• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Guntur >  మంగళగిరి-తాడేపల్లి సమరం:...

మంగళగిరి-తాడేపల్లి సమరం: నారా లోకేశ్‌కు అసలైన పరీక్ష.. వైసీపీకి జీవన్మరణ పోరాటం!

| మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. మేయర్ స్థానం ఎస్టీలకు రిజర్వ్ కావడంతో టీడీపీ, వైసీపీ వ్యూహాలపై ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికలు లోకేశ్‌కు ఎమ్మెల్యేగా తొలి స్థానిక సంస్థల ఎన్నికల పరీక్షగా మారనున్నాయి.

By - Tupaki Political Desk
Update: 2026-11-12 13:56 GMT

రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన రాజధాని ప్రాంత పరిధిలోని మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన నియోజకవర్గంగా ఉన్న మంగళగిరిలో ఈ కార్పొరేషన్‌కు తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో మున్సిపల్ పోరు రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వంద పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 13 కార్పొరేషన్లు ఉండగా, 12 కార్పొరేషన్లను కూటమి గెలుచుకుంది. ఇప్పుడు నాలుగు కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, అందరి దృష్టిని మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఆకర్షిస్తోంది.

గత కొంతకాలంగా మంగళగిరి రాజకీయాల్లో నారా లోకేశ్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓటమి చవిచూసిన లోకేశ్, ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలతో మమేకై బలమైన నాయకుడిగా ఎదిగారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మూడో అత్యధిక మెజార్టీతో ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా అభివృద్ధి సంస్కరణలను వేగవంతం చేయడంతో పాటు నియోజకవర్గంలో పట్టు మరింత బిగించారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలతోనూ అనుబంధం పెంచుకునేలా పాలన సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి కుమారుడిగా రాష్ట్రంలో అత్యంత కీలక స్థానంలో ఉన్న లోకేశ్ మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు. అయితే ఇందులో ఆయనకు పెద్ద సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఏవీ కనిపించకపోయినప్పటికీ, ఇంకా క్షేత్రస్థాయిలో వైసీపీ బలం తెలుసుకునే అవకాశం ఈ ఎన్నికల ద్వారా లభించినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీకి వచ్చే ఓట్లను బట్టి లోకేశ్ పనితీరును అంచనా వేయొచ్చనని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, ఈ నియోజకవర్గంలో తన ఉనికిని కాపాడుకోవడానికి వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ పార్టీ పూర్తిగా చతికిలపడటంతో కేడర్ నిస్తేజంగా మారిపోయిందని చెబుతున్నారు. మంత్రిగా నారా లోకేశ్ దూకుడు, నియోజకవర్గంలో ఆయన ప్రభావాన్ని తట్టుకోలేక వైసీపీ ఇప్పటికే నాయకత్వ పరంగా పలు మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు నలుగురు ఇంచార్జులను మార్చినప్పటికీ, పార్టీలో నైతిక స్థైర్యం నింపడం ఆ పార్టీ అధి నాయకత్వానికి సవాల్‌గా మారిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వైసీపీకి జీవన్మరణ పోరాటంగా మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ కార్పొరేషన్ మేయర్ స్థానం ఎస్టీ (ST) వర్గానికి రిజర్వు కావడం అధికార తెలుగు దేశం పార్టీకి అదనపు బలంగా మారుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎస్టీలకు రిజర్వు అయిన ఈ స్థానంలో టీడీపీ ఎవరిని అభ్యర్థిగా బరిలోకి దింపినా గెలుపు నల్లేరు మీద నడకలా సాగుతుందని భావిస్తున్నారు. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, లోకేశ్ నాయకత్వ ప్రభావం కారణంగా మెజారిటీ డివిజన్లలో టీడీపీ అభ్యర్ధులదే పైచేయి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

అయితే, ఈ ప్రతికూల వాతావరణంలోనూ వైసీపీ ఏ స్థాయిలో పోరాడుతుందనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమైంది. పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసి అధికార పార్టీని ఏ విధంగా ఎదుర్కొంటుంది, బలమైన మేయర్ అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందనేది ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయించనుందని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, రాజధాని నడిబొడ్డున ఉన్న మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడానికి జరిగే ఈ పోరు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.

Tags:    
  • naralokesh 
  • mangalagiri 
  • tadepalli 
  • tdp 
  • ysrcp 

Similar News

అమరావతిలో మెగా రైల్వే స్టేషన్.. 24 ప్లాట్‌ఫారాలు, రోజుకు 3 లక్షల మంది ప్రయాణికులు!

2026-11-13 10:24 GMT

పవన్ కళ్యాణ్ విడాకులపై ’అంబటి’ రియాక్షన్ వైరల్

2026-11-11 01:45 GMT

'అప్పిరెడ్డి'పై అనుమానాలు.. గుంటూరు వైసీపీలో ఏం జ‌రిగింది..?

2026-11-08 16:30 GMT

గుంటూరు కోవెలమూడికే మొగ్గు.. అయినా తేడా కొడుతోందా.. ?

2026-10-31 15:30 GMT

మేము కూడా అంతే ఆర్గానిక్ ఎలక్షన్స్ కు వెళుతున్నాం!

2026-10-30 14:30 GMT

జగన్ కేబినెట్ లో అంబటి హోంమంత్రి !

2026-10-19 02:51 GMT

బాబుకు మొదట గుర్తొచ్చె మంత్రి ఆయనేనట !

2026-10-05 03:33 GMT

కాంగ్రెస్ మీద బాబు పొలిటికల్ టోన్ చేంజ్ ?

2026-10-04 19:02 GMT

సీఎం అంటే...జగన్ కేనా బాబు చెప్పింది ?

2026-10-01 18:04 GMT

జనసేన నేత హత్యకు సుపారీ.. అసలు వాస్తవం వేరే.. వైసీపీ నేత సెల్ఫీ వీడియో

2026-08-18 09:34 GMT

అంబ‌టి.. 'యాత్ర' .. వాస్త‌వం ఏంటి?

2026-07-31 03:57 GMT

Copyright @2026

Powered by Blink CMS