• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్లేట్ లెట్స్ ను మోతాదుకి...

ప్లేట్ లెట్స్ ను మోతాదుకి మించి ఎక్కిస్తే ఏమౌతుంది

By - Tupaki Desk
Update: 2021-09-15 13:36 GMT
తెలుగు రాష్ట్రాల్లో డెంగీ మహమ్మారి అధికంగా ఉండటంతో ఇప్పుడు ప్లేట్ లెట్ల పందం పదేపదే వినిపిస్తుంది. అనేక మంది డెంగీ బారిన పడి ప్లేట్ లెట్లు తగ్గటంతో ఆసుపత్రుల్లో చేరి అత్యవసర చికిత్స తీసుకుంటున్నారు. ప్లేట్ లెట్లు తగ్గిపోవటం కారణంగా చివరకు చాలా మంది ప్రాణాపాయ స్ధితికి చేరుతున్నారు. ప్లేట్ లెట్ల సంఖ్య ఎంత ఉండాలి, ఎంతకు పడిపోతే ప్రమాదం,ప్లేట్ లెట్లు ఎవరికి అవసరం, ఎవరికి అవసరం ఉండదు అనే విషయాలు చాలా మందికి తెలియక ఆందోళనకి గురి అవుతున్నారు.

ప్లేట్ లెట్స్ ఎముక మూలగ నుండి పుడతాయి. వీటి జీవితకాలం నాలుగ రోజులు. ఎముక మూలగలో ఏదైన సమస్య ఉత్పన్నమయ్యే సందర్భంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గుతుంది. ఇది సాధారణంగా జరిగేదే. ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గిన సందర్భంలో రక్తం గడ్డగట్టే ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. రక్తం గడ్డకట్టే జీవ క్రియల్లో ప్లేట్ లెట్స్ లోని ప్రొటీన్లతో కలసి పనిచేస్తాయి. వీటిని క్లాంటింగ్ ఫ్యాక్టర్స్ అని పిలుస్తారు. గాయం అయిన 2నుండి 3 నిమిషాల్లో ఈ వలయం కారణంగా రక్తం ప్రవహించకుండా ఆగిపోతుంది.

ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి శరీరంలో క్యూబిక్ మిల్లీ మీటర్ పరిమాణంలో 1.5 లక్షల నుండి 4.5లక్షల ప్లేట్ లెట్స్ ఉండాలి. ఇది సాధారణమైన పరిమాణం. 2నుండి 3 ఎంఎల్ రక్తాన్ని సేకరించి తద్వారా ప్లేట్ లెట్ల సంఖ్యను సెల్ కౌల్టర్ మెషిన్ ద్వారా నిర్ధారిస్తారు. డెంగీ వ్యాధి గ్రస్తుల్లో ప్లేట్ లెట్ల సంఖ్యను తెలుసుకునేందుకు ప్రతి 24 గంలకు ఒకసారి ఈ పరీక్ష నిర్వహిస్తారు. అప్లాస్టిక్ అనీమియా, కొన్ని రకాల రక్త క్యాన్సర్లు, లింఫోమా క్యాన్సర్లతోపాటు వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా మూలుగ దెబ్బతిని ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి.

అయితే, డెంగ్యూ వచ్చిన వారిలో 95 శాతం మందికి ప్రత్యేకమైన చికిత్స అవసరం లేదని డాక్టర్లు చెప్తున్నారు. నోటి ద్వారా ఇచ్చే ద్రావణాలు , ఐవి ద్రావణాలు ,పారాసెట్ మాల్ ట్యాబ్లేట్స్ ,.. తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని అన్నారు. అనవసరంగా మోతాదుకు మించి ప్లేట్ లెట్లు , ప్లాస్మాలని మోతాదుకి మించి ఇస్తే అక్యూట్ లంగ్ ఇంజ్యురి ,అలర్జిక్ రియాక్షన్ ,ఇన్ఫెక్షన్లు రావొచ్చు అని అన్నారు. ప్లేట్ లెట్స్ సంఖ్య 10 నుండి 15 వేలకి తగ్గినప్పుడు ప్లేట్ లెట్లు ఎక్కించాలని తెలిపారు.

డెంగీ బారిన పడిన రోగుల్లో ప్లేట్ లెట్స్ సంఖ్య అధికంగా తగ్గిపోతుంటుంది. ఇలాంటి సందర్భంలో శరీరంలో అంతర్గతంగా రోగికి రక్త స్రావం జరిగే ప్రమాదం సంభవించవచ్చు. ప్లేట్ లేట్స్ సంఖ్య బాగా తగ్గిపోయిన సందర్భంలో రోగి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లకుండా వెంటనే ప్లేట్ లెట్స్ ను ఎక్కించాల్సి ఉంటుంది. ప్లేట్ లెట్ ల సంఖ్య నాలుగు లక్షల నుండి 80,000వరకు పడిపోయినా ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్లేట్ లెట్ల సంఖ్య 20,000వేలకు పడిపోతే బాధితుడు ప్రమాదకర స్ధితిలోకి వెళతాడు. ఆసమయంలో శరీరానికి చిన్నపాటి గాయమైన రక్తం ఆగకుండా పోతూనే ఉంటుంది. ఆలాంటి సందర్భంలో ప్లేట్ లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. కానీ, ప్లేట్ లెట్లు ఎక్కువగా ఉన్న సమయంలో ఎక్కించాల్సిన అవసరం లేదు.

బ్లడ్ బ్యాంకుల్లో దాతల నుండి రక్తాన్ని సేకరించిన తరువాత దాని నుండి ఎర్రరక్తకణాలు, ప్లాస్మా, ప్లెట్ లెట్స్ ను విడదీసి వేరుచేసి ప్యాక్ చేస్తారు. తద్వారా ఎవరికి ఎవి అవసరమో వాటిని ఎక్కిస్తారు. బ్లాడ్ బ్యాంకుల్లో దాతల నుండి బ్లడ్ ను సేకరిస్తారు. దాని నుండి ప్లేట్ లెట్స్ ను సమీకరిస్తారు. దీనిని ర్యాండమ్ డోనార్ ప్లేట్ లెట్స్ గా పిలుస్తారు. ఇలా ఎక్కించిన సందర్భంలో 5,000 కౌంట్ స్ధాయి మాత్రమే ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది. కౌంట్ ను కనీసం 25,000 నుండి 30,000వరకు పెంచాలంటే ర్యాండమ్ డోనార్ ప్లేట్ లెట్స్ 5 నుండి 6 యూనిట్ల రక్తం సేకరించాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం 6గురు రక్తం ఇచ్చే దాతలు అవసరం అవుతారు.

Tags:    
  • Platelets 
  • originate 
  • bone marrow 
  • latest news 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS