• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఈ నెల 23 నుంచి ప్రత్యేక...

ఈ నెల 23 నుంచి ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ?

| నవంబర్ 23–25 మధ్య పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ల అమలుకు వీలుగా డీలిమిటేషన్ బిల్లును ఆమోదించుకోవడమే లక్ష్యమని సమాచారం. రాజ్యాంగ సవరణకు అవసరమైన 362 ఓట్లకు మించి 380 మంది ఎంపీల మద్దతు తమకు ఉందని బీజేపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు కథనాలు చెబుతున్నాయి.

By - Satya P
Update: 2026-11-19 03:13 GMT

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది అని ఢిల్లీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ 23 నుంచి 25 దాకా మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయని అంటున్నారు. నిజానికి డిసెంబర్ లో శీతాకాల సమావేశాలు ఉండగా ఈ ప్రత్యేక సమావేశాలు ఎందుకు అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అయితే కేంద్రంలోని బీజేపీ నాయకత్వం డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లులను ఆమోదించుకోవడానికి గట్టి పట్టుదలతో ఉన్న సంగతి తెల్సిందే. దాంతోనే ఈ ప్రత్యేక సమావేశాలు అని అంటున్నారు.

పక్కాగా ఆమోదం :

ఈసారి ఎలాగైనా డీలిమిటేషన్ బిల్లును ఆమోదించుకోవాలని బీజేపీ పెద్దలు భారీ కసరత్తు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలులోకి తీసుకురావడానికి వీలుగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదించుకోవడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీకి లోక్ సభలో ఈ బిల్లుల ఆమోదానికి అవసరం అయిన బల సమీకరణకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బిల్లులు రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకు మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కాగా, తమకు అవసరమైన దానికంటే 15 నుంచి 18 ఓట్లు అదనంగానే ఉన్నాయని బీజేపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

ప్రత్యేకంగానే :

నిజానికి శీతాకాల సమావేశాల ముందు ఈ సమావేశాలు ఎందుకు అంటే వేరే అజెండా కానీ ఇతర అంశాలు కానీ చర్చకు రాకుండా కేవలం ఫోకస్ పెట్టడానికే అని అంటున్నారు. ఒక వైపు సాధారణ శీతాకాల సమావేశాలు డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున అంతకంటే ముందే ఈ మూడు రోజుల ప్రత్యేక భేటీని నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు హస్తినలో వార్తా కథనాలు తెలియచేస్తున్నాయి. మరో వైపు చూస్తే ఆగస్టులో ముగిసిన వర్షాకాల సమావేశాలను ఇప్పటివరకు ప్రోరోగ్ అంటే నిరవధికంగా వాయిదా వేసి ముగించడం చేయనందున తక్కువ నోటీసుతోనే తిరిగి సభను సమావేశపరిచే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది. అంటే ఎప్పుడు కావాలనుకుంటే అపుడు సభను సమావేశపరచి చర్చించవచ్చు అన్న మాట.

ఆ ఓట్లు ఎలా వస్తాయి :

డీ లిమిటేషన్ బిల్లు ఆమోదం అంటే రాజ్యాంగ సవరణకు 362 మంది ఎంపీల మద్దతు ఉండాలి. అయితే తమకు ఆ సంఖ్యా బలంతో పాటుగా మరో పదిహేను నుంచి 18 ఓట్లు ఎక్కువగానే వస్తాయని బీజేపీ పెద్దలు ధీమా వ్యక్తం చేస్తున్నాయని చెబుతున్నారు. అంటే 380 దాకా ఓట్లు అన్న మాట. అదెలా సాధ్యం అన్నది ఇపుడు చర్చగా ఉంది. బీజేపీకి ఉన్న ప్రస్తుత బలం 324 కి మించలేదు. అంటే మరో 56 మంది ఎంపీలు ఎక్కడ నుంచి మద్దతు ఇస్తారు అన్నది పెద్ద ప్రశ్నగానే ఉంది. అయితే రాజకీయాల్లో ఏదీ అసాధ్యం అనూహ్యం కాదు అని అంటున్నారు. పైగా మరో వారం రోజుల వ్యవధిలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకుంటున్నారు అంటే గట్టి కసరత్తు దీని వెనక జరిగినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నెల 25 వరకూ మూడు రోజుల పాటు సాగే ఈ సమావేశాలలో ఓటింగ్ 25న జరుగుతుంది అని అంటున్నారు. ఒక విధంగా ఆ రోజు బిగ్ జడ్జిమెంట్ డే గానే చూడాల్సి ఉంది. ఎందుకంటే దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మొత్తంగా మార్చేసే రాజ్యాంగ సవరణకు ఆ రోజు తీర్పుని ఎంపీలు ఇస్తారు.

Tags:    
  • parliament 
  • delimitationbill 
  • womensreservation 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS