ఉద్యోగాలు పెరుగుతున్నా ఆర్థిక వ్యవస్థ కోలుకోదా?

Update: 2020-08-12 05:45 GMT
కరోనాతో అందరి జీవితాలు తలకిందులయ్యాయి. ఉద్యోగ, ఉపాధి కోల్పోయి అందరూ రోడ్డునపడ్డారు. మన దేశ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం భారీగానే పడింది.  ప్రస్తుతం ఇప్పుడిప్పుడే మళ్లీ వ్యవస్థ కోలుకుంటోంది. కానీ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి సమయం పడుతుందని ఎక్కువమంది ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు.

జాబ్ మార్కెట్ పుంజుకుంటోంది. అయితే ఎక్కువగా తక్కువ వేతనం ఉన్న అనధికారిక రంగంలోనే ఉద్యోగాలు పెరుగుతున్నాయి. మెరుగైన వేతనాలు ఉన్న ఉద్యోగాల్లో పరిస్థితి దిగజారుతున్నట్టు కనిపిస్తోంది. ఇది ఆందోళనకు గురిచేస్తోంది.

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎంప్లాయిమెంట్ (సీఎంఐఈ) డేటా ప్రకారం.. ఏప్రిల్ లో 12.5 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి. మే నెలకు వచ్చేసరికి 100.3 మిలియన్ల మంది జాబ్ కోల్పోయారు. జూన్ లో 29.9 మిలియన్లకు తగ్గింది.  జూలై వరకు 11 మిలియన్ల మందికి ఉద్యోగాలు లేవు. అయితే ఎక్కువగా వేతనం ఉన్న ఉద్యోగాల పరిస్థితి గందరగోళంగానే ఉంది. ఇది వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణగా చెప్పలేమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

పెద్ద ఉద్యోగాలు.. భారీగా జీతాలు పొందే ఉద్యోగులకు ఉపాధి కలిగినప్పుడే ఆర్థిక వ్యవస్థ కుదుట పడుతుందని.. అప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
Tags:    

Similar News