వెయ్యిమంది చైనీయుల వీసాలు రద్దుచేసిన అమెరికా

Update: 2020-09-10 06:15 GMT
అగ్రరాజ్యం అమెరికా.. చైనా దేశానికి షాకుల మీద షాకులు ఇస్తోంది. తాజాగా జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా దాదాపు వెయ్యిమందికి పైగా చైనీస్ విద్యార్థులు, పరిశోధకుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా హోం ల్యాండ్ సెక్యురిటీ విభాగం బుధవారం వెల్లడించింది.

ఇక ఈ 1000మంది చైనా వారు చైనా మిలిటరీతో సంబంధాలు కలిగి ఉన్నారని.. అమెరికాకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని డ్రాగన్ ఆర్మీకి పంపిస్తున్నారనే అనుమానంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా తెలిపింది.

కరోనా వైరస్ పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని తస్కరించే ప్రయత్నాలు కొందరు చైనీయులు చేస్తున్నారని అమెరికా హోలాండ్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి తెలిపారు. చైనా దేశవిద్యార్థులు, పరిశోధకుల నుంచి అమెరికా డేటాకు ముప్పు పొంచి ఉందని.. ఇకపై వారు తమ దేశంలో ప్రవేశించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

కాగా అమెరికాలో దాదాపు 3.60 లక్షలమంది చైనీయులు విద్యనభ్యసిస్తున్నారు. అమెరికా-చైనా వార్ తో ఇప్పుడు వారి భవిష్యత్తు కూడా గందరగోళంలో పడనుంది.

ఇక చైనా వస్తువులను తమ దేశ మార్కెట్లోకి రాకుండా అడ్డుకుంటామని.. జిన్ జియాంగ్ లోని ఉగర్ ముస్లింల పట్ల చైనా అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తున్నట్టు అమెరికా తెలిపింది.
Tags:    

Similar News