ఆ ఎమ్మెల్యే రాజీనామాతో.. అక్కడి ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి
పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారపక్షానికి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేసిన వైనం సంచలనంగా మారింది. దీనికి కారణం.. ఎమ్మెల్యే రాజీనామాతో అక్కడి ప్రభుత్వం పడిపోయే ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఇంతకూ ఆ ప్రభుత్వం ఏది? అంతలా చెమటలు పట్టిస్తున్న ఎమ్మెల్యే ఎవరు? ఆయన ఎందుకు రాజీనామా చేశారు? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతికితే..
పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి.. యానాం ఎమ్మెల్యే మల్లాడి క్రిష్ణారావు తన మంత్రి పదవికి ఈ మధ్యనే రాజీనామా చేయటం తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో కలకలం రేగింది. మల్లాడి తీసుకున్న నిర్ణయంతో పుదుచ్చేరి ప్రభుత్వానికి నూకలు చెల్లే పరిస్థితి నెలకొందన్న మాట వినిపిస్తోంది.
మల్లాడి నిర్ణయం కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాజకీయ సంచలనంగా మారింది. యానం నుంచి పలుమార్లు గెలుపొందిన ఆయన రాజీనామాతో.. నారాయణ స్వామి సర్కారు ప్రమాదంలో పడినట్లైంది. అయితే.. మల్లాడి రాజీనామా లేఖ తనకు చేరలేదని.. ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఇంతకీ మల్లాడి వారు ఎందుకు తన పదవులకు రాజీనామా చేస్తున్నారన్నది చూస్తే.. పాతికేళ్లుగా ప్రజాజీవితంలో ఉండటంతో పాటు.. అనేక పదువుల్ని అందుకున్న ఈ కాంగ్రెస్ సీనియర్ నేత.. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తన పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఇకపై ఇతర మార్గాల్లో సేవ చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యే మల్లాడికి పోయే దానికన్నా.. అక్కడి ప్రభుత్వానికే ఇప్పుడు కొత్త తిప్పలు ఎదురైన పరిస్థితి.