• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బోస్ మరణానికి కొద్దిగంటల...

బోస్ మరణానికి కొద్దిగంటల ముందు..?

By - Tupaki Desk
Update: 2016-01-04 07:06 GMT
స్వాతంత్ర్య సమరయోధుల్లో సుభాష్ చంద్రబోస్ తీరు చాలా విలక్షణంగా ఉంటుంది. భారత్ కు స్వాతంత్ర్యాన్ని సాధించేందుకు వీలుగా.. పలు దేశాల సాయం తీసుకోవాలని భావించటం తెలిసిందే. బ్రిటీష్ వారి గుండెల్లో నిద్రపోయి.. వారికి కంటి నిండా కునుకు లేకుండా చేశారు. అలాంటి ఆయన మరణం ఒక మిస్టరీగా మారటం.. ఆయన చివరి రోజులు ఎలా గడిచాయి? ఏం జరిగింది? ఆయన నిజంగా మరణించారా? లేదా? అన్న ప్రశ్నలకు నేటికి సంతృప్తికర సమాధానాలు లభించని దుస్థితి.

ఇదిలా ఉంటే.. బోస్ మరణం చుట్టూ నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు ఆయన మనమడు అశిష్ రే విపరీతంగా శ్రమిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించటం.. పెద్ద ఎత్తున పత్రాల్ని సంపాదించటం.. వాటిని అధ్యయనం చేస్తున్నారు. తాజాగా.. బోస్ మరణించారని చెబుతున్న కొద్ది గంటల ముందు అసలేం జరిగింది? బోస్ ఏం చేశారు? లాంటి ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు. తనకు లభించిన సమాచారాన్ని ఆయన ఒక వెబ్ సైట్ లో బొస్ మరణానికి కొన్ని గంటల ముందు ఏం జరిగిందన్న దానిపై వివరాలు ఉంచారు.

1945 ఆగస్టు 17న బోస్ బృందం బ్యాంకాక్  నుంచి విమానంలో వియత్నాంలోని సైగాన్ చేరుకున్నారని.. ఈశాన్య ఆసియాకు వెళ్లాల్సి ఉన్నా.. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోవటంతో షెడ్యూల్ మారిందని వెల్లడించారు. నేతాజీ నేతృత్వంలోని భారత జాతీయ సైన్యానికి.. జపాన్ కు మధ్యవర్తిగా ఉన్న హికరి కి కన్జ్ సంస్థ జనరల్ ఇసోదాతో సమావేశమయ్యారు

లెఫ్టినెంట్ జనరల్ షిదెయ్ సూచనతో చైనాలోని మంచూరియా వెళ్లేందుకు బోస్ అంగీకరించారు. ఆలస్యంగా బయలుదేరిన విమానం.. పైలెట్ చేసిన సూచనతో తొరేన్ లో ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నట్లు బోస్ మనమడు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు ఆయన బయటపెట్టనున్నట్లు చెబుతున్నారు. ప్రయత్నం ఎవరిదైనా.. బోస్ మరణంపై దేశ ప్రజలకు స్పష్టత రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    
  • Netaji 
  • Death Mystery 
  • Telugu NEws 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS