అదనపు బస్సు చార్జీలు లేవు... సంక్రాంతికి హ్యాపీ జర్నీ

ప్రతీ ఏటా సంక్రాంతి వచ్చిందంటే చాలు బస్సు చార్జీలు పెద్ద ఎత్తున పెంచుతారు;

Update: 2026-01-13 07:14 GMT

సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం స్వీట్ న్యూస్ ని వినిపించింది. బస్సులలో ప్రయాణించే ప్రయాణీకుల మీద ఎలాంటి సంక్రాంతికి అదనపు బస్సు చార్జీలు లేవు ని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. అందరూ హ్యాపీగా సంక్రాంతి పండుగకు తమ సొంత ఊళ్ళకు వెళ్ళి పెద్ద పండుగను ఆనందంగా చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం ఈ విధంగా అవకాశాన్ని కల్పించింది.

భారం లేకుండానే :

ప్రతీ ఏటా సంక్రాంతి వచ్చిందంటే చాలు బస్సు చార్జీలు పెద్ద ఎత్తున పెంచుతారు. దాంతో సంక్రాంతి పండుగ ఆనందం అంతా ముందే ఆవిరి అవుతుంది. చేతిలో డబ్బులు ఇలా బస్సులకే పోసి ఇల్లు చేరిన వారికి ఎలాంటి హ్యాపీ ఉండదు, అందుకే హ్యాపీ జర్నీ చేయండి ఎక్కడా బాదుడు అన్నది లేదని కూటమి ప్రభుత్వం మంచి వార్తనే చెప్పింది. సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు కూటమి ప్రభుత్వం తరఫున ఇది పండుగ కానుకగా అని మంత్రి చెప్పారు. అంతే కాదు సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు మంత్రి మండిపల్లి కీలక సూచనలు కూడా చేశారు.

మహిళలకు ఉచిత బస్సు :

ఇక గత ఏడాది ఆగస్టులో ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు సదుపాయం సంక్రాంతి పండుగ పండుగ రద్దీ దృష్ట్యా యథావిధిగా కొనసాగుతుందని మంత్రి చెప్పారు. అందువల్ల వారంతా ఉచిత బస్సులు ఎక్కి తమ ఊళ్ళకు పైసా ఖర్చు లేకుండా వెళ్ళవచ్చు అని కూడా మంత్రి వెల్లడిస్తున్నారు.సంక్రాంతి సందర్భంగా అదనపు చార్జీలు విధించబోమని చెబుతూనే ఈ ఏడాది మొత్తానికే ఆర్టీసీ చార్జీలలో ఎలాంటి పెంపుదల ఉండదని మంత్రి స్పష్టమైన ప్రకటన చేశారు. దాంతో మొత్తం 2026 అంతా బస్సు ప్రయాణీకులకు భారీ ఊరటగానే దీనిని చూడాలని అంటున్నారు.

క్షేమంగా లాభంగా :

ఇదిలా ఉంటే సొంత వాహనాలలో అదే విధంగా ప్రైవేట్ వాహనాలలో ప్రయాణించే ప్రయాణికులు తగిన జాగ్రత్త తీసుకోవాలని వారు సేఫ్ గా గమ్యానికి చేరాలని కోరారు. సొంత వాహనాలు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే వారు జాగ్రత్తగా నిబంధనలు పాటిస్తూ క్షేమంగా సొంత ఊళ్లకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. అదే విధంగా ప్రైవేట్ బస్సులు అక్రమంగా చార్జీలు పెంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక చార్జీలు వసూలు చేస్తే సంబంధిత బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగను ప్రజలు ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

Tags:    

Similar News