మైనర్లతో సహా టార్గెట్ హిందువులు... హెచ్.ఆర్.సీ.బీ.ఎం. సంచలన నివేదిక!

ఇందులో భాగంగా ప్రధానంగా దీప్ చంద్ర దాస్ అనే పాతికేళ్ల హిందూ వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.;

Update: 2025-12-28 04:49 GMT

గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో హిందువులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధానంగా దీప్ చంద్ర దాస్ అనే పాతికేళ్ల హిందూ వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే... హిందువులపై అక్కడ పలు తప్పుడు కేసులు పెడుతున్నారని.. అందుకు వారు ‘దైవదూషణ’ను ఉపయోగించుకుంటున్నారనే షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.

అవును... కుక్కను చంపాలనుకుంటే దానికి పిచ్చిది అని ముద్రవేస్తారని అంటారు. ఇదే క్రమంలో... బంగ్లాదేశ్ లో హిందువులను బాధించాలని, హింసించాలని భావించే వారు.. వారిపై దైవ దూషణ ఆరోపణలు చేసి, కేసులు పెడుతున్నారని అంటున్నారు. బంగ్లాదేశ్ లోని మైనారిటీల కోసం మానవ హక్కుల కాంగ్రెస్ (హెచ్.ఆర్.సీ.బీ.ఎం) తాజా నివేదిక ఈ మేరకు గత ఆరు నెలలకు సంబంధించిన సంచలన విషయాలు వెల్లడించింది.

తాజా నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ లో జూన్ 2025 నుంచి డిసెంబర్ 2025 మధ్య హిందువులపై కనీసం 71 దైవదూషణ కేసులు నమోదయ్యాయి. ఈ సంఘటనలు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. ఇవి.. చిట్టగాంగ్, దీనాజ్ పుర్, రంగ్ పూర్, చాంద్ పూర్, లాల్మోనిర్ హట్, సునమ్ గంజ్, ఖుల్నా, కోమిల్లా, తంగైల్, గాజీపూర్ సహా 30కి పైగా జిల్లాల్లో జరిగాయని చెబుతున్నారు. ఇది హిందువులు ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక అభద్రతను ఎత్తి చూపుతుందని అంటున్నారు.

ఇదే సమయంలో.. ఈ నివేదిక ప్రకారం దైవదూషణ కేసుల్లోని నిందితుల్లో 90%కి పైగా హిందువులు ఉండగా.. వారిలో 15 నుంచి 17 ఏళ్ల వయసు గల మైనర్లు కూడా ఉండటం గమనార్హం. పైగా.. ఓ వ్యక్తిపై మోపబడిన ఆరోపణల ప్రభాగం ఆ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. రంగ్పూర్ర్లో 17 ఏళ్ల రంజన్ రాయ్ అరెస్ట్ తర్వాత.. ఒక గుంపు సుమారు 22 హిందువుల ఇళ్లను ధ్వంసం చేసిన ఘటనను దీనికి ఉదాహరణగా చెబుతున్నారు.

హెచ్.ఆర్.సీ.బీ.ఎం. ప్రకారం... ఇవన్నీ పక్కా ప్లానింగ్ తో జరిగిన, జరుగుతున్న ఘటనలు. ఇందులో భాగంగా... ముందుగా టార్గెట్ చేసుకున్న వ్యక్తిపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తారు.. తర్వాత గుంపులను సమీకరిస్తారు.. ఫైనల్ గా అరెస్టు తప్పనిసరి పరిస్థితులు సృష్టిస్తూ పోలీసులు ఒత్తిడిని పెంచుతారు. ఈ విధంగా మైనారిటీలను బెదిరించడానికి, వేధించడానికి, సామాజికంగా బహిష్కరించడానికి సులభమైన సాధనంగా దైవదూషణ ఆరోపణలు మారాయని అంటున్నారు.

వీటికి ఉదాహరణలుగా... జూన్ 19 - 2025న బరిషల్ లోని అగల్ ఝూరాలో తమల్ బైద్య అరెస్టు.. జూన్ 22న చామంద్ పూర్ లో శాంటన్ సూత్రధర్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన.. జూలై 27న రంగ్ పూర్ లోని బెట్ గరీ యూనియన్ లో 17 ఏళ్ల రంజన్ రాయ్ అరెస్టు, తర్వాత 22 హిందూ ఇళ్లను ధ్వంసం చేయడం.. గత ఏడాది సెప్టెంబర్ 4న భద్రతా దళాల సమక్షంలోనే ఖల్నాలో 15ఏళ్ల ఉత్సవ్ మండల్ ను కొట్టి చంపడం.. ఇక తాజాగా డిసెంబర్ 18న మైమెన్ సింగ్ లో దూపు చంద్ర దాస్ ని కొట్టి చంపడాన్ని చెబుతున్నారు.

Tags:    

Similar News