• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాహుల్‌ ని వదలని బాబు...

రాహుల్‌ ని వదలని బాబు బొమ్మళి

By - Tupaki Desk
Update: 2019-01-10 05:44 GMT
తెలంగాణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి చావు తప్పి కన్ను లొట్టపోయింది. ఎన్నికలకు ముందు భారీ అంచనాలతో ఈ రెండు పార్టీలు కలసిన చంద్రబాబు దెబ్బతో కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడి ప్రభ ముగిసినట్లేనని తెలంగాణ ఎన్నికలు స్పష్టం చేశాయి. ఎన్నికలపై జరిగిన సమీక్షలో కూడా చంద్రబాబు నాయుడి కారణంగానే ఓటమి పాలయ్యామని తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు అంచన వేశారు. దీంతో రానున్న లోక్‌ సభ ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో చంద్రబాబుతో పొత్తు వద్దని కాంగ్రెస్ నాయకులు తెగేసి చెబుతున్నారు. రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీతో సమవేశమైన ఏఐసీసీ కార్యదర్శులలో ఒకరైన గిడుగు రుద్రరాజు సైతం తమ అధినేతకు పొత్తు వద్దని సూచించినట్లు వార్తలు వచ్చాయి. అయితే రాహుల్ గాంధీ మాత్రం పొత్తు అంశంపై పునరాలోచించాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో దెబ్బ తిన్న తాము ఆంధ్రప్రదేశ్‌ లో కూడా దెబ్బ తింటే కష్టమని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లో తమకు బలం లేకపోయినా మళ్లీ నష్టం మాత్రం జరగకూడదని రాహుల్ గాంధీ సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రం రాహుల్ గాంధీని వదలటం లేదు.  రానున్న ఎన్నికలలో కాంగ్రెస్‌ తో కలిపి ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు పొత్తు వద్దని మొత్తుకున్న చంద్రబాబు నాయుడు మాత్రం పదే పదే రాహుల్‌ తో మాట్లాడడం, ఢిల్లీ వెళ్లి కలవడం చేస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనను కలవడానికి వస్తే అంగీకరించకపోవడం సభ్యత కాదని రాహుల్ గాంధీ కాంగ్రెస్ శ్రేణుల వద్ద అన్నట్లు సమాచారం. చంద్రబాబుతో కలవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ కు ఎటువంటి లాభం కలగదని, కాంగ్రెస్ నాయకులు కుండబద్దల కొట్టి మరీ చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తమతో కలుస్తున్నారని ఏపీ కాంగ్రెస్ నాయకులు వాదన. అందుకే వదలా బొమ్మాళి అన్నట్లుగా రాహుల్ గాంధీని చంద్రబాబు వదలటం లేదని కాంగ్రెస్ నాయకుల విశ్లేషణ. ఈసారి ఒంట‌రిగా పోటీ చేస్తే అధికారం, ఎక్కువ సీట్లు గాని రావు కానీ వ‌చ్చే ఏడాదికి ఈ పోటీ కాంగ్రెస్‌ కు బ‌లాన్నిస్తుంది అన్న‌ది కాంగ్రెస్ నేత‌ల మ‌సులో మాట‌.



Full View
Tags:    
  • Chandra babu 
  • Rahul Gandhi 
  • Political News 
  • Congress Party 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS