• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఉక్రెయిన్ విమాన ప్రమాద...

ఉక్రెయిన్ విమాన ప్రమాద మిస్టరీ ఏంటి?

By - Tupaki Desk
Update: 2020-01-09 04:46 GMT
ఇరాన్-అమెరికా కొట్లాడుకుంటున్నాయి. దాడులు, ప్రతిదాడులతో అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అలాంటి సమయంలో ఇరాన్ లో ఉక్రెయిన్ కు చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దాదాపు 180మంది అసువులు బాసారు. అయితే ఇప్పటికీ ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియ రాలేదు. యుద్ధోన్మాదంతో ఈ విమానంపై దాడి చేసి కూల్చేశారా అన్నది అనుమానంగా మారింది.

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణమే ఉక్రెయిన్ విమాన ప్రమాదానికి కారణమని ఊహా గానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి బలాన్ని ఇస్తూ కూలిన విమాన బ్లాక్ బాక్స్ ను అమెరికాకు, బోయింగ్ సంస్థకు ఇవ్వడానికి ఇరాన్ నిరాకరించడం అనుమానాలకు తావిస్తోంది.

తమ విమానం కూలిపోవడం వెనుక ఉగ్రదాడి కాదని.. ఇంజిన్ వైఫల్యం అని తొలుత బుకాయించిన ఉక్రెయిన్ ప్రధాని.. తాజాగా ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం తమకు తెలియదని స్పష్టత రావడానికి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు..

అయితే బోయింగ్ సంస్థ మాత్రం ఇది కొత్త విమానం అని కూలిపోవడానికి ఆస్కారమే లేదని తెలిపింది. 2016లో తయారు చేశామని.. జనవరి 6న కూడా సాంకేతిక తనిఖీలో లోపాలు లేవని గుర్తించినట్టు తెలిపింది. దీంతో ఈ ప్రమాదానికి ఇరాన్-అమెరికా యుద్ధమే కారణమని.. ఎవరో ఒకరు కూల్చేశారన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విమానం టేకాఫ్  అయిన  కొద్ది సేపటికే ఏటీసీ సంబంధాలు కోల్పోయింది. ఈ విమానం కూలిపోయాక కాలిపోయిందని ఇరాన్ తెలిపింది. కానీ లైవ్ వీడియోలో ఈ విమానం మంటల్లో కాలిపోతూనే గాలిలో కనిపించి కూలిపోవడం కనిపించింది.దీన్ని బట్టి ఈ విమానాన్ని కూల్చివేశారన్న అనుమానాలు కలుగుతున్నాయి.. మరి ఈ రహస్యం తేలాలంటే బ్లాక్ బాక్స్ బయటకు తీయాలి. కానీ ఇరాన్ మాత్రం దాన్ని ఎవ్వరికీ ఇవ్వనని తెలుపడంతో మిస్టరీగా మిగిలిపోతోంది.


Tags:    
  • Iran plane crash with 180 on board 
  • Iran Plane Crash 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Telugu political Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS