ఏపీ మంత్రికి అస్వస్థత.. హెలిక్యాప్టర్ లో హైదరాబాద్ తరలింపు

Update: 2020-10-15 04:30 GMT
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి మరోసారి దిగజారింది. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత నెలలోనే ఆయనకు కరోనా వైరస్ సోకింది. అయితే కోలుకున్న ఆయనకు తాజాగా తిరగబెట్టినట్టు సమాచారం.

ఈరోజు జ్వరంతో బాధపడుతున్న ఆయన బాగా నీరసించడంతో కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు.

భారీ వర్షాలతో రోడ్డు మార్గం అనుకూలంగా లేకపోవడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ కు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను హెలిక్యాప్టర్ లో తరలించారు.

ప్రస్తుతం మంత్రిని హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో వారం రోజులకు పైగా మంత్రి వెల్లంపల్లి గతంలో చికిత్స తీసుకున్నారు. కరోనా నుంచి  కోలుకున్నాక 8న విజయవాడలో ఓ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. కొన్ని సమీక్షలు నిర్వహించారు.

గత నెలలో మంత్రి వెల్లంపల్లి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. స్వామి వారికి సీఎం జగన్ తోపాటు పట్టువస్త్రాలు సమర్పించారు.
Tags:    

Similar News