• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నా భవిష్యత్ జగన్...

నా భవిష్యత్ జగన్ చేతిలోనే.. వైవీ సుబ్బారెడ్డి హాట్ కామెంట్స్

By - Tupaki Desk
Update: 2021-07-05 03:55 GMT
సొంత బాబాయి.. జగన్ కు దగ్గరి బంధువు.. వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనకే మొదట ప్రతిష్టాత్మక, వందల కోట్ల విలువైన  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్ గా జగన్ నియమించారు. అంతటి పదవిని ఇచ్చి జగన్ తన బాబాయిని గౌరవించారు. అయితే ఇప్పుడా పదవి కాలం ముగుస్తోంది. ఈ క్రమంలోనే ‘తన భవిష్యత్ జగన్ చేతిలోనే ఉంది’ అంటూ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

మాజీ ఎంపీ, జగన్ బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డి మనసు మారింది. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల వైపు తను దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. ఈ విషయం ప్రస్తుతం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. బాబాయ్ కోరికను జగన్ మన్నిస్తాడా? మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అనుమతిస్తారా? ఏదైనా రాజకీయ పదవి ఇస్తారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

గతంలో ఒంగోలు ఎంపీగా వైవీ సుబ్బారెడ్డికి టికెట్ ఇచ్చి జగన్ గెలిపించారు. అయితే 2019 ఎన్నికల్లో జగన్ తన బాబాయికి ఒంగోలు టికెట్ తీవ్ర పోటీ కారణంగా ఇవ్వలేదు. రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు వైసీపీ అధిష్టానం ఉభయ గోదావరి జిల్లాల ిన్ చార్జి అనంతరం టీటీడీ చైర్మన్ ను చేసింది.

ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంపీ, లేదా ఎమ్మెల్యేగా కొనసాగాలని ఆసక్తి ఉన్నప్పటికీ జగన్ సూచన మేరకు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా అయిష్టంగానే బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం జూన్ 20తో ముగుస్తోంది. దీంతో సుబ్బారెడ్డిని జగన్ ఏం చేస్తారు? ఆయన రాజకీయ భవితవ్యం ఏంటనేది ఆసక్తిగా మారింది.

ఈ క్రమంలోనే తాజాగా ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటివరకు పరిపాలనతో సంబంధం లేని టీటీడీ బాధ్యతల్లో తాను ఉన్నానని.. అందువల్లే రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే న్యాయం చేయవచ్చన్నారు. ఈ మేరకు జగన్ కు ఈ విషయాలు చెప్పానని.. ప్రత్యక్ష రాజకీయాల్లోరి రావాలని అనుకుంటున్నానని వివరించానన్నారు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. దీంతో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.
Tags:    
  • yv subba reddy 
  • yv subba reddy comments 
  • Ap Cm Jagan Mohan Reddy 
  • Ycp Party 
  • andhra pradesh 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS