నోటి దూల: అన్వేష్‌పై రెండు రాష్ట్రాల్లో కేసులు
ప్రముఖ యూట్యూబర్.. `నా అన్వేషణ` పేరుతో యూట్యూబ్ నిర్వహిస్తూ.. విదేశాల్లో పర్యటించే అన్వేష్ పై.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.;
ప్రముఖ యూట్యూబర్.. `నా అన్వేషణ` పేరుతో యూట్యూబ్ నిర్వహిస్తూ.. విదేశాల్లో పర్యటించే అన్వేష్ పై.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఆయన పౌరాణిక అంశాలపై.. తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సీతాదేవి, ద్రౌపదిలను ఉద్దే శించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలు.. దుమారం రేపాయి. ఈ క్రమంలోనే యూట్యూబర్‌ను అన్ ఫాలో చేయాలంటూ.. కొత్తగా సోషల్ మీడియాలో ఉద్యమం కూడా ప్రారంభమైంది.
అయితే.. తాను చేసిన వ్యాఖ్యలపై అన్వేష్ క్షమాపణలు కోరారు. కానీ.. ఇదేసమయంలో తనను క్షమించ ని వారు దుష్టులని.. వచ్చే 2026లో భ్రష్టు పట్టిపోతారని.. వారికి యాక్సిడెంట్లు కూడా జరుగుతాయని వింత గా శాపనార్థాలు పెట్టాడు. దీంతో ఇదొక వివాదం ఆయనను చుట్టుముట్టి.. నిన్న మొన్నటి వరకు అతినిని ఫాలో అయిన వారు.. తిట్టిపోయడం ప్రారంభించారు. ఈ క్రమంలో అన్వేష్ పై అనేక వ్యతిరేక కథనాలు కూడా ప్రచారంలోకివస్తున్నాయి. ఎక్కడకి వెళ్తే.. అక్కడ గాళ్ ఫ్రెండ్‌ను చూసుకుంటున్నాడని.. అతనికి మహిళలంటే గౌరవం లేదని కూడా నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
ఇదిలావుంటే.. తాజాగా.. అన్వేష్ వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులునమోదయ్యాయి. హైదరాబాద్‌లో ఫైర్ బ్రాండ్ కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ ద్వారా సీత, ద్రౌపది వంటి పురాణ మహిళలను కించపరిచారని, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అన్వేష్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును రెడీ అయ్యారు. మరోవైపు.. ఖమ్మంలోనూ కొందరు కేసు పెట్టారు.
ఏపీలోని విశాఖలోనూ కొందరు అన్వేష్‌పై ఫిర్యాదు చేశారు. విజయవాడ, తిరుపతిలోనూ బీజేపీకి చెందిన కొందరు కార్యకర్తలు అన్వేష్‌పై చర్యలు కోరుతూ ఫిర్యాదు చేయడం గమనార్హం. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా హిందువులు పూజించే సీతాదేవి, ద్రౌపదీదేవిలపట్ల అన్వేష్ అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యా నించాడంటూ.. పలువురు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆయా కేసులపై పోలీసులు దర్యాప్తుం చేస్తున్నారు.