• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎంపీ కవిత సైలెన్స్ వెనుక...

ఎంపీ కవిత సైలెన్స్ వెనుక కారణమేంటి.?

By - Tupaki Desk
Update: 2018-10-29 14:30 GMT
ఇది ఎన్నికల సమయం.. పార్టీల నేతలందరూ జనంలో ఉంటూ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కానీ మీరు గమనించారా.? కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సైలెంట్ అయిపోయారు. ఆమె మౌనం రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. కొద్దిరోజులుగా కవిత నుంచి ఒక్క ప్రెస్ మీట్ కానీ.. పత్రికా ప్రకటన కానీ రాలేదు. ఆమె కార్యాలయం నుంచి ఎలాంటి అలికిడి లేదు. ఆమె ఎన్నికల బహిరంగ సభల్లో కూడా పాల్గొనడం లేదు. ర్యాలీలు, ప్రచారంలో కూడా కనిపించడం లేదు. జగిత్యాలలో అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే టీ జీవన్ రెడ్డిపై పరుష విమర్శలు చేశాక ఆమె పొలిటికల్ స్క్రీన్ నుంచి మాయం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మంత్రి కేటీఆర్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ప్రతీ విషయంపై స్పందిస్తూ.. వివిధ సభల్లో ప్రసంగిస్తూ చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. ఇక మరో సీనియర్ మంత్రి హరీష్ రావు సైతం మెదక్ జిల్లాలో సుడిగాలి పర్యటన జరుపుతూ క్యాడర్ ను ఉత్సాహపరుస్తున్నాడు. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ గెలుపు బాధ్యతను భుజాన వేసుకొని అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కానీ నిజామాబాద్ ఎంపీ కవిత.. ఆమె పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ లలో.. మిగతా ప్రాంతాల్లో సైతం ఎక్కడ కనిపించకపోవడం గమనార్హం.

తాజా సమాచారం ప్రకారం.. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ బలం ఆశించినంతగా లేదని రిపోర్టులు వచ్చాయంటున్నారు.. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ గాలి వీస్తోందట..బోధన్ లో సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి ఎదురుగాలి అన్న సంకేతాలొస్తున్నాయట.. ఇక బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు ప్రతికూలంగా ఉన్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఎంపీ కవిత తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. పలువురు అసంతృప్తులను, అసమ్మతులను చేరదీస్తూ.. పార్టీ బలం కోసం కలిసి పనిచేసేలా ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇక పలువురు కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులతోను ఆమె చర్చలు జరుపుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం పనిచేసేలా పార్టీలోకి రప్పించేందుకు వ్యూహాత్మకంగా కదులుతున్నట్టు సమాచారం.  అందుకే బయటకు రాకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నట్టు తెలిసింది.
    

Tags:    
  • Kavitha Kalvakuntla 
  • TElugu NEws 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS