జమ్మూ&కశ్మీర్ లో మరో ఆపరేషన్ స్టార్ట్ చేసిన సైన్యం.. లక్ష్యం ఇదే!
అవును... జమ్మూ కశ్మీర్ లో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత సైన్యం గత వారం రోజులుగా ఆపరేషన్ నిర్వహిస్తోంది..;
గడ్డకట్టే ఉష్ణోగ్రతలు.. ప్రమాదకరమైన భూభాగాలు.. పరిమిత దృశ్యమానత.. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలు.. కింద మంచుతో కప్పబడిన ప్రాంతాలు.. పైనుంచి హిమపాతం జల్లులు.. ఎత్తైన కొండలు, లోతైన లోయలు.. దట్టమైన అటవీ ప్రాంతాల మధ్య భారత సైన్యం మరో ఆపరేషన్ మొదలుపెట్టింది. జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టడమే లక్ష్యంగా సైన్యం ఈ ఆపరేషన్ నిర్వహిస్తోంది. కీష్తార్వ్ లో కేశ్వాన్ లో మరో ఆపరేషన్ జరుగుతుంది.
అవును... జమ్మూ కశ్మీర్ లో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత సైన్యం గత వారం రోజులుగా ఆపరేషన్ నిర్వహిస్తోంది.. వీరిలో స్థానిక కమాండర్ సైఫుల్లా, అతని సహాయకుడు ఆదిల్ సహా ఇతరులు ఉన్నారని అంటున్నారు. ఈ ఇద్దరూ కిష్తార్వ్ కొండలలొ దాక్కున్నారని చెబుతున్నారు. ఈ ఇద్దరి ఉగ్రవాదులకు ఒక్కొక్కరిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. కిష్త్వార్ లోని చత్రొ సబ్ డివిజన్ లోని గ్రామాల నుంచి ఈ ఆపరేషన్ మొదలైంది.
ఈ నేపథ్యంలో.. జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిస్త్వార్ లోని కేశ్వాన్ లో మరో ఆపరేషన్ మొదలైంది. వాస్తవానికి చత్రో సబ్ డివిజన్ లో గత వారం రోజులుగా ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతుండగా.. కేశ్వాన్ లో సైన్యం శనివారం ఈ కొత్త ఆపరేషన్ ను ప్రారంభించింది. ఇది ఆదివారం కూడా కొనసాగుతుందని వర్గాలు చెబుతున్నాయి! ఈ కీలక సెర్చ్ ఆపరేషన్ లో 2,000 మందికి పైగా సైనికులు పాల్గొన్నారు.
ఇక్కడ ఓ మంచి విషయం ఏమిటంటే... ఉగ్రవాదులను పట్టుకోవడంలో ఆ ప్రాంతం బాగా తెలిసిన స్థానిక గ్రామస్తులు చాలా మంది సైన్యానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో.. కిస్త్వార్ లోని పాడ్డర్ సబ్ డివిజన్ లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది కమాండర్ జహంగీర్ సరూరితో పాటు ముద్దాసిర్, రియాజ్ లుగా గుర్తించబడిన మరో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు ఉన్నట్లు చెబుతున్నారు. వీరిలో ఒక్కొక్కరికి రూ.10 లక్షల రివార్డ్ ఉంది.
ఈ సందర్భంగా స్పందించిన రక్షణ వర్గాలు.. మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో తాత్కాలిక స్థావరాలు, నిఘా పోస్టులను ఏర్పాటు చేసి.. ఉగ్రవాద స్థావరాలపై ఒత్తిడిని కొనసాగించిందని తెలిపాయి. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో పని చేస్తున్న ఆర్మీ బృందాలు.. ఉగ్రవాదులకు ఆశ్రయం లేకుండా.. ఎత్తైన కొండలు, లోయలు, అటవీ ప్రాంతాలలో క్రమం తప్పకుండా ప్రయాణిస్తున్నాయని వెల్లడించాయి!