పాతబస్తీ కాషాయమయం ....రాజా సింగ్ నా మజాకా !

పాత బస్తీలో జై శ్రీరాం నినాదాలతో రీ సౌండ్ చేయించిన రాజా సింగ్ మొత్తం కాషాయమయం చేస్తి కిలోమీటర్ల మేర భక్తి ప్రవాహాన్ని పారించేశారు.;

Update: 2026-03-27 18:30 GMT

తెలంగాణా బీజేపీలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే, జనంలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న నాయకుడు, స్ట్రాంగ్ హిందూత్వ లీడర్ ఘోషా మహల్ ఎమ్మెల్యే అయిన రాజా సింగ్ శ్రీరామ నవమి వేళ తన రామ భక్తితో విశ్వ రూపమే చూపించారు. ఏకంగా వేలాది మంది జనంతో పాతబస్తీ వీధులలో రాజా సింగ్ తీసిన ర్యాలీ అయితే నభూతో నభవిష్యతి అన్నట్లుగా సాగింది. పాత బస్తీలో జై శ్రీరాం నినాదాలతో రీ సౌండ్ చేయించిన రాజా సింగ్ మొత్తం కాషాయమయం చేస్తి కిలోమీటర్ల మేర భక్తి ప్రవాహాన్ని పారించేశారు.

అద్భుతంగా శోభా యాత్ర :

రాజా సింగ్ నాయకత్వంలో శ్రీరామ నవమి ఉత్సవాలు పెద్ద ఎత్తున ఘోషా మహల్ ప్రాంతంలో సాగాయి. అనంతరం సాయంత్రం నిర్వహించిన శోభా యాత్రలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. దారి పొడవునా జై శ్రీ రాం నినాదాలతో హోరెత్తిపోయింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో శ్రీరాం శబ్దంతో మారు మోగిపోయింది. ఎక్కడ చూసినా భక్త జన సందోహం. ఇసుక వేస్తే రాలనంతగా శోభా యాత్రలో వారు పాల్గొన్నారు. దాంతో కాషాయ మయంగా పరిసరాలు కనిపించాయి.

పెద్ద ఎత్తున పోలీసుల పహరా :

పాతబస్తీలో ఒక వైపు వేలాది మందితో శోభా యాత్రని నిర్వహిస్తూండడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎమ్మెల్యే రాజా సింగ్ కి బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన చుట్టూ భద్రతను పటిష్టం చేశారు. అలాగే కట్టుదిట్టమైన పోలీసుల భద్రత మధ్యన శోభా యాత్ర ఘనంగా సాగింది. అడుగడుగునా సీసీ కెమెరాలు డ్రోన్లతో పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు.

పవర్ ఫుల్ స్పీచ్ తో :

ఎమ్మెల్యే రాజా సింగ్ పవర్ ఫుల్ స్పీచ్ తో భక్తులను ఉత్సాహ పరచరారు. జై శ్రీరాం అంటూ వారి చేత నినాదాలు ఇప్పించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన ఇతర నాయకులు కూడా శోభాయాత్ర గురించి జనాలను వివరిస్తూ భావోద్వేగపూరితమైన ప్రసంగాలు చేశారు. ఇదిలా ఉంటే రాజా సింగ్ బీజేపీ నుంచి సస్పెండ్ చేయబడ్డారు. ఆయన ఆ పార్టీ ఎమ్మెల్యే కారు, మరే పార్టీలోనూ చేరలేదు, తిరిగి బీజేపీలో చేరుతారు అని ప్రచారం సాగుతున్న వేళ రాజా సింగ్ పాత బస్తీలో నిర్వహించిన ఈ అద్భుతమైన శోభా యాత్రతో హైలెట్ అయ్యారు. జన బలం నుండుగా తనకు ఉందని ఆయన నిరూపించుకున్నారు. అంతే కాదు ఫైర్ బ్రాండ్ హిందూత్వ అంటే తానే అని ఈ శోభా యాత్ర ద్వారా అందరికీ తెలియ చేయగలిగారు. ఇక ఓల్డ్ సిటీలో ఇలాంటి భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించడం ద్వారా రాజా సింగ్ రియల్ హీరో అనిపించుకున్నారు అని అంతా అంటున్నారు.

Tags:    

Similar News