• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Andhra Pradesh >  Anantapuramu >  రాప్తాడు బాలిక హెల్త్...

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

| రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి, బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి లోకేశ్ వెల్లడించారు.

By - Tupaki Political Desk
Update: 2026-11-02 07:56 GMT

రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి, బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఆదివారం బెంగళూరు ఆస్పత్రికి వెళ్లిన మంత్రి లోకేశ్ వైద్యులతో మాట్లాడి అవసరమైన వైద్యం చేయాలని సూచించారు. ఇక సోమవారం బాలిక ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్నారితో తల్లి మాట్లాడిందని తెలిపారు. ఈ సాయంత్రం కల్లా వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉందని మంత్రి లోకేశ్ చెప్పారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తన ట్వీట్ లో తెలిపారు.

ఆపద గట్టెక్కినట్లే..

రెండు రోజుల క్రితం రాప్తాడు జడ్పీ హైస్కూల్ లో ఉన్మాది జరిపిన దాడిలో పదో తరగతి విద్యార్థిని తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలికను గ్రీన్ చానల్ ద్వారా బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం చేసిన డాక్టర్లు 48 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమనడంతో బాలిక ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. సుమారు 12 గంటల పాటు శ్రమించిన వైద్యులు అవసరమైన అనేక శస్త్రచికిత్సలు చేశారు. అనంతరం ఐసీయూకి తరలించి అబ్జర్వేషన్ లో ఉంచారు. దీంతో 48 గంటల వరకు బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఏం చెప్పలేమని వైద్యులు ప్రకటించారు. అయితే అనూహ్యంగా దేవుడి దయవల్ల బాలిక కోలుకుంటున్నట్లు మంత్రి లోకేశ్ ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

అన్నివిధాలుగా అండగా ఉంటాం..

బెంగళూరు ఆస్పత్రిలో బాలికను ఆమె తల్లిదండ్రులను మంత్రి లోకేశ్ ఆదివారం పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వైద్యం చేయాలని, చికిత్సకు అయ్యే ఖర్చు అంతటిని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. చిన్నారి ధైర్యంతో ఉందని, సంపూర్ణంగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బాలిక ప్రాణాలు కాపాడేందుకు మణిపాల్ ఆస్పత్రి వైద్యులు చేస్తున్న కృషిని మంత్రి లోకేశ్ అభినందించారు.

చిన్నారి ఆరోగ్యంపై నెటిజన్లలో ఆసక్తి

కాగా, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాప్తాడు ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ పోస్టులు పెడుతున్నారు. ఇక చిన్నారి ఆరోగ్యంపై మంత్రి లోకేశ్ చేసిన ట్వీట్ కు రెండు గంటల్లో దాదాపు 1.50 లక్షల మంది స్పందించారు. సుమారు వెయ్యి మందికిపైగా రీట్వీట్ చేశారంటే బాలిక ఆరోగ్య సమాచారం తెలుసుకోవాలనే అంశంపై ప్రజల్లో ఎంత ఆత్రుత ఉందో అర్థమవుతోందని అంటున్నారు. మరోవైపు బాలికపై దాడి చేసిన ఉన్మాదిపై పోలీసులు కాల్పులు జరపడాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడు రెండు కాళ్లు తొలగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో నిందితుడు బతికున్నంత కాలం జీవచ్చవంలా గడపాల్సివుంటుందని, అదే అతడికి సరైన శిక్ష అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Tags:    
  • raptadu 
  • naralokesh 
  • andhrapradesh 
  • schoolattack 
  • manipalhospital 

Similar News

రంపంతో నరికాడు...తూటాతో కూలాడు !

2026-11-02 03:46 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

తరగతి గదిలోనే రాక్షసత్వం : పదోతరగతి విద్యార్థినిపై పాశవిక దాడి

2026-10-31 08:16 GMT

వైసీపీ సీపీఐ చెట్టాపట్టాల్...అనంతలో బిగ్ ట్విస్ట్

2026-10-31 00:30 GMT

కొత్త పాలిటిక్స్‌: ప‌రిచ‌యాలు పెంచుతున్నారు.. !

2026-09-30 22:30 GMT

రాప్తాడు స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ ప‌ట్టెంత‌.. ?

2026-09-26 16:30 GMT

కూతురిపై అసభ్య ప్రవర్తన.. ప్రైవేట్ పార్ట్ ను కోసేసిన మహిళ

2026-08-02 04:51 GMT

'చెప్పుతో కొడ‌తా'.. వైసీపీ నేత‌పై ఎమ్మెల్యే ఫైర్‌!

2026-07-09 09:37 GMT

పొలిటిక‌ల్ గతాలు.. మంచివేనా.. ?

2026-07-01 11:30 GMT

తాడిప‌త్రిలో ఉద్రిక్త‌త‌.. పెద్దారెడ్డి హౌస్ అరెస్టు

2026-06-26 09:53 GMT

#ViralNews - ‘స్వామి, మా అత్త చనిపోయేలా చూడు’.. రూ.20 నోటుపై దేవుడికి వింత విన్నపం!

2026-06-19 11:05 GMT

Copyright @2026

Powered by Blink CMS