• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Andhra Pradesh >  Anantapuramu >  రాప్తాడు ఉన్మాదికి పోలీసు...

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

| అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై దాడి చేసిన ఉన్మాది కుడి కాలు కుళ్లిపోయిందని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెండ్ మల్లీశ్వరి ప్రకటించారు.

By - Tupaki Political Desk
Update: 2026-11-02 09:58 GMT

అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై దాడి చేసిన ఉన్మాది కుడి కాలు కుళ్లిపోయిందని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెండ్ మల్లీశ్వరి ప్రకటించారు. బాలిక దాడి అనంతరం ఆత్మకూరు అడవులకు పారిపోయిన నిందితుడిని ఆదివారం పట్టుకునే ప్రయత్నంలో పోలీసులపై కత్తితో దాడి చేయడం, పోలీసు ఎదురు కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు సోమవారం సమాచారం వెల్లడించారు. పోలీసు కాల్పుల్లో నిందితుడు కుడికాలికి తీవ్ర గాయాలు అయ్యాయని వెల్లడించారు. పోలీసు తూటాలకు కుడికాలు నరాలు చిద్రమైనట్లు వైద్యులు గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో రక్తప్రసరణ జరగక కుళ్లిపోయిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి మీడియాకు తెలిపారు. నిందితుడికి వైద్య పరీక్షలు చేసిన తర్వాత సగం కాలు తొలగించే పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. రెండు కాళ్లకు ఎక్స్ రే తీశామని, అనస్థీషియా రిపోర్టు పరిశీలించిన తర్వాత కాలు తొలగింపుపై నిర్ణయం ఉంటుందని సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.

రెండో కాలు తీసేస్తారా?

కాగా, నిందితుడి ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన చేసిన డాక్టర్ మల్లీశ్వరి వైద్య నివేదికలను పరిశీలించి కుడి కాలు తొలగించే పరిస్థితి రావొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే కాల్పుల తీవ్రత వల్ల నిందితుడు రెండు కాళ్లు తొలగించాల్సి వుంటుందని ఆస్పత్రి వర్గాలలో చర్చ జరుగుతోంది. నిందితుడి కాళ్లలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయని అంటున్నారు. నిందితుడి కుడికాలుకు రక్త ప్రసరణ పూర్తిగా తగ్గిపోయిందని అంటున్నారు. ఒకవేళ రక్త సరఫరా పునరుద్ధరించ బడకపోతే నరాలు, కండరాలు దెబ్బతిని ఆ కాలిని తొలగించాల్సి వస్తుందని అంటున్నారు. కాళ్ల భాగాల్లో దిగిన బుల్లెట్లను తొలగించేందుకు వైద్యులు అత్యవసర సర్జరీ నిర్వహించారు. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల నిందితుడికి ఇప్పటికే 4 యూనిట్ల రక్తం ఎక్కించారు. ఆక్సిజన్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఒక కాలు తొలగించిన తర్వాత రెండో కాలు తొలగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

బతికిన అంతకాలం జీవచ్ఛవమే

పదో తరగతి విద్యార్థినిపై పాశవికంగా దాడి చేసిన నిందితుడికి తగిన శిక్ష పడిందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. పోలీసు కాల్పుల్లో నిందితుడు గాయపడ్డాడని తెలుసుకున్న ప్రజలు ఆదివారం రాత్రి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. భవిష్యత్తుల్లో ఆడపిల్లలపై ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే నిందితుడిని కాల్చి చంపాలని, ఉరి తీయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులతో తిరగబడటంతో ఆత్మరక్షణ కోసం వారు చేసిన ఎదురు కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడి రెండు కాళ్లపై బులెట్ గాయాలు కావడం, కాల్పుల్లో నరాలు చిద్రమైనట్లు వైద్యులు గుర్తించడంతో నిందితుడు బతికిన అంతకాలం జీవచ్ఛవంలా గడపాల్సి రావొచ్చునని అభిప్రాయ పడుతున్నారు. మరణం కన్నా, ఇది తీవ్రమైన శిక్షగా అభివర్ణిస్తున్నారు.

చట్టానికి దొరక్కుండా పోలీసు శిక్ష

నిందితుడిపై పోలీసులు జరిపిన కాల్పులను ప్రజలు హర్షిస్తున్నట్లు పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. వివిధ వేదికలపై జరుగుతున్న చర్చను పరిశీలిస్తే నిందితుడిని కఠినంగా శిక్షించాలనే అంశంపై ప్రజలు అంతా ఏకాభిప్రాయంతో ఉన్నారని అనిపిస్తోందని అంటున్నారు. విద్యార్థినిపై దాడి అనంతరం నిందితుడిని కాల్చి చంపాలని పోలీసులపై తీవ్ర ఒత్తిడి వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో సీసీ కెమెరాలను విశ్లేషించి నిందితుడు ఆచూకీని పసిగట్టిన పోలీసులు 24 గంటల్లో పట్టుకునేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. ఇదే సమయంలో పై నుంచి వచ్చిన సూచనలతో కఠిన చర్యలకు దిగారని అంటున్నారు. ఫలితంగానే నిందితుడు జీవచ్ఛవలం మారిపోయినట్లుగా విశ్లేషిస్తున్నారు. ఈ విషయంలో న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మోకాలి దిగువన కాల్చడం వల్ల నిందితుడికి ప్రాణాపాయం లేకుండా జాగ్రత్త పడ్డారని అంటున్నారు. ఇదే సమయంలో అతడు ప్రాణాలతో ఉన్నప్పటికీ తాను చేసిన పనిని తలచుకుని జీవితాంతం నరకం అనుభవించేలా శిక్షించారని అభిప్రాయ పడుతున్నారు.

Tags:    
  • raptadu 
  • anantapur 
  • andhrapradesh 
  • schoolgirlattack 
  • policefiring 

Similar News

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

రంపంతో నరికాడు...తూటాతో కూలాడు !

2026-11-02 03:46 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

తరగతి గదిలోనే రాక్షసత్వం : పదోతరగతి విద్యార్థినిపై పాశవిక దాడి

2026-10-31 08:16 GMT

వైసీపీ సీపీఐ చెట్టాపట్టాల్...అనంతలో బిగ్ ట్విస్ట్

2026-10-31 00:30 GMT

కొత్త పాలిటిక్స్‌: ప‌రిచ‌యాలు పెంచుతున్నారు.. !

2026-09-30 22:30 GMT

రాప్తాడు స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ ప‌ట్టెంత‌.. ?

2026-09-26 16:30 GMT

కూతురిపై అసభ్య ప్రవర్తన.. ప్రైవేట్ పార్ట్ ను కోసేసిన మహిళ

2026-08-02 04:51 GMT

'చెప్పుతో కొడ‌తా'.. వైసీపీ నేత‌పై ఎమ్మెల్యే ఫైర్‌!

2026-07-09 09:37 GMT

పొలిటిక‌ల్ గతాలు.. మంచివేనా.. ?

2026-07-01 11:30 GMT

తాడిప‌త్రిలో ఉద్రిక్త‌త‌.. పెద్దారెడ్డి హౌస్ అరెస్టు

2026-06-26 09:53 GMT

Copyright @2026

Powered by Blink CMS