• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాపం బైడెన్​.. విమానం...

పాపం బైడెన్​.. విమానం ఎక్కబోయి బోర్లా పడ్డాడు.. మూడుసార్లు..!

By - Tupaki Desk
Update: 2021-03-20 04:04 GMT
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ వయసు 78 ఏళ్లు.. ఆ వయసులో ఎంతో చలాకీగా ఉత్సాహంగా కనిపిస్తుంటారు. ఆయన ప్రసంగాలు ఎందరినో ఆకట్టుకుంటాయి. ఆ ప్రసంగాలతోనే అమెరికా ప్రజలను ఆకట్టుకున్నారు. ఆయన ప్రత్యర్థి డొనాల్డ్​ ట్రంప్​ మరింత ఉర్రూతలూగించేలా మాట్లాడగలరు. కానీ అమెరికా ప్రజలు మాత్రం బైడెన్​కే ఓటేశారు. ఇదిలా ఉంటే తాజాగా జో బైడెన్​ విమానం ఎక్కబోయి తుళ్లిపోయి కింద పడిపోయారు. ఒక్కసారి కాదు.. ఏకంగా మూడు సార్లు. ఆయన వయసు కూడా చాలా ఎక్కువ .. అధ్యక్షుడంటే చాలా బాధ్యతలుంటాయి. విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. క్షణం తీరిక ఉండదు. పైగా వయసు మీద పడుతున్నప్పుడు ఏవో ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ఇన్ని టెన్షన్స్​ మధ్య ఆయన విమానం ఎక్కబోయి కింద పడి పడి పోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్​ అవుతున్నది.

ఇదిలా ఉంటే .. శుక్రవారం అమెరికా అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ వన్‌లో అట్లాంటా బయలుదేరాడు. ఈ టైంలోనే విమానం ఎక్కబోయి ఆయన తుళ్లి పడిపోయారు. మూడు సార్లు కింద పడ్డారు. ఆ వెంటనే పక్కన గల వీల్ పట్టుకొని పైకి ఎక్కేశారు. ఆ తర్వాత అందరికీ అభివాదం చేశారు. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.జో బైడెన్​ అట్లాంటా లో ఆసియన్ అమెరికన్ నేతలతో భేటీ అయ్యారు. పార్లర్ వద్ద మాస్ ఫైరింగ్ జరగడం తో బయల్దేరారు.  వెంటనే వైట్​ హౌస్​ ఆరోగ్య నిపుణులు జో బైడెన్ పరీక్షించారు. ఆయనకు కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు.

 అయితే ప్రస్తుతం జో బైడెన్​ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వాళ్లు తేల్చిచెప్పారు.గత ఎన్నికల ముందు జో బైడెన్​ ఆరోగ్యంపై రకరకాల ప్రచారాలు సాగాయి. అధ్యక్షుడిగా ప్రమాణం చేసి .. పదవీ బాధ్యతలు చేపట్టాక ఓ సారి జో బైడెన్​ను పెంపుడు కుక్క కరిచింది. ఆ తర్వాత బైడెన్​ మళ్లీ కోలుకున్నారు. తాజాగా ఇలా జరగడం గమనార్హం.
Tags:    
  • US President Joe Biden 
  • slipped three times 
  • America 
  • Telugu News 

Similar News

వరుస తుఫాన్లు.. చంద్రబాబుకు ఎన్నో విధాల మేలు

2026-11-02 12:30 GMT

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

Copyright @2026

Powered by Blink CMS