• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తుఫాన్ల నెల నవంబర్.. అసలు...

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

| ఒకదాని తర్వాత ఒకటిగా ఏపీని తాకుతున్న తుఫాన్లు రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నాయి.

By - Tupaki Political Desk
Update: 2026-11-02 10:00 GMT

ఒకదాని తర్వాత ఒకటిగా ఏపీని తాకుతున్న తుఫాన్లు రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా పంట చేతికొచ్చే నవంబరు నెలలో ఏర్పడుతున్న తుఫాన్ల వల్ల రైతులు ఆర్థికంగా కోలుకోలేని విధంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఏపీని తాకుతున్న ఎక్కువ తుఫాన్లు అక్టోబరు, నవంబరు నెలల్లోనే నమోదు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా నవంబరులో వస్తున్న తుఫాన్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దాదాపు 50 ఏళ్ల క్రితం 1977 నవంబరులో ఏపీని తాకిన పెను తుఫాన్ సుమారు పది వేల మంది ప్రాణాలు తీసింది. కోట్లాది రూపాయల ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. అప్పటి నుంచి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్లు, వరదలు లేని సంవత్సరం అంటూ ఉండటం లేదని నివేదికలు చెబుతున్నాయి.

రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ లెక్కల ప్రకారం ఏపీలో సుమారు 44 శాతం ప్రాంతం ఉష్ణమండల తుఫానులను ఎదుర్కొంటోంది. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ తుఫాన్లు, ప్రకృతి విపత్తుల వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతూనే ఉంటోంది. గుంటూరు జిల్లాలో ఉన్న నిజాంపట్నం నుంచి కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మధ్య తీరప్రాంతం ఎక్కువగా తుఫాన్ ఉప్పెనల ముంపు ఎదుర్కొంటోందని రికార్డులు చెబుతున్నాయి. అదేవిధంగా బలమైన గాలులు, కుండపోత వర్షాల కారణంగా విస్తారమైన పంట పొలాలు ఉండే గోదావరి జిల్లాలు అధికంగా నష్టపోతున్నాయి.

తూర్పు తీరమే శాపమా?

మన దేశానికి తూర్పున ఉన్న బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో ఏర్పడుతున్న తుఫాన్ లు సాధారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరా ప్రాంతాలను చేరుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఏటా ఈ రాష్ట్రాలు ఎక్కువగా నష్టపోతుంటాయి. అయితే అక్టోబరు, నవంబరు నెలల్లో ఏర్పడుతున్న తుఫాన్ల వల్ల ఎక్కువగా ఏపీ ప్రభావితమవుతోందని లెక్కలు చెబుతున్నాయి. గత 50 ఏళ్లలలో ఏర్పడిన సుమారు 30కిపైగా తుఫాన్లు ఏపీ తీరాన్ని తాకినట్లు చెబుతున్నారు. తాజాగా ఏర్పడిన మురసు నుంచి వెనక్కి లెక్కిస్తే అనేక ప్రకృతి విపత్తులు నవంబరులో ఏపీని నాశనం చేశాయని గణాంకాలు చెబుతున్నాయి.

రెండు రకాల తుఫాన్లు

సాధారణంగా తుఫాన్లు రెండు సందర్భాలలో ఏర్పడుతుంటాయని అంటున్నారు. రుతుపవనాలకు ముందు, రుతుపవనాల తర్వాత సముద్రంలో తుఫాన్లు ఏర్పడుతుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంటే ఏప్రిల్, మే, అక్టోబరు, నవంబరు నెలల్లో తుఫాన్లు ఏర్పడేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్, మే నెలల్లో తుఫాన్ల వల్ల పెద్దగా నష్టం ఉండదని, కానీ పంట సీజన్ ముగింపునకు వచ్చే అక్టోబరు, నంబరు నెలల్లోనే ఎక్కువ నష్టం వాటిల్లుతోందని వివరిస్తున్నారు.

ఇప్పుడే ఎందుకు?

సాధారణంగా అక్టోబరు, నవంబరు నెలలో బంగాళాఖాతంలో ఎక్కువ తుఫాన్లు ఏర్పడటానికి ప్రధానంగా అనుకూలమైన సముద్ర ఉష్ణోగ్రతలు, రుతుపవనాల తిరోగమనం, వాతావరణ పరిస్థితులు కారణంగా చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల కాలమంతా సముద్రం సూర్యుడి వేడిని పీల్చుకుని ఉంటుందని, దీనివల్ల నవంబర్ నాటికి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 26.5 సెల్సియస్ డిగ్రీల కంటె ఎక్కువగా ఉండి, తుఫాన్లకు కావలసిన ఉష్ణశక్తిని, తేమను అందిస్తాయని వివరిస్తున్నారు. అంతేకాకుండా నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్లి, ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమయ్యే సమయం కూడా కావడంతో ఈ సమయంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయని అంటున్నారు. ఫలితంగా ఉపరితల గాలుల మధ్య తేడాలు తగ్గి, వాతావరణంలో అల్పపీడన ద్రోణులు బలపడి తుఫానుగా మారడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని చెబుతున్నారు.

బంగాళాఖాతంలోకి నదుల ద్వారా మంచి నీరు చేరడం వల్ల పైభాగంలో ఉండే తేలికపాటి నీటి పొర కింద ఉండే చల్లటి నీరు పైకి రాకుండా అడ్డుకుంటుందని, ఫలితంగా సముద్ర ఉపరితలం వేడెక్కి ఉంటుందని చెబుతున్నారు. ఇదే సమయంలో పసిఫిక్ మహాసముద్రం నుండి వచ్చే తుఫాను అవశేషాలు లేదా తూర్పు దిశ నుండి వచ్చే అలలు బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనాలుగా మారడానికి ప్రేరేపిస్తాయని చెబుతున్నారు. ఈ కారణాల వల్ల అక్టోబరు, నవంబరు నెలల్లో తుఫాన్లు ఏర్పడేందుకు వాతావరణం అనుకూలిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇదే కాకుండా అరేబియా సముద్రంతో పోలిస్తే బంగాళాఖాతంలో ఎక్కువ తుఫాన్లు వస్తుంటాయని, దీనికి కారణంగా ఇక్కడి భూభాగమే అంటున్నారు. బంగాళాఖాతం చుట్టూ భూమి ఉండటం, లోతు తక్కువగా ఉండటం వల్ల వాతావరణంలో వేగంగా మార్పులు సంభవిస్తున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతుున్నారు.

Tags:    
  • andhrapradesh 
  • bayofbengal 
  • cyclones 
  • novembercyclones 
  • farmers 

Similar News

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

నీతా అంబానీ గొప్ప మనసు.. 5 వేల మంది నిరాశ్రయులకు అండగా ‘అనంత్ ఆశ్రయ్’

2026-11-02 04:56 GMT

Copyright @2026

Powered by Blink CMS