• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  50 టీఎంసీల వరద..?!...

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

| మురసు తుఫానుతో రాష్ట్రంలో రాయలసీమ, పల్నాడు జిల్లాలలో నీటి లోటు తీరే పరిస్థితి కనిపిస్తోంది.

By - Tupaki Political Desk
Update: 2026-11-02 11:04 GMT

మురసు తుఫానుతో రాష్ట్రంలో రాయలసీమ, పల్నాడు జిల్లాలలో నీటి లోటు తీరే పరిస్థితి కనిపిస్తోంది. నెల్లూరు సమీపంలో తీరందాటనున్న మురసు కారణంగా దక్షిణకోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పల్నాడు జిల్లాలో 30 సెంటీమీటర్లు, ప్రకాశంలో 24, మార్కాపురంలో 19, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 9 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదేవిధంగా ఏలూరులో 9 సెం.మీ., నెల్లూరులో 9 సెం.మీ. మేర వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్నారు. భారీ వర్షాల కారణంగా నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులకు 30 టీఎంసీల నుంచి 50 టీఎంసీల వరకు నీటి ప్రవాహాలు రావచ్చని అంచనా వేస్తున్నారు.

పులిచింతలలో 18 టీఎంసీల మేర ఫ్లడ్‌ కుషన్‌ అందుబాటులో ఉండగా, నాగార్జునసాగర్‌కు కూడా భారీగా ప్రవాహాలను తట్టుకునే పరిస్థితి ఉందని చెబుతున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు 1.5 లక్షల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక తుఫాను హెచ్చరికలు, భారీ వరదలపై అంచనాలతో అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తం చేశారు. తుఫాన్ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం నుంచి సెక్రటేరియట్ లో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలో తిష్ట వేశారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన సూచనలు జారీ చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో డ్రెయిన్లను ముందుగానే శుభ్రం చేయాలని, వాగులు, వంకలు పొంగి ప్రవహించే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం జిల్లాల్లో వర్షపాతం లోటు ఉన్నందున చెరువులు, రిజర్వాయర్‌లను నింపాలని సూచించారు.

అర్నాబ్ కంటే తక్కువ ప్రభావం

కోస్తాంధ్ర తీరంపై మురసు తుఫాను ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు తెలిపారు. అర్నబ్ తుఫానుతో పోలిస్తే గాలులు, వర్ష తీవ్రత కూడా తక్కువగానే ఉన్నట్టు అంచనాలు ఉన్నాయని వివరించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తుపాను ప్రభావంతో వచ్చే వర్షాలను సమర్థంగా వినియోగించుకుని చెరువులు, రిజర్వాయర్‌లను నింపాలని సూచించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. మురసు తుఫాను గాలుల ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని సుమారు 8 వేల విద్యుత్ స్తంభాలపై పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం చెన్నై నుంచి మరో వెయ్యి మంది సిబ్బంది వస్తున్నారని, వారిని నెల్లూరు, ప్రకాశం సహా వివిధ జిల్లాల్లో వినియోగించాలని సీఎం సూచించారు.

చెరువులకు గండ్లు పడకుండా చర్యలు

మురసు తుఫాను ప్రభావం ఉన్న 6 జిల్లాల పరిధిలోని 6,800 చెరువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సాగునీటి సంఘాలను క్రియాశీలం చేసి ప్రజల భాగస్వామ్యంతో చెరువుల పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. జలధార కార్యక్రమం కింద చేపట్టిన పనులను వినియోగించుకోవాలని, ఎక్కడా చెరువులకు గండ్లు పడకుండా చూడాలని స్పష్టం చేశారు. డ్రెయిన్లలో పూడిక కారణంగా పంటలు ముంపునకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో గర్భిణులను ముందుగానే ఆసుపత్రుల్లో చేర్పించాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 3,066 మంది గర్భిణీలను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కచ్చా ఇళ్లలో నివసించే వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని, అవసరమైన నిత్యావసర వస్తువులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అవసరాన్ని బట్టి మోహరించాలన్నారు. రైల్వే మార్గాలు, జాతీయ రహదారుల వద్ద లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు ఉంటే రాకపోకలను నియంత్రించాలని ఆదేశించారు. మత్స్యకారుల బోట్లు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రెండు గంటలకు ఒకసారి బులెటిన్

వర్షాలు, గాలులు, వరద ప్రవాహాలపై నిరంతరం పర్యవేక్షించాలని, సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి రెండు గంటలకు ఓ సారి పరిస్థితిని సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భరోసా కల్పించాలని, కలెక్టర్లు ఎప్పటికప్పుడు హెచ్చరికల ప్రకటనలు విడుదల చేయాలని చెప్పారు. తుఫాను అనంతర పునరుద్ధరణ పనులను 48 గంటల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పంటల బీమా పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడి ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్, ఆర్టీజీఎస్, వ్యవసాయ, జలవనరులు, అగ్నిమాపక సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు వర్చువల్ గా హాజరయ్యారు.

Tags:    
  • murasucyclone 
  • andhrapradesh 
  • chandrababu 
  • rayalaseema 
  • cyclonealert 

Similar News

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

Copyright @2026

Powered by Blink CMS