యుద్ధ సంక్షోభం సుదీర్ఘ కాలం...కేంద్రం సంకేతాలు ?

మొత్తానికి కేంద్రం పశ్చిమాసియా యుద్ధం మీద ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 28న ఈ యుద్ధం అకస్తాత్తుగా మొదలైంది.;

Update: 2026-03-27 18:30 GMT

మొత్తానికి కేంద్రం పశ్చిమాసియా యుద్ధం మీద ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 28న ఈ యుద్ధం అకస్తాత్తుగా మొదలైంది. ఆనాడు ఇది ఏ కొద్ది రోజులో జరిగి ఆగుతుందని అంతా అనుకున్నారు. కేంద్రం కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ వచ్చింది. యుద్ధం మూడు వారాలు దాటినా తీవ్రంగానే ఉండడంతో కేంద్రానికి విషయం పూర్తిగా అర్థం అయింది అని అంటున్నారు. ఈ వారంలో మోడీ అటు లోక్ సభ ఇటు రాజ్యసభలో చేసిన కీలక ప్రకటనల బట్టి చూస్తే ఈ యుద్ధం మరింత కాలం కొనసాగుతుందా అన్న డౌట్లు వచ్చేశాయి. అంతే కాదు కరోనాతో పోలిక తెస్తూ అన్న మాటలు కూడా కొంత కలవరం రేపాయి.

సీఎంలతో అదే మాట :

ఇక నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఢిల్లీ నుంచి వర్చువల్ గా నిర్వహించిన అతి ముఖ్యమైన సమావేశంలో సైతం రాష్ట్రాలను ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ చెబుతూ దిశా నిర్దేశం చేశారు. అంతే కాదు కరోనా వంటి ప్రపంచ విపత్తుని ఇదే టీం ఇండియా స్పిరిట్ తో ఎదుర్కొన్న అనుభవం ఇండియాకు ఉందని మోడీ చెప్పడం విశేషం. అంటే కరోనా నెలల తరబడి సాగింది. గట్టిగా చెప్పాలీ అంటే ఒక ఏడాది తీవ్రంగా మరో ఏడాది పాక్షికంగానూ ప్రభావం చూపించింది. ఇపుడు పశ్చిమాసియాలో యుద్ధం కూడా దీర్ఘకాలం కొనసాగుతుందా అన్న చర్చ అయితే మోడీ రాష్ట్రాలతో నిర్వహించిన మీటింగ్ తర్వాత వ్యక్తం అవుతోంది అని అంటున్నారు.

సమిష్టిగానే అంటూ :

ఇప్పటిదాకా కేంద్రం తన స్థాయిలో తాను ఈ సంక్షోభం మీద చేపట్టాల్సిన చర్యలు చేపడుతోంది. ఇపుడు రాష్ట్రాలు కూడా కీలక పాత్ర పోషించాలని చెప్పడం అంటే యుద్ధం కొన్నాళ్ళు కొనసాగుతుందని అంచనాకు వచ్చినట్లేనా అన్న డౌట్లు వస్తున్నాయి. రాష్ట్రాలు కూడా నిరంతరం మోనిటరింగ్ చేసుకోవాలని సరఫరా గొలుసు కట్టు వ్యవస్థకు బ్రేకులు లేకుండా చర్యలు చేపట్టాలని మోడీ కోరారు. అంతే కాదు సమిష్టిగానే పనిచేయాలని అన్నారు. కో ఆర్డినేషన్ అతి ముఖ్యమని నొక్కి చెప్పారు.

న్యూట్రల్ గా ఉంటూనే :

ఇక పశ్చిమాసియా యుద్ధంలో భారత్ న్యూట్రల్ గా ఉంటూనే అందరితో మాట్లాడుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోడీకి స్వయంగా ఫోన్ చేశారు. ఇక మోడీ ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడుతున్నారు. దాని కంటే ముందు ఇజ్రాయెల్ వెళ్ళి వచ్చారు. గల్ఫ్ కంట్రీస్ తో కూడా చర్చిస్తున్నారు. ఈ విధంగా చూస్తే అంతర్జాతీయ పరిణామాల మీద కేంద్రానికి పూర్తి అవగాహన ఉందని అంటున్నారు. మరో వైపు చూస్తే యుద్ధం మొదలైంది కానీ ఆగడం అన్నది ఎవరి చేతులలోనూ లేదు, ఇది ఇగోలతో మొదలైన యుద్ధం, అసహజ యుద్ధం అని అంటున్నారు. పేరుకు ఇరాన్ మీద యుద్ధం అణు ఆయుధాలు అని అంటున్నారు కానీ తెర వెనక చాలా అంశాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే ఈ విషయాల మీద ఫుల్ ఫోకస్ తో ఉన్న కేంద్రం రాష్ట్రాలని తమ పని మొదలెట్టాలని అతి పెద్ద సంక్షోభాన్ని అంతా కలసికట్టుగా ఎదుర్కొందామని పిలుపు ఇచ్చారని అంటున్నారు. సో మోడీ సీఎంలతో మీట్ అయితే కేంద్రం సీరియస్ గానే స్టెప్స్ వేస్తోంది అన్నది అర్ధం అయింది అని అంటున్నారు.

Tags:    

Similar News