• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పెనుగొండ లో టీడీపీ ఎందుకు...

పెనుగొండ లో టీడీపీ ఎందుకు ఓడిపోయింది ?

By - Tupaki Desk
Update: 2022-01-02 05:29 GMT
ఈ విషయమే చంద్రబాబునాయుడుకు ఇంకా అర్ధం కాలేదట. చేసిన పనులను ప్రచారం చేసుకోలేకపోవటం వల్లే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందనే వాదనను చంద్రబాబునాయుడు తిరస్కరించారు. కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఘోరంగా ఎందుకు ఓడించారో అర్ధం కావటంలేదంటు తెగ బాధపడిపోయారు. ఇదే మాటను చంద్రబాబు మొదటి నుండి చెబుతున్నారు.

జరిగిన అభివృద్ధి కళ్ళముందే కనిపిస్తున్నా ప్రజలు ఎందుకు ఓట్లేయలేదని అడుగుతు పెనుగొండలో కియా పరిశ్రమను ఉదాహరణగా చూపించటమే విచిత్రం. మరి పెనుగొండలో కియా పరిశ్రమ వచ్చినా జనాలు పెనుగొండలో కూడా ఎందుకు ఓడగొట్టారు ? ఎందుకంటే క్షేత్రస్ధాయిలో జరిగిన మోసానికి చంద్రబాబే కారణం కాబట్టి. పరిశ్రమ పేరుతో వేలాది ఎకరాల వ్యవసాయ భూములను సమీకరించారు. పరిశ్రమ ఏర్పాటు సందర్భంగా స్ధానికులకే ఉద్యోగాలు ఇస్తామని రైతులకు హామీ కూడా ఇచ్చారు.

పరిశ్రమ ఏర్పాటును చూసి అందులో అవసరమైన ఎలక్ట్రికల్, ఫిట్టర్, మెకానికల్ లాంటి కోర్టుల్లో యువత ఐఐటి, పాలిటెక్నిక్ చదివారు. అలాగే సాఫ్ట్ వేర్ కోర్సులు కూడా చేశారు. కానీ చివరకు జరిగిందేమిటి ? స్ధానికుల్లో ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. చెన్నైలోని ప్లాంటు నుండి అవసరమైన ఉద్యోగులను యాజమాన్యం తెప్పించుకుంది. స్ధానికులను కేవలం సెక్యూరిటి, శానిటేషన్ లాంటి ఉద్యోగాల్లో మాత్రమే నియమించింది.

ఇదే విషయాన్ని యాజమాన్యంతో  రైతులు ప్రస్తావిస్తే సమాధనం చెప్పలేదు. దాంతో గొడవలు అయ్యాయి. తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అంటేనే భూములు ఇచ్చామని రైతులు నెత్తినోరు మొత్తుకున్నారు. అయినా యాజమాన్యం పట్టించుకోకపోవటంతో తమ భూములను వెనక్కు ఇచ్చేయాలని గొడవలకు దిగారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి రైతులను, వారి పిల్లలను అరెస్టు చేసి కేసులు పెట్టారు.

మొత్తం మీద   నష్టపోయింది రైతులు, మామూలు జనాలు. అందుకనే ఎన్నికలు వచ్చేంతవరకు ఏమీ చేయలేక తమ కోపాన్ని పోలింగ్ సమయంలో చూపించారు. దాంతోనే టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇలాంటి కారణాలతోనే రాజధాని నియోజకవర్గాలైన తాడేపల్లి, మంగళగిరిలో కూడా ఓడిపోయింది. ఓటమికి కారణాలు ఇంత స్పష్టంగా కళ్ళకు కనబడుతుంటే ఎందుకు ఓడిపోయామో తెలీటం లేదని చంద్రబాబు అనుకుంటున్నారంటే తనను తాను మోసం చేసుకుంటున్నట్లే లెక్క.
Tags:    
  • Penugonda 
  • Chandra babu 
  • Telugu desam party 
  • andhra pradesh 
  • nara lokesh 
  • Ap Sarkar 
  • Ap elections 2024 

Similar News

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

మోడీ ఇచ్చిన కానుక‌ల వెనుక 'బిజినెస్' యాంగిల్‌!

2026-11-19 03:15 GMT

వైసీపీ వైపు నాన్ ఎన్డీయే వర్గాలు

2026-11-19 03:14 GMT

పవన్ బ్యాలెన్స్ పాలిటిక్స్...చాన్స్ కోసం సైనిక్స్ !

2026-11-19 03:14 GMT

ఈ నెల 23 నుంచి ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ?

2026-11-19 03:13 GMT

జగన్ లండన్ టూర్ ఫిక్స్...ఫుల్ బిజీగానే !

2026-11-19 03:13 GMT

₹50 కోట్ల పెళ్లి.. 4 లక్షల మంది అతిథులు.. విజేతకు థార్ కారు.. ఇలాంటిది చూడలేదప్పుడు?

2026-11-19 03:12 GMT

అందరూ కలిసి ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఆపేస్తున్నారన్నట్టు..?!

2026-11-19 03:09 GMT

కూటమిలో భారీ ఉత్కంఠ.. ఎవరికెన్ని జెడ్పీలు ?

2026-11-19 03:09 GMT

మోడీ ఎక్కింది బజాజ్ ఆటో.. క్రెడిట్ మాత్రం పాకిస్తాన్‌కు.. ఫుల్ కామెడీ

2026-11-19 03:07 GMT

చిన్న సైజులో ఎలక్ట్రిక్ డిఫెండర్.. 2027లో రాక!

2026-11-19 03:06 GMT

పెళ్లి పిలుపు ఓకే... షర్మిల వ్యూహం మీదనే ఎన్నో ప్రశ్నలు !

2026-11-19 03:03 GMT

Copyright @2026

Powered by Blink CMS