టాటా సియారా: రెండు దశాబ్దాల తర్వాత 'ఐకాన్' రీ-ఎంట్రీ

టాటా సియారా ప్రారంభ ధర ₹11.49 లక్షలు (ఇంట్రొడక్టరీ, ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. డిసెంబర్ 16, 2025 నుంచి డీలర్‌షిప్‌లు.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ప్రారంభిస్తారు.;

Update: 2025-11-25 12:55 GMT

టాటా సియారా రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇండియన్ మార్కెట్‌లో అడుగుపెట్టింది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను ₹11.49 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. క్లాసిక్ డిజైన్‌కు ఆధునిక టెక్నాలజీ, కొత్త ఇంజిన్‌లు, భద్రతా ఫీచర్లను జోడించి టాటా మోటార్స్ ఈ ఎస్‌యూవీని మధ్య-శ్రేణి సెగ్మెంట్‌లో హాట్ టాపిక్‌గా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది.

*ధర, బుకింగ్స్, డెలివరీలు

టాటా సియారా ప్రారంభ ధర ₹11.49 లక్షలు (ఇంట్రొడక్టరీ, ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. డిసెంబర్ 16, 2025 నుంచి డీలర్‌షిప్‌లు.. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ప్రారంభిస్తారు. 2026 జనవరి మధ్య నుంచి దశలవారీగా మొదలయ్యే అవకాశముందని ఆటోమొబైల్ వర్గాలు సూచిస్తున్నాయి.

ఇంజిన్ ఆప్షన్లు, పనితీరు

కొత్త సియారాలో 1.5 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ అనే మూడు ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి. నాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ సుమారు 106 PS పవర్, 145 Nm టార్క్‌తో 6-స్పీడ్ మాన్యువల్ , 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను ఆఫర్ చేస్తుండగా, 1.5 టర్బో పెట్రోల్ 160 PS పవర్, 255 Nm టార్క్‌తో 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్‌ను అందిస్తుంది. డీజిల్ వేరియంట్ 118 PS పవర్‌తో 260–280 Nm టార్క్‌ను మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందించి, లాంగ్ రన్నింగ్ వినియోగదారులను టార్గెట్ చేస్తోంది.

* సియారా EV ప్రణాళికలు

ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) వెర్షన్ తర్వాత టాటా సియారా EVను కూడా భారత మార్కెట్‌కు తీసుకురావడానికి కంపెనీ ఇప్పటికే రోడ్‌మ్యాప్ సిద్ధం చేసింది. టాటా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. సియారా EVని జెన్-2 EV ప్లాట్‌ఫార్మ్‌పై, 2026 ఆర్థిక సంవత్సరంలో లాంచ్ చేసే అవకాశం ఉంది.

* లగ్జరీ, టెక్ ఫీచర్లు

సియారాలో పెద్ద పరిమాణం ఉన్న పనోరమిక్ సన్‌రూఫ్, ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్‌తో కూడిన మల్టీ-డిస్ప్లే డ్యాష్‌బోర్డ్, ప్రీమియం ఆడియో సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. టాటా తాజా ప్లాట్‌ఫార్మ్ వల్ల ఇంటీరియర్ స్పేస్, కంఫర్ట్, క్రాఫ్ట్‌స్మాన్‌షిప్‌లను మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌గా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భద్రతా ఫీచర్లు

భద్రత విషయంలో టాటా సియారా 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్, చైల్డ్ సీట్ మౌంట్స్, 360-డిగ్రీ కెమెరా, లెవల్-2 ఏడీఏఎస్ వంటి సరికొత్త ఫీచర్లను అందిస్తుంది. టాటా హారియర్, సఫారి మాదిరిగానే సియారాను కూడా అధిక క్రాష్ ప్రొటెక్షన్ లక్ష్యంగా బలమైన బాడీ స్ట్రక్చర్‌తో డిజైన్ చేయడంతో, భరత్ NCAPలో ఉత్తమ రేటింగ్ సాధించాలనే ప్రయత్నం కనిపిస్తోంది.

మార్కెట్‌లో పోటీదారులు

ధర, సైజు, ఫీచర్ల పరంగా టాటా సియారా ప్రధానంగా హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్ వంటి మిడ్-సైజ్ ఎస్‌యూవీలను నేరుగా లక్ష్యంగా చేసుకుంది. టాటా బ్రాండ్‌కు ఉన్న భద్రతా ఇమేజ్, కొత్త పవర్‌ట్రెయిన్‌లు, రీట్రో-మాడర్న్ డిజైన్ కలబోత ఈ పోటీలో సియారాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురాగలదని ఆటో విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.



Full View


Tags:    

Similar News