బిల్లులు అడ్డుకుంటున్న మండలిపై స్పందించిన జగన్

Update: 2020-01-23 10:46 GMT
ఏపీ అసెంబ్లీ లో నాలుగో రోజు సీఎం జగన్ శాసన మండలిలో బిల్లులు అడ్డుకుంటున్న తీరుపై స్పందించారు. శాసనమండలిలో బుధవారం అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకోవడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని జగన్ స్పష్టం చేశారు.

అసెంబ్లీ లో 4వ రోజు శాసనసభ లో విద్యా చట్టం సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదించిన ఈ బిల్లును మండలి సవరణలు చేసి పంపించిందని.. మండలి సూచించిన సవరణలు తిరస్కరించి మళ్లీ ఆమోదిస్తున్నామని జగన్ తెలిపారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు మండలిలో అడ్డుకున్నా చట్టం చేస్తామని జగన్ స్పష్టం చేశారు.

మండలి తాము చేసే ఎన్ని బిల్లులను అడ్డుకున్నా సరే చట్టంగా చేస్తామంటూ సీఎం జగన్ స్పష్టం చేశారు. అన్ని తెలిసి కూడా మండలిలో టీడీపీ బిల్లులను అడ్డుకుంటోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో వెనక్కి తగ్గేది లేదని జగన్ సవాల్ చేశారు. 3 రాజధానులు, ఇంగ్లీష్ మీడియం విద్యాహక్కులను అమలు చేసి తీరుతామని అసెంబ్లీ సాక్షి గా ప్రకటించారు.
Tags:    

Similar News