`వ‌రి వేస్తే.. జైలే!` అన్న క‌లెక్ట‌ర్‌కు ఎమ్మెల్సీ..!

Update: 2021-11-17 08:30 GMT
`ఏం రాజ‌కీయాలు బాస్‌! మ‌రీ ఇంత సాగిల‌ప‌డిపోవాలా?` అని బుగ్గ‌లు నొక్కుకున్న వాళ్లే.. ఇప్పుడు.. క‌ళ్లు తేలేసే ప‌రిస్థితి వ‌చ్చింది. వంగి వంగి ద‌ణ్ణాలు పెట్టిన ఆ క‌లెక్ట‌రే.. ఇప్పుడు రాజ‌కీయ‌నాయ‌కుడిగా .. మండ‌లి స‌భ్యుడిగా మారుతున్నారు. ఆయ‌నే వెంక‌ట్రామ‌రెడ్డి.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న క‌లెక్ట‌ర్‌. అంతేకాదు.. రైతుల‌ను బెదిరించిన అధికారి. వ‌రివేస్తే.. జైల్లో పెట్టిస్తా! అంటూ.. హూంక‌రించిన జిల్లా పాల‌నాధికారి. అలాంటి వ్య‌క్తి.. ఒక్క‌సారిగా.. మండ‌లికి వెళ్లారు. ఇది స‌మంజ‌స‌మేనా? అనే విష‌యం.. ప్ర‌స్తుతం రాజకీయాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది.

నాలుగు పొగ‌డ్త‌లు.. రెండు సాగిల‌ప‌డ‌డాలు.. ఉంటే.. రాజ‌కీయ నేత‌ల‌ను మెప్పించ‌వ‌చ్చిన‌. ఆ వెంట‌నే ఏదైనా చేయొచ్చ‌ని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అధికారులు నిరూపించారు. అప్ప‌టి వ‌ర‌కు అధికారులుగా ఉన్న‌వారు.. అనంత‌ర కాలంలో.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌రిస్థితి ఉంది.

ఏపీలోనూ.. ఐఆర్ ఎస్ ప‌ద‌వులు వ‌దులుకుని.. స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ల పోస్టుల‌కు రిజైన్‌చేసి.. వ‌చ్చి.. ప్ర‌జాక్షేత్రంలో గెలిచి స‌త్తా చాటిన అధికారులు ఉన్నారు. అయితే.. వారికి, వెంక‌ట్రామ‌రెడ్డికి ప్ర‌త్యేక‌మైన తేడా ఉంది. ఈయ‌న త‌న క‌లెక్ట‌ర్ గిరీ కాలంలో.. రైత‌లును బెదిరించ‌డం.. కేసులు పెట్ట‌డం.. ఒంటెత్తు పోక‌డ‌ల‌కు పోవ‌డం వంటివి చేశారు.

అంతేకాదు.. అధికార పార్టీకి అన్నీ తానై.. సిద్దిపేట‌లో చ‌క్రం తిప్పారు. ప్ర‌తిప‌క్షాల‌ను కూడా.. లెక్క‌చేయ‌ని అధికారిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు ఒక్క‌సారిగా కేసీఆర్ అండ‌దండ‌లతో ఆయ‌న మండ‌లికి నామినేట్ అయ్యారు.

దీంతో ఇప్పుడు రైతుల‌నే లెక్క‌చేయ‌ని అధికారి.. రైతుల‌ను జైలుకు పంపిస్తామ‌ని.. ప్ర‌క‌టించిన అధికారి.. రేపు ప్ర‌జాప్ర‌తినిధిగా సేవ చేస్తారంటే.. న‌మ్మాలా? అనేది ప్ర‌శ్న‌. అంతేకాదు.. ఇలాంటి వారు కేవ‌లం భ‌ట్రాజులుగానే మిగులుతారు త‌ప్ప‌.. రాజ‌కీయాల్లో ప్ర‌జ‌ల సేవ‌కులుగా ఎన్న‌టికీ నిల‌వ‌బోర‌ని అంటున్నారు.

నిజానికి ఇప్పుడు. .తెలంగాణ స‌ర్కారు.. రైతు జ‌పం చేస్తోంది. ఈ నేప‌థ్యంలోరైతుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించాల్సిన వారే తిరుగుబాటు చేసి.. బ‌క్క ప్రాణుల‌ను.. బ‌జారున ప‌డేలా వ్య‌వ‌హ‌రించిన ఘ‌ట‌న‌లు ఇంకా మ‌రిచిపోక‌ముందే.. అలాంటివారిని ప్ర‌జా నేత‌లుగా నిల‌బెట్ట‌డం.. ద్వారా.. కేసీఆర్ ఎలాంటి సందేశాలు ఇస్తున్నారు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న. మా ది రైతు ప్ర‌భుత్వం అని చెప్పుకొంటున్న నేత‌లు.. ఇలా రైతుల‌ను బెదిరించిన వారికి శాస‌న మండ‌లిలో సీటు ఇవ్వ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల‌కు ఏం చెబుతారో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.




Tags:    

Similar News