'సేన'కు సుస్థీ.. ఎందుకిలా..?
జనసేన పార్టీకి సుస్థీ చేసిందా? నాయకులు స్పందించడం లేదా? అధినేత ముందుకు వస్తే తప్ప.. నాయకులు రియాక్ట్ కావడం లేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది.;
జనసేన పార్టీకి సుస్థీ చేసిందా? నాయకులు స్పందించడం లేదా? అధినేత ముందుకు వస్తే తప్ప.. నాయకులు రియాక్ట్ కావడం లేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. గత కొన్నాళ్లుగా కూడా ఈ వ్యవహారం చర్చకు వస్తోంది. జనసేనలో తీవ్ర అసంతృప్తి రాజ్యమేలుతోందని.. నాయకులు ఎవరికి వారు గా వ్యవహరిస్తున్నారని కూడా వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ కీలక నాయకుడు బొలిశెట్టి సత్యనారా యణ కూడా ఇటీవల పార్టీ పరిస్థితిపై స్పందించారు.
నాయకుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందన్నారు. అదేసమయంలో పార్టీని ముందుకు తీసుకువెళ్లే క్రమంలోనూ నాయకులు సహకరించడం లేదన్నారు. దీనికి ప్రధాన కారణం నామినేటెడ్ పదవుల్లోనూ ప్రభుత్వంలోనూ తమకు ఆశించిన విధంగా ప్రాధాన్యం దక్కడం లేదన్నది బొలిశెట్టి చెప్పిన మాట. ఈ దిశగా కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం కూడా ఉందన్నారు. అయితే.. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేనా? అనేది ప్రశ్న.
ఇక, తాజాగా పవన్ కల్యాణ్ సైతం నాయకులు, మంత్రులపైనా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తు తం జరుగుతున్న పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని వ్యాఖ్యానించారు. అన్నీ తానే చూసుకోవాలంటే.. సాధ్యమేనా అని కూడా నిలదీశారు. అయితే.. వాస్తవానికి ఆది నుంచి కూడా జనసేన నాయకు లు పవన్ చెప్పినప్పుడే స్పందిస్తున్నారు. ఎందుకంటే.. గతంలో పార్టీ చెప్పకుండా స్పందించిన సమ యంలో వివాదాలు కొని తెచ్చుకున్నట్టు అయింది.
ఈ క్రమంలోనే పవన్ ఆదేశాల మేరకు.. పార్టీ ఇచ్చిన ప్రకటన మేరకు మాత్రమే నాయకులు రియాక్ట్ అవు తున్నారు. ఈ పరిణామాలకు తోడు క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల మధ్య కలివిడి కూడా అంతంత మాత్రం గానే ఉంది. దీంతో క్షేత్రస్థాయి పరిస్థితిలోనే నాయకుల మధ్య స్థిరమైన పాలిటిక్స్ నడవడం లేదు. ఈ వ్యవహారాన్ని ముందుగా చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే జనసేనలో నాయకులు యాక్టివ్ అవుతారని పరిశీలకులు చెబుతున్నారు.