• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇతరుల ఆనందమే కొలమానమా?...

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

| ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫేస్‌బుక్ స్టోరీలు, స్నాప్‌చాట్ స్నాప్స్‌.. ఇవే ఇప్పుడు యువత ప్రపంచం.

By - A.N.Kumar
Update: 2026-11-02 11:30 GMT

ఒకప్పుడు పండుగంటే కేవలం సంబరం మాత్రమే కాదు.. ఆప్యాయతల సమ్మేళనం.. అమ్మ చేసే పిండివంటల సువాసన.. ఇంటి ముంగిట మెరిసే ముగ్గుల శోభ.. కుటుంబ సభ్యుల కలయికతో కలకలలాడే ఇల్లు.. స్నేహితులతో కలిసి చేసే అల్లరి.. ఇవన్నీ కలిపితేనే అసలైన పండుగ. కానీ కాలం మారుతున్న కొద్దీ పండుగల అర్థం, పరమార్థం కూడా మారిపోతున్నాయి. నేడు పండుగ వచ్చిందంటే చాలు.. ఇళ్లలో కంటే సోషల్ మీడియా స్క్రీన్ల మీదే పండగ వాతావరణం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ డిజిటల్ హడావుడి వెనుక నేటి జెన్ జెడ్ యువతను ఒక నిశ్శబ్ద మానసిక భయం వెంటాడుతోంది. అదే 'ఎఫ్.ఓ.ఎం.ఓ' (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్).

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫేస్‌బుక్ స్టోరీలు, స్నాప్‌చాట్ స్నాప్స్‌.. ఇవే ఇప్పుడు యువత ప్రపంచం. పండుగ రోజున ఎక్కడ చూసినా ట్రెండ్‌కు తగ్గట్లుగా ఫొటోలు దిగడం.. వాటికి ఆకర్షణీయమైన మ్యూజిక్ జోడించి పోస్ట్ చేయడం సర్వసాధారణమైపోయింది. ఇతరులు పండుగను ఎంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూసి.. తమ సెలబ్రేషన్స్ అంతగా లేవనే చిన్నచూపు కొందరిలో మొదలవుతోంది.

"అందరూ ట్రిప్స్‌కి వెళ్తున్నారు.. ఖరీదైన దుస్తులు కొనుక్కుంటున్నారు.. మరి మేం మాత్రం వెనుకబడిపోయామా?" అనే ఆలోచన వారి మనసులో ఒక రకమైన అసంతృప్తిని రాజేస్తోంది. పండుగను మనస్ఫూర్తిగా ఆస్వాదించడం కంటే ఆ క్షణాలను సోషల్ మీడియాలో ఎలా చూపించుకోవాలనే తపనే ఎక్కువైపోతోంది. ఫలితంగా.. నిజమైన అనుభూతులు కనుమరుగై కేవలం డిజిటల్ అప్‌డేట్స్‌ మాత్రమే మిగులుతున్నాయి.

సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ నిజం కాదనే నిజాన్ని గ్రహించలేకపోవడమే ఈ అసంతృప్తికి అసలు కారణం. అక్కడ అందరూ తమ జీవితంలోని కేవలం అద్భుతమైన క్షణాలను మాత్రమే షేర్ చేస్తారు. వారి వెనుక ఉన్న సమస్యలు, ఒత్తిళ్లు, ఒంటరితనం ఎవరికీ కనిపించవు. కానీ ఆ భ్రమలో ప్రపంచాన్ని చూసి యువత తమ నిజ జీవితాన్ని దానితో బేరీజు వేసుకుంటూ కుంగిపోతున్నారు. స్నేహితుల పార్టీకి వెళ్లకపోతే ఏదో కోల్పోయామనే భావన.. ఇంట్లోనే ఉండి పండుగ జరుపుకుంటే వెనుకబడినట్లుగా భావించడం నేటి మానసిక ఒత్తిళ్లకు ప్రధాన కారణం అవుతున్నాయి. పండుగ వేళ అందరితో కలిసి నవ్వాల్సిన పెదవులు, ఫోన్ స్క్రీన్‌ను చూస్తూ గడిచిపోతున్నాయి.

ఈ మానసిక భారాన్ని దించుకోవడానికి సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ దానితో మన అనుబంధాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పండుగ రోజుల్లో లేదా కుటుంబంతో గడిపే సమయాల్లో కాస్త ఫోన్‌ను పక్కన పెట్టండి. ఆ క్షణాలను కళ్లారా చూడండి తప్ప.. కెమెరా లెన్స్‌లో కాదు. ఇతరుల ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్స్‌తో మీ జీవితాన్ని బేరీజు వేసుకోవడం మానేయండి. మీ సంతోషానికి కొలమానం లైకులు కాదు.. మీ మనసులో ఉండే ప్రశాంతత. అమ్మ చేతి వంట ఆస్వాదించడంలో నాన్నతో కబుర్లు చెప్పడంలో తోబుట్టువులతో కలిసి నవ్వుకోవడంలో ఉండే మజా ఏ డిజిటల్ ఫిల్టర్‌కూ రాదు. ఆన్‌లైన్ బంధాల కంటే ఆఫ్‌లైన్‌లో పక్కన ఉన్నవారితో మాట్లాడటం.. నవ్వులు పంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పండుగ అనేది ప్రపంచానికి మీ సంతోషాన్ని ప్రదర్శించుకునే వేదిక కాదు.. మీ అంతరాత్మకు తృప్తినిచ్చే పవిత్ర సమయం.

ఎవరు ఏ ట్రిప్‌కి వెళ్లారు? ఏం కొనుక్కున్నారు? ఎంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు? అనేది ముఖ్యం కాదు. ఆ పండుగ రోజు మీరు మీవారితో కలిసి ఎంత హాయిగా నవ్వుకున్నారు? ఎంతటి మధురమైన జ్ఞాపకాలను గుండెల్లో దాచుకున్నారు? అనేదే అసలైన విజయం. గుర్తుంచుకోండి.. ప్రతి అందమైన జ్ఞాపకానికి ఫొటో లేదా రీల్ అవసరం లేదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయని ఎన్నో క్షణాలు జీవితంలో అత్యంత విలువైనవిగా నిలిచిపోతాయి. ఇతరుల భ్రాంతి ప్రపంచాన్ని చూస్తూ మీ చేతిలో ఉన్న నిజమైన ఆనందాన్ని కోల్పోకండి..

Tags:    
  • festivalfomo 
  • genz 

Similar News

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

Copyright @2026

Powered by Blink CMS