp 
  • ysrcp 
  • ambatirambabu 
  • perninani 

Similar News

అమరావతిలో మెగా రైల్వే స్టేషన్.. 24 ప్లాట్‌ఫారాలు, రోజుకు 3 లక్షల మంది ప్రయాణికులు!

2026-11-13 10:24 GMT

మంగళగిరి-తాడేపల్లి సమరం: నారా లోకేశ్‌కు అసలైన పరీక్ష.. వైసీపీకి జీవన్మరణ పోరాటం!

2026-11-12 13:56 GMT

'అప్పిరెడ్డి'పై అనుమానాలు.. గుంటూరు వైసీపీలో ఏం జ‌రిగింది..?

2026-11-08 16:30 GMT

గుంటూరు కోవెలమూడికే మొగ్గు.. అయినా తేడా కొడుతోందా.. ?

2026-10-31 15:30 GMT

మేము కూడా అంతే ఆర్గానిక్ ఎలక్షన్స్ కు వెళుతున్నాం!

2026-10-30 14:30 GMT

జగన్ కేబినెట్ లో అంబటి హోంమంత్రి !

2026-10-19 02:51 GMT

బాబుకు మొదట గుర్తొచ్చె మంత్రి ఆయనేనట !

2026-10-05 03:33 GMT

కాంగ్రెస్ మీద బాబు పొలిటికల్ టోన్ చేంజ్ ?

2026-10-04 19:02 GMT

సీఎం అంటే...జగన్ కేనా బాబు చెప్పింది ?

2026-10-01 18:04 GMT

జనసేన నేత హత్యకు సుపారీ.. అసలు వాస్తవం వేరే.. వైసీపీ నేత సెల్ఫీ వీడియో

2026-08-18 09:34 GMT

అంబ‌టి.. 'యాత్ర' .. వాస్త‌వం ఏంటి?

2026-07-31 03:57 GMT

Copyright @2026

Powered by Blink CMS