జగన్ మరో ఇరవయ్యేళ్ళు....తగ్గేదే లేదు !

ఇక వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తారని వస్తున్న వార్తల పట్ల కూడా ఆయన ఘాటుగానే స్పందించారు. మాకు ఏ రకమైన టెన్షన్ అయితే లేదు, మేము దేనికైనా రెడీ తగ్గేదే లేదు అని ఆయన అంటున్నారు.;

Update: 2025-12-12 15:30 GMT

వైసీపీలో ఒక విధమైన నైరాశ్యం ఉందా అంటే ఉంది అన్న చర్చ సాగుతోంది ఎందుకంటే ఏపీలో కూటమి ప్రభుత్వం బలంగా ఉండటం పొత్తులు ఎత్తులతో దూసుకుపోతూండడంతో వైసీపీకి ఎక్కడా చాన్స్ అయితే దక్కడం లేదు అని ఒక విశ్లేషణ ఉంది. ఏణ్ణర్థం పాలన ముగిసింది. కానీ వైసీపీని ఇంకా ఓటమి వైపు నుంచి తేరుకునేలా చేయడంలో అధినాయకత్వం చేస్తున్న దిశా నిర్దేశం కూడా పెద్దగా పనిచేయడం లేదు అని అంటున్నారు ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చేశారు. అది ఒక విధంగా వైసీపీ భవిష్యత్తు మీద ధీమా పెంచేలా ఉందని అంటున్నారు.

వచ్చేది మేమే :

వైసీపీ అధినేత జగన్ వయసు ప్రస్తుతం 52 ఏళ్ళు మాత్రమే. మరో ఇరవై ఏళ్ళు ఆయన చాలా చురుకుగా రాజకీయం చేస్తారు అని నెల్లూరు జిల్లాకు చ్నెదిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక పవర్ ఫుల్ స్టేట్మెంట్ పాస్ చేశారు. అంటే ఇక్కడ నుంచి మరో రెండు దశాబ్దాలు అన్న మాట. మాకు ఏ రకమైన బెంగా భయం లేవని ఆయన అంటున్నారు. మా జగన్ కచ్చితంగా అధికారంలోకి వస్తారు. అంతే కాదు ప్రతీ ఒక్క కార్యకర్త రుణం తీర్చుకుంటారు అని అనిల్ కుమార్ యాదవ్ నిబ్బరంగా చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం పాలన మరో మూడేళ్ళలో స్టార్ట్ అవుతుందని ఆయన అంటున్నారు. అంటే 2029 ఎన్నికలలో కచ్చితంగా గెలిచి తీరుతామని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు.

ఎందుకబ్బా టెన్షన్ :

ఇక వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తారని వస్తున్న వార్తల పట్ల కూడా ఆయన ఘాటుగానే స్పందించారు. మాకు ఏ రకమైన టెన్షన్ అయితే లేదు, మేము దేనికైనా రెడీ తగ్గేదే లేదు అని ఆయన అంటున్నారు. మా మీద కేసులు పెట్టుకోండి జైలులు పంపినా బే ఫికర్ అని బిగ్ సౌండ్ చేశారు. ఇపుడున్న ఉన్న సీఎం కానీ పొరుగు రాష్ట్రం సీఎం కానీ కేంద్రంలో అమిత్ షా కానీ జైలుకు వెళ్ళి రాలేదా అని అనిల్ కుమార్ ప్రశ్నించారు. జైలుకు వెళ్తే ఏమి జరుగుతుందని కూడా ఆయన అంటున్నారు ఎవరూ భయపడరు తగ్గేది అంతకంటే లేదని ఆయన అంటున్నారు.

బంతిని బలంగా కొడితే :

ఏపీలో తమ పార్టీ మీద ఎన్ని కేసులు పెట్టినా ఎవరూ జడిసేది లేదని అన్నారు. బంతిని ఎంత గట్టిగా కొడితే దాని కన్నా బలంగా పైకి లేస్తుందని కూడా అనిల్ కుమార్ యాదవ్ చెప్పడం విశేషం. అధికారంలో ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. జైలులో పెట్టినంత మాత్రాన వణికిపోయేది ఎవరు అని ఆయన ప్రశ్నించారు. అనిల్ కుమార్ యాదవ్ మీద కేసులు పెట్టడానికి చూస్తున్నారు, కేసులు ఎన్ని పెట్టిన ఎనీ టైం మేము రెడీ అని కూదా సవాల్ చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే దానికి తగినంత మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వాన్ని అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. ధైర్యంగా ఉందామని ఆయన క్యాడర్ కి హితవు చెప్పారు. రౌడీ షీటర్ల పేరుతో కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు. ఇక జగన్ గురించి ఆయన పట్టుదల గురించి కూడా అనిల్ చెప్పుకొచ్చారు. మా లీడర్ కి పట్టుదల ఉందని అన్నారు. ఆయనకు వయసు కూడా ఉంది. అందుకే వైసీపీకి తిరుగు ఉండదన్న భావనను వ్యక్తం చేశారు.

Tags:    

Similar News