గోల్డ్, డైమండ్స్ తో బైక్.. ధర తెలిస్తే షాక్.. వీడియో వైరల్!
బైక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రధానంగా కుర్రకారైతే కారు కంటే స్పోర్ట్స్ బైకే ముద్దని అంటుంటారు.;
బైక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రధానంగా కుర్రకారైతే కారు కంటే స్పోర్ట్స్ బైకే ముద్దని అంటుంటారు. సరైన సౌండ్ చేసుకుంటూ, రోడ్లపై రయ్ రయ్ మని దూసుకుపోతుంటే ఆ మజానే వేరని చెబుతుంటారు. కొంతమంది కాస్ట్లీ బైక్స్ కొనుక్కోలేక, మామూలు బైకులనే రీమోడల్ చేయించుకుని మురిసిపోతుంటారు! ఈ క్రమంలో తాజాగా బంగారం, వజ్రాలతో చేసిన బైక్ తెరపైకి వచ్చింది.
అవును... బైక్స్ అంటే కొంతమందికి అవసరం, మరికొంతమందికి ఇష్టం, ఇంకొతమందికి మాత్రం పిచ్చి! వారిలో కొంతమంది సరైన స్పోర్ట్స్ బైక్ కొనుక్కోలేకపోయినా.. అది కనిపించినా సరే చూసి మురిసిపోతుంటారు, దాని పక్కన నిలబడి ఫోటోలు తీసుకుంటారు. అవకాశం దొరికితే ఓ రైడ్ వేసి సంబరపడిపోతారు. ఈ క్రమంలో బంగారంతో చేసి, వజ్రాలతో పొదగబడిన బైక్ దర్శనమిచ్చింది.
ఇటీవల దుబాయ్ లో జరిగిన ఒక మోటార్ ఈవెంట్ లో హయాబుసా బైక్ కనిపించింది. ఇందులో వింతేముంది అనుకుంటే పొరబడినట్లే. ఈ బైకులో చాలా వరకు గోల్డ్ బాడీవర్క్ ఉండగా.. పలు చోట్ల వజ్రాలను కూడా ఉపయోగించారు. బోల్టులు కూడా బంగారమే కావడం గమనార్హం. అయితే ఈ బైకుకు వేసిన గోల్డ్ లీఫ్ పెయింట్ కోసమే ఏకంగా రూ. 13.3 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా సుజుకి హయబుసా ధర కొంత ఎక్కువగానే ఉంటుంది.. పైగా ఈ బైకును బంగారంతో తయారు చేస్తే.. దాని ధర ఇంకెంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఈ బైకును చూసిన వారంతా ధర కొంత ఎక్కువగానే ఉందని భావించినా అసలు ధర తెలిశాక షాక్ అవుతున్నారు.
ఈ బైక్ ధర అక్షరాలా రూ.1.67 కోట్లు అని తెలుస్తోంది. 400 హార్స్ పవర్ ఇంజిన్ తో ఉన్న ఈ బైక్ ఆటోమొబైల్ ఔత్సాహికులను తెగ ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా దీని వెనుక టైరు పరిమాణంలో బుగట్టి కారు కంటే పెద్దదిగా ఉన్నట్టు కనబడుతోంది! మరి ఇంత స్పెషల్ బైక్ పై మీరూ ఓ లుక్కేయండి!