వైసీపీకి అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తారా ?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన నాయకుడుగా అమిత్ షా ఉన్నారు.;

Update: 2026-02-03 18:30 GMT

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన నాయకుడుగా అమిత్ షా ఉన్నారు. ఆయన గత ఏడేళ్ళుగా కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తరువాత ప్రభుత్వంలో నంబర్ టూగా ఆయన ఉన్నారు అని అంటారు. అలాగే బీజేపీలో సైతం ఆయన అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అమిత్ షా అపాయింట్మెంట్ అంటే అవతల వారికి అంత సులువుగా దక్కదు, ఇంకా చెప్పాలీ అంటే తమ రాజకీయ ప్రత్యర్ధులు అనుకున్న వారికి ఆయన అపాయింట్మెంట్ ఇస్తారా అన్నది కూడా ఒక చర్చ. అయితే ప్రోటోకాల్ ప్రకారం విపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులకు అపాయింట్మెంట్లు ఇస్తారు, అది వేరే విషయం. కానీ తమ పార్టీకి తమ కూటమికి ఎదురు నిలిచి సవాల్ చేస్తున్న ప్రత్యర్ధి పార్టీలకు అపాయింట్మెంట్ ఇస్తారా అన్నది ఒక పెద్ద సందేహం.

వైసీపీ కోరింది :

అయితే వైసీపీ ఎంపీలు అమిత్ షా అపాయింట్మెంట్ ని కోరారు అని అంటున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ బాగా లేదని రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల మీద దాడులు వరసబెట్టి జరుగుతున్నాయని వారు ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో తాము కేంద్ర హోం మంత్రిని కలిసి వాస్తావాలు ఏపీలో జరుగుతున్న పరిణామాలు చెబుతామని అంటున్నారు. గత కొన్ని రోజులుగా తమ నేతల మీద దాడులు జరుగుతున్నాయని వారు అంటున్నారు. ఈ క్రమంలోనే హోం మంత్రిని కలుస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

అది జరుగుతుందా :

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ వైసీపీకి దక్కుతుందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. నిజానికి చూస్తే ఇది పెద్ద విషయంగా కూడా చూడకూడదు, కేంద్ర హోం మంత్రిగా ఆయన వద్దకు వైసీపీ ఎంపీలు వెళ్ళవచ్చు, కలవచ్చు, తమ సమస్యలు చెప్పుకోవచ్చు, కానీ ఏపీలో చూస్తే రాజకీయం వేరుగా ఉంది. వైసీపీకి కూటమిని మధ్య పెద్ద రాజకీయ సమరమే సాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీలకు అమిత్ షా కనుక అపాయింట్మెంట్ ఇస్తే కనుక అది రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది అని అంటున్నారు. ఏపీలో టీడీపీ ఈ విషయంలో అయితే సీరియస్ గా రియాక్ట్ అయ్యే చాన్స్ ఉంది అని అంటున్నారు.

గతంలో అలాగే :

ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీ ఏపీలో విపక్షంలో ఉంది. కానీ ఏపీ విపక్ష నేత జగన్ కి ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్లు ఇచ్చేవారు, దీనితోనే టీడీపీకి బీజేపీకి మధ్య గ్యాప్ అయితే ఏర్పడింది. ఆ తరువాత అది మరింతగా పెరిగింది చివరికి 2018 లో పొత్తులు కాస్తా పెడాకులుగా మారేందుకు దారి తీసింది. దాంతో 2024 నుంచి అటు కూటమి పార్టీలు మరింత సఖ్యతగా వ్యవహరిస్తున్నాయి. తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా చూసుకుంటున్నాయి. పైగా 2029 లో కూడా కలసి పోటీ చేయాలని చూస్తున్నారు. ఏపీ బీజేపీ నేతలు అయితే వైసీపీ నేతల మీద గట్టిగానే విమర్శలు చేస్తున్నాయి.

అది సంకేతమా :

వైవీ సుబ్బారెడ్డి అయితే అమిత్ షా అపాయింట్మెంట్ కోరామని అంటున్నారు. దాంతో ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినా ఒక చర్చ ఇవ్వకపోయినా మరో చర్చ అయితే ఏపీ రాజకీయ పరిస్థితుల బట్టి జరగడం ఖాయం అని అంటున్నారు. కేంద్రంలోని ఎన్ డీయేకి వైసీపీ దగ్గరా దూరమా లేక పరోక్ష స్నేహాలు అవగాహనలు ఉన్నాయా లేదా అన్నది కూడా దీని ద్వారా తెలుస్తుంది అని అంటున్నారు. మరి వైసీపీ కూడా ఈ విషయం మీద తెలుసుకునేందుకే కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిందా అన్నది కూడా ఒక చర్చ సాగుతోంది. ఒక వేళ అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే జగన్ వచ్చి కలుస్తారా అన్నది కూడా మరో చర్చ. మొత్తానికి చూస్తే వైసీపీ ఆలోచనలు ఎలా ఉన్నా జాతీయ రాజకీయాల్లో వైసీపీ ఏ రకమైన స్టెప్ తీసుకోవాలో తెలిసేలాగానే పరిణామాలు ఉండొచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News