రైలు బయలుదేరే అరగంట ముందు సైతం రిజర్వేషన్ బుకింగ్
తరచూ ట్రైన్ ప్రయాణాలు చేసే వారు మాత్రమే కాదు.. రైల్లో ట్రావెల్ చేసే వారందరికి ఈ సమాచారం ఉపయుక్తంగా ఉంటుందని చెప్పాలి.;
తరచూ ట్రైన్ ప్రయాణాలు చేసే వారు మాత్రమే కాదు.. రైల్లో ట్రావెల్ చేసే వారందరికి ఈ సమాచారం ఉపయుక్తంగా ఉంటుందని చెప్పాలి. ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయినా..అనుకోకుండా ఆఖరి నిమిషంలో ట్రైన్ జర్నీకి ప్లాన్ చేసుకున్నప్పుడు ఎదురయ్యే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అయితే.. ఈ తరహా కష్టాలకు చెక్ పెట్టేందుకు వీలుగా భారతీయ రైల్వే అనుసరిస్తున్న కొన్ని విధానాలు ప్రయాణికులకు సౌకర్యవంతంగా మారాయని చెప్పొచ్చు. ఆఖరి నిమిషాల్లో ట్రైన్ జర్నీ చేసుకునేటప్పుడు సౌకర్యవంతంగా ఉండే ఈ విధానంలోకి వెళితే..
రైలు బయలుదేరటానికి నాలుగు గంటల ముందు నుంచి అర గంట ముందు వరకు కూడా ట్రైన్ లో సీటు కం బెర్తు రిజర్వు చేసుకునే వీలు కల్పిస్తున్నారు. ఇందుకోసం చేయాల్సింది చాలా సింఫుల్. ఆన్ లైన్ లో ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లేదంటే యాప్ ద్వారా ఈ టికెట్ తీసుకునే వెసులుబాటు ఉంది. ఆన్ లైన్ కాకుండా ఆఫ్ లైన్ లో అయితే కరెంటు రిజర్వేషన్ కౌంటర్ వద్ద టికెట్ తీసుకునే వెసులుబాటు ఉంది.
ఇంతకూ సీటు/బెర్తు ఉందా? లేదా? అన్నది తెలసుకోవటానికి కరెంట్ అవైలబుల్ అని కనిపిస్తే.. కరెంటు బుకింగ్ లో సీటు.. బెర్తు అందుబాటులో ఉన్నట్లు అర్థం. రెగ్యులర్ బుకింగ్ లో తేదీని ఎంపిక చేసుకోవటం.. టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. తత్కాల్ టికెట్ ధరల్లో కాకుండా సాధారణ బుకింగ్ ధరలకే సీట్ కం బెర్తు సొంతం చేసుకోవచ్చు. ఇది నాన్ ఏసీ నుంచి ఏసీ వరకు అన్ని క్లాసులకు ఈ విధానం అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. అవసరమైనోళ్లు దీన్ని వినియోగించుకుంటే సరి.