• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గ్రేటర్ మేయర్ కు వర్మ...

గ్రేటర్ మేయర్ కు వర్మ మార్కు ట్వీట్.. నేనూ కుక్కలా పుడతా

By - Tupaki Desk
Update: 2021-03-04 04:37 GMT
గడిచిన కొద్ది రోజులుగా మీడియాలో పెద్దగా కనిపించని రాంగోపాల్ వర్మ.. తాజాగా మరోసారి తన మార్కు కనిపించే ట్వీట్ ను.. షార్ట్ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోకు వర్మ స్పందించిన తీరు.. ఆయన వ్యాఖ్యలు వ్యంగ్యంగా ఉన్నాయి. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇంతకీ వర్మ పోస్టుచేసిన వీడియోలో ఏముందన్నది చూస్తే.. గ్రేటర్ హైదరాబాద్ మహానగరపాలక సంస్థకు మేయర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గద్వాల విజయలక్ష్మీ తన ఇంట్లో కుక్కకు చపాతి పెడుతున్న వీడియో వైరల్ గా మారింది. బెడ్ మీద కుక్క కూర్చొని ఉంటే.. దానికి దగ్గరగా కుర్చీలో మేయర్ ఉన్నారు. రొట్టె.. కర్రీతో ఉన్న ప్లేట్ ను బెడ్ మీద ఉంచి.. చిన్నముక్కను తుంచి కుక్కకుతినిపిస్తున్నారు. అదే రొట్టెనుమరో వైపు నుంచి చిన్నగా తించి తాను తినటం ఆసక్తికరంగా మారింది.

మూడు రోజుల నుంచి అసలేం తినలేదన్న ఆమె మాటల్లో ఆవేదన కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ వీడియోను చూస్తే.. పెంపుడు కుక్క మీద గద్వాల విజయలక్ష్మికి ఉన్న ప్రేమాభిమానం ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అయితే.. ఈ వీడియోను ఎక్కడ పట్టుకున్నారో కానీ.. దాన్ని తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేకాదు.. దీనికి ఆయనపెట్టిన పోస్టు పలువురిని ఆకర్షిస్తోంది.

‘‘గద్వాల విజయలక్ష్మి తన పెంపుడు శునకంపై ఇంతలా ప్రేమ చూపించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. కానీ, ఇక్కడ నాకో ప్రశ్న ఉంది. అసలు ఆమె ప్రజల్ని ఇలా తన కుక్కలాగే ప్రేమతో చూసుకుంటుందా? అని. ఇప్పుడు నేను నిజాయతీగా చెబుతున్నా.. ఒకవేళ మేయర్ ఇలా ప్రేమ చూపిస్తే నేను వచ్చే జన్మలో ఇలా కుక్కగా పుట్టాలని ప్రార్థిస్తా.’’ అని ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ను పాజిటివ్ గా రియాక్టు అయ్యే వారే కాదు.. నెగిటివ్ గా రియాక్ట్ అవుతూ రిప్లై ఇస్తున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. గ్రేటర్ మేయర్ కు సంబంధించిన ఒక కొత్త వీడియో ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పక తప్పదు. ఇంతకీ ఇలాంటి వీడియోలు వర్మకు ఎక్కడ నుంచి వస్తుంటాయంటారు?

After seeing this video of @GadwalvijayaTRS I am wondering if she was drunk with love on a dog or in love with a drunk dog but the question is whether she loves the people as much as her dog.Honestly I pray to be born as a dog in my next birth if a mayor can love me this much

Tags:    
  • Hyderabad Mayor 
  • Ram Gopal Varma 
  • Rgv Latest Movies 
  • Telugu News 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS