విశాఖ - విజయవాడ ' ఉదయ్ ' ట్రైన్... డేట్ ఫిక్స్
విశాఖపట్నం - విజయవాడ నగరాల మధ్య ప్రస్తుతం చాలా ట్రైన్స్ నడుస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే వాళ్లకు సౌలభ్యంగా ఉంటుంది. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 6 గంటలకు విజయవాడలో బయలుదేరి విశాఖకు వెళుతుంది. ఈ రెండు నగరాల మధ్య మూడేళ్ల నుంచి ప్రయాణికులు ఎదురుచూస్తున్న ఉదయ్ ట్రైన్ పట్టాలు ఎక్కేందుకు ముహూర్తం సిద్ధమైంది. ఈ డబుల్ డెక్కర్ ట్రైన్ ఆగస్టు 16 నుంచి స్టార్ట్ అవ్వనుందని తెలుస్తోంది. ఉదయ్ రైలుకు ఉత్కృష్ట డబుల్ డెక్కర్ ఎయిర్ కండీషన్డ్ యాత్రి రైలుగా కూడా పేరుంది.
నిజానికి ఈ రెండు నగరాల మధ్య కేంద్ర ప్రభుత్వం ఈ ట్రైన్ ను 2016 బడ్జెట్లోనే ప్రకటించింది. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ ట్రైన్ ఇప్పుడు పట్టాలు ఎక్కేందుకు రెడీగా ఉంది. ఈ ఉదయ్ ట్రైన్ నెలరోజులుగా వాల్తేరు రైల్వే యార్డులో ఉండిపోయింది. రైల్వే అధికారులు ఈ ట్రైన్ ను ఎట్టకేలకు పట్టాలు ఎక్కించేందుకు చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు పట్టాలు ఎక్కుతోంది. ఇప్పటికే ట్రైన్ రైల్ కూడా నిర్వహించారు. కొన్ని బోగీలను విశాఖ నుంచి చెన్నై వరకు పంపించగా... మరికొన్నింటిని విశాఖ నుంచి విజయనగరం టు రాయగడ రూట్ లో పంపించారు.
ట్రైల్ రన్ విజయవంతంగా పూర్తవడంతో అలంకరణ పనులు చేపట్టి స్వాతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం ఆగస్టు 16 నుంచి పట్టాలు ఎక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ట్రైన్ ప్రారంభోత్సవంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ఆఫీస్ నుంచి రైల్వే అధికారులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ రైలు వారానికి ఐదు రోజులు.. సోమ- మంగళ- బుధ- శుక్ర- శనివారాల్లో ప్రయాణిస్తుంది. ఈ డబుల్ డెక్కర్ ఏసీ రైలును చాలా విలాసవంతంగా తీర్చిదిద్దారు.
విశాఖలో 22701 నెంబరుతో ఉదయం 5.45 గంటలకు బయలుదేరి విజయవాడకు 11.45 కు చేరుకుంటుంది. మళ్లీ విజయవాడలో 22702 నెంబరుతో సాయంత్రం 5.30 కి బయలుదేరి విశాఖకు రాత్రి 10.55 గంటలకు చేరుకుంటుంది. ఓవరాల్ గా ఈ రెండు నగరాల మధ్య ఈ రైలు ప్రయాణం 5.25 గంటలుగా ఉంటుంది.