కొత్త ఏడాదిలో కుర్చీలు కదులుతాయా... బాబు ప్లాన్ ఏంటి ?

క్యాలెండర్ ఇయర్ లో 2025 వెళ్ళిపోయి 2026 వచ్చేసింది. కొత్త ఏడాదిలో ఏమి జరుగుతుంది ఎలా ఉంటుంది అన్న ఉత్కంఠ అందరిలో ఉంటుంది.;

Update: 2025-12-31 13:59 GMT

క్యాలెండర్ ఇయర్ లో 2025 వెళ్ళిపోయి 2026 వచ్చేసింది. కొత్త ఏడాదిలో ఏమి జరుగుతుంది ఎలా ఉంటుంది అన్న ఉత్కంఠ అందరిలో ఉంటుంది. అంతే కాదు ఈ ఏడాదిలో రాజకీయాలు ఎలా ఉంటాయి ఇతర రంగాలు ఎలా ఉంటాయి అన్న చర్చ కూడా సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రజలతో ముడిపడి ఉన్న రంగాలలో జనాలు కూడా ఇన్వాల్వ్ అవుతూంటారు. ఇదిలా ఉంటే ఏపీ వరకూ చూస్తే 2025 సక్సెస్ ఫుల్ గా కూటమి ప్రభుత్వం పాలన పూర్తి చేసుకుంది. ఇలా ఎందుకు అంటున్నారు అంటే కూటమిలో లుకలుకలు లేవు, అంతే కాదు మిత్రులు అంతా ఒక్కటిగా ఉంటూ ఐక్యత చాటారు. దాంతో పాలన సజావుగా సాగుతూ వచ్చింది.

అనేక ఊహాగానాలు :

ఇక కూటమి ప్రభుత్వం మీద రకరకాలైన ఊహాగానాలు 2025 లో వినిపించాయి. మెగా బ్రదర్ నాగబాబుకు కేబినెట్ లో బెర్త్ ఈ ఏడాద్ దక్కుతుందని అంతా అనుకున్నారు. అయితే ఆయన ఎమ్మెల్సీ అయి తొమ్మిది నెలలు గడచింది కానీ మంత్రి సీటు మాత్రం దక్కలేదు. అయితే దాని వెనక ఒక వ్యూహం ఉందని అంటున్నారు. 2026 లో మంత్రి వర్గ విస్తరణ ఉండొచ్చు అని కూడా ప్రచారం సాగింది. 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం పదవీ బాధ్యతలు స్వీకరించింది. దాంతో 2026 జూన్ నాటికి కచ్చితంగా రెండేళ్ళు పూర్తి అవుతుంది.

భారీ మార్పులేనా :

దాంతో మంత్రి వర్గంలో భారీ మార్పులు ఉంటాయని చర్చ అయితే సాగుతోంది. ఎందుకంటే సాధారణంగా మంత్రివర్గంలో ఎవరైనా మార్పులు చేర్పులు అన్నవి రెండేళ్ళ పాలన తరువాత చేస్తూంటారు. చివరి ఏడాది పూర్తిగా ఎన్నికల ఏడాదిగా చెబుతారు. దాంతో తమ పాలన ప్రజలకు ఇంకా చేరువ కావాలన్నా సమర్ధంగా సాగాలి అన్నా కూడా కూడా ఈ సమయం కరెక్ట్ గా సరిపోతుందని భావిస్తారు. మరీ మూడేళ్ల తరువాత మార్పులు చేసినా ఫలితాలు సమయాభావం వల్ల రావు అన్న ఆలోచనలు కూడా ఉంటాయి. దాంతో రెండేళు అన్నది అంతా ఫాలో అయ్యే ఒక కీలక ముహూర్తం అని అంటారు. దాంతో ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా రెండేళ్ళ పాలనను బేరీజు వేసుకుంటూ మంత్రివర్గంలో భారీగానే మార్పులు చేర్పులు చేస్తుందని అంటున్నారు.

ఎవరు ఇన్ ఎవరు అవుట్ :

అదే విధంగా చూసుకుంటే ఎవరు లోపలికి ఎవరు పదవులు కోల్పోయేది అన్నది మరో చర్చ. ఏపీలో చూస్తే కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రివర్గంలో ప్రస్తుతం ఒక ఖాళీ ఉంది. ఇక మార్పులు చేర్పులు అని చేసినా మరో అరడ డజన్ దాకా అయితే తీసుకునేందుకు వీలు ఉంటుంది. అలా చూస్తే ఆరేడు కేబినెట్ బెర్త్ ల కోసం పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది. అయితే ప్రాంతాలు రాజకీయ అవసరాలు, సామాజిక పరిస్థితులు ఇవన్నీ ఆలోచించిన మీదటనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండొచ్చు అని అంటున్నారు. అయితే ఎపుడు మార్పులు జరిగినా ఉత్తరాంధ్రలో ఒక మంత్రి, గోదావరి జిల్లాలో మరో మంత్రి, రాయలసీమలో ఇంకో మంత్రి ఇలా ఈ ముగ్గురికీ పదవీ గండం తప్పదని అంటున్నారు వీరితో పాటుగా పనితీరు ఇంకా మెరుగు కాలేని మరో ముగ్గురుకి కూడా మాజీలు అయ్యే యోగం ఈ ఏడాది ఉంటుందని రాజకీయ జోస్యాలు అయితే వెలువడుతున్నాయి. ఇక ఈసారి విస్తరణ అంటూ జరిగితే విశాఖ జిల్లాకు చాన్స్ ఇస్తారని అంటున్నారు. కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా నుంచి మరొకరికి పదవి ఇక గోదావరి జిల్లాలో ఒక సీనియర్ బీసీ నేత, మాజీ మంత్రికి మంత్రి యోగం ఉండొచ్చు అంటున్నారు. రాయలసీమలో కూడా రాజకీయ సమీకరణలు చూసి ఒక బలమైన సామాజిక వర్గానికి అవకాశం కల్పించవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి 2026 ఎవరి ఆశలను పెంచుతుందో ఎవరిని కిందకు దించుతుందో.

Tags:    

Similar News