• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వెంకయ్య కూడా కొత్తతరం...

వెంకయ్య కూడా కొత్తతరం రాజకీయం నేర్చేసుకున్నారు

By - Tupaki Desk
Update: 2015-04-10 15:30 GMT
రాజకీయాల్లో ఏ ఎండకా గొడుగు పట్టేవారు, ఏ రోటికాడ ఆ పాట పాడేవారు చాలామందే ఉంటారు.. ఆ నైజంతోనే ఎంతో ఎత్తుకు ఎదిగినవారూ ఉన్నారు. అదే సమయంలో ఏ విషయమైనా స్పష్టంగా, సూటిగా... కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడి తమ నిర్ణయాలు స్పష్టంగా చెప్పే నేతలూ ఉన్నారు.. వారూ ఆ తత్వంతోనే పైకొచ్చారు. అలా ఉన్నదున్నట్లుగా మాట్లాడే అగ్రనేతల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా ఒకరు. అయితే... ఇటీవల కాలంలో ఆయన తన నైజానికి  విరుద్ధంగా గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన తిరుపతి ఎన్‌ కౌంటర్‌ పైనా అలాగే మాట్లాడారు.

    ఆయన ఎన్‌ కౌంటర్‌ ను నేరుగా సమర్దించలేదు కాని, ఎర్రచందనం స్మగ్లింగ్‌ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌ ను అరికట్టడానికి హెచ్చరికలు చేస్తున్నదని, రక్షిత అడవులలోకి వెళ్లవద్దని చెబుతోందని ఆయన అన్నారు. కేంద్ర మంత్రిగా తాను దీనిపై ఏమి జరిగిందో తెలియకుండా స్పందించరాదని అన్నారు.వివరాలు రావల్సి ఉందని వెంకయ్య నాయుడు అన్నారు.అయితే బిజెపికి చెందిన కేంద్ర మంత్రి పొన్ను రాధాకృష్ణన్‌ మాత్రం తిరుపతి ఎన్‌ కౌంటర్‌ సామూహిక హత్యాకాండ అని అంటున్నారు. ఈ ఎన్‌ కౌంటర్‌ జరిగి నాలుగు రోజులవుతున్నా వెంకయ్య ఇంకా విషయం పూర్తిగా తెలియలేదనడం విచిత్రమే మరి. ఒకప్పుడు జనతా పార్టీ తరపున మానవ హక్కుల కోసం పోరాడిన వెంకయ్య నాయుడుకు ఇప్పుడు కర్ర విరగకుండా పాము చావకుండా మాట్లాడడం తగదేమో.
Tags:    
  • Venkaiah Naidu 
  • Red sandalwood Smugglers encounter 

Similar News

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

Copyright @2026

Powered by Blink CMS