ఈవీ సేల్స్ లో టెస్లాకు షాకిచ్చింది... ఏమిటీ 'బీవైడీ' కంపెనీ లెక్క!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సీఈవో గా ఉన్న ప్రపంచలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన సంస్థ టెస్లాకు ఈ ఏడాది బిగ్ షాక్ తగిలిందని అంటున్నారు.;

Update: 2025-12-31 17:30 GMT

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సీఈవో గా ఉన్న ప్రపంచలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన సంస్థ టెస్లాకు ఈ ఏడాది బిగ్ షాక్ తగిలిందని అంటున్నారు. ఇప్పటికే భారత్ లోనూ అమ్మకాలు ప్రారంభించిన టెస్లాను వార్షిక అమ్మకాల విషయంలో చైనీస్ ఆటో దిగ్గజం బీవైడీ ని అధిగమించేందుకు సిద్ధంగా ఉందని.. 2025కి సంబంధించిన తుది గణాంకాలను ప్రచురిస్తే ఈ విషయం అధికారికంగా వెలువడుతుందని.. ఇప్పటికే ఉన్న డేటా అల్ రెడీ క్లారిటీ ఇచ్చేసిందని అంటున్నారు.

అవును... చైనీస్ ఆటో దిగ్గజం బీవైడీ.. వార్షిక అమ్మకాలలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన సంస్థగా ఉన్న టెస్లాను అధికారికంగా అధిగమించడానికి సిద్ధంగా ఉందని.. ఈ రెండు గ్రూపులు త్వరలో 2025కి సంబంధించిన తుది గణాంకాలను ప్రచురించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ విషయం అధికారికంగా వెల్లడవుతుందని అంటున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అమ్మకాల డేటా ఇప్పటికే ఫలితాలు స్పష్టం చేసిందని అంటున్నారు.

ఇప్పటివరకూ ఉన్న డేటా ఆధారంగా... ఈ ఏడాది నవంబర్ చివరి నాటికి షెన్‌ జెన్‌ కు చెందిన బీవైడీ.. 2025లో సుమారు 21 లక్షల ఈవీలను విక్రయించగా.. టెస్లా 17 లక్షల ఈవీలను విక్రయించిందని అంటున్నారు. గతంలో ట్రంప్, ఇతర రాజకీయ నాయకులకు మస్క్ రాజకీయ మద్దతు ఇవ్వడంతో టెస్లా కీలక మార్కెట్ లో అమ్మకాల కష్టాలను చవి చూసిందనే సంగతి తెలిసిందే! ఈ ప్రభావం ఓవరాల్ గా కీలకంగా మారిందని చెబుతున్నారు.

అయితే రాబోయే రోజుల్లో ఈ పరిణామాలలో కీలక మార్పులు చోటు చేసుకోవచ్చని అంటున్నారు. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఉన్న సమయంలో.. చైనా ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపై 100% సుంకాలను విధించారు. ఈ క్రమంలో.. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హయాంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని.. అది 2026లో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు.. యూరప్ కూడా చైనా దిగుమతులపై సుంకాలను విధించింది.

ఈ నేపథ్యంలోనే ఈవీలో టెస్లా తన ప్రపంచ నాయకత్వాన్ని తిరిగి పొందే అవకాశం ఉందని.. టెస్లాకు స్వయంప్రతిపత్తి సాంకేతికత పెరుగుతున్న ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని.. దాని ఫుల్లీ సెల్ఫ్ డ్రైవింగ్ ఆఫర్లలో పురోగతులు అమ్మకాలను పెంచుతాయని అమెరికా బహుళజాతి పెట్టుబడుల బ్యాంక్ కు చెందిన మైఖేలీ అభిప్రాయపడ్డారు.

బీవైడీ ఎలక్ట్రిక్ ఎగిరే కార్ల పుకార్లు!:

బీవైడీ హై-ఎండ్ యాంగ్వాంగ్ బ్రాండ్ యూఫ్లై అనే ఎగిరే కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ పోస్ట్ ప్రకారం... ఎగిరే కారు బీవైడీ యొక్క ఆల్ట్రా ఫాస్ట్ మెగావాట్ ఫ్లాష్ ఛార్జింగ్ తో పాటు ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అయితే.. ఇందులో నిజం లేదని చెబుతూ, జరుగుతున్న ప్రచారాన్ని బీవైడీ ఖండించింది. ఈ సందర్భంగా స్పందించిన బీవైడీ పబ్లిక్ రిలేషన్స్ బాస్ లి యున్ఫీ... తమకు అలాంటి ప్రణాళికలు ఏమీ లేవని అన్నారు.

Tags:    

Similar News