అర్ధాంతరంగా ముగిసిన హనీమూన్... ఈ జంటకు ఏమైంది..!

అవును... అక్టోబర్ 29న బెంగళూరులో గానని (26), సూరజ్ (29) వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే... తొలి రాత్రి నుంచి ఈ దంపతుల మధ్య సఖ్యత కొరవడిందట.;

Update: 2025-12-28 04:51 GMT

కొత్తగా పెళ్లైన జంట.. హనీమూన్ కి వెళ్లింది.. అయితే మధ్యలోనే వెనక్కి తిరిగి వచ్చేసింది.. వీరిద్ధరికీ ఏమైంది అని కుటుంబ సభ్యులు అంతా ఆందోళన వ్యక్తం చేస్తోన్న వేళ.. ఇద్దరూ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకున్నారు. ఇందులో భాగంగా... ఆమెకు మరో యువకునితో సంబంధం ఉందని అతడు ఆరోపిస్తే.. అతడు సంసారానికే పనికిరాడని ఆమె ఆరోపించింది. వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది. ఈ సమయంలో ఘోరం జరిగిపోయింది.

అవును... అక్టోబర్ 29న బెంగళూరులో గానని (26), సూరజ్ (29) వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే... తొలి రాత్రి నుంచి ఈ దంపతుల మధ్య సఖ్యత కొరవడిందట. ఆమెకు మరో వ్యక్తితో ఉన్న స్నేహాన్ని సూరజ్‌ అనుమానించగా.. అతడు సంసారానికే పనికి రాడని గానవి తన కుటుంబ సభ్యుల వద్ద గోడు వెళ్లబోసుకుందని చెబుతున్నారు. దీంతో.. ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చిన ఇరువైపులా కుటుంబ సభ్యులు.. హనీమూన్‌ కు వెళ్లి వస్తే అన్నీ సర్దుకుంటాయని సూచించారు.

పెద్దల సూచనల మేరకు నూతన దంపతులు ఇద్దరూ పది రోజుల పాటు హనీమూన్ కోసం శ్రీలంకకు బయలుదేరి వెళ్లారు. అయితే ఇంతలోనే ఏమైందో ఏమిటో తెలియదు కానీ.. వెళ్లిన నాలుగు రోజులకే హనీమూన్ ని అర్ధాంతరంగా ముగించుకుని, గత ఆదివారమే నగరానికి చేరుకున్నారు. ఈ క్రమంలో... బుధవారం మధ్యాహ్నం ఓ ఘోరం జరిగిపోయింది. ఇందులో భాగంగా.. పుట్టింటికి వచ్చిన గాయని గత బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు ప్రయత్నించింది.

ఎక్కడ, ఎలా సంపాదించిందో తెలియదు కానీ.. విషయం తాగిందని అంటున్నారు. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆమె మరణించింది. దీంతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు ఈ విషయం తెలిసిన అనంతరం.. వరుడు సూరజ్.. తన తల్లి జయంతి, సోదరుడు సంజయ్ తో కలిసి సొంతూరు నాగపూర్ కు వెళ్లిపోయి, అక్కడే ఓ హోటల్ లో రూమ్ తీసుకుని ఉన్నారు.

ఇంతలో ఏమైందో ఏమో కానీ... తల్లి జయంతి, సూరజ్ కూడా ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సూరజ్ అక్కడికక్కడే మరణించగా.. జయంతి మాత్రం బయటపడ్డారు. ఈ సందర్భంగా స్పందించిన సంజయ్... పోలీసులు అరెస్ట్ చేస్తారని భయంతోనే తన సోదరుడు సూరజ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న బాధతో జయంతి అదేపనికి ప్రయత్నించారని పోలీసులకు తెలిపాడు.

Tags:    

Similar News