వర్మ సినిమా.. సీఎం జగన్ క్యారెక్టర్.. టీడీపీ నేత రోల్
అప్పుడప్పుడూ తెలుగు నాట కొన్ని చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. వాటిని అలా చూస్తూ ఎంజాయ్ చేయాల్సిందే. ఇప్పుడూ అదే జరిగింది. ఓ టీడీపీ నేత జగన్ చేస్తున్న పనులపై చేసిన కామెంట్ వైరల్ అయ్యింది. అంతేకాదు.. జగన్ పాలనపై సినిమా తీయాలని ఏకంగా తెలుగు రాష్ట్రాల్లోనే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు సూచించడం అంతకంటే పెద్ద వింత అయ్యింది.
తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఓ విజ్ఞప్తిని చేశారు. ‘ఏపీలో ఇళ్ల స్థలాల అవినీతిపై రాంగోపాల్ వర్మ ఓ సినిమా తీయాలని’ ఆయన సూచించారు.
ట్విస్ట్ ఏంటంటే ఆ సినిమాలో తాను సీఎం జగన్ పాత్రలో నటిస్తానని.. పేదలకు ఇల్లు పేరుతో వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని బండారు తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే ఎవరు ఔనన్నా కాదన్నా తన పని తాను చేసుకుపోయే రాంగోపాల్ వర్మకు చంద్రబాబు అంటే కోపం.. అందుకే ఆయనపై రెండు మూడు సినిమాలు తీశాడు. కానీ జగన్ అంటే చాలా ఇష్టం. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి వచ్చాడు. మరి ఈ టీడీపీ నేత ప్రతిపాదనకు ఆర్జీవీ ఎలా స్పందిస్తాడన్నది వేచిచూడాలి.