• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాక్ గగనతల ప్రయాణం చాలా...

పాక్ గగనతల ప్రయాణం చాలా ప్రమాదకరం..హెచ్చరించిన యుఎస్ !

By - Tupaki Desk
Update: 2020-01-03 08:32 GMT
పాకిస్థాన్ ప్రపంచ దేశాలలో వేరయా అని చెప్పాలి. అన్ని దేశాలు కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించడం ఎలా అని ఆలోచిస్తుంటే ..పాక్ మాత్రం ఉగ్రవాదాన్ని తమ దేశంలోనే పెంచి పోషిస్తుంటుంది. పాక్ కి , ఉగ్రవాదానికి చాలా అభినాభావ సంబంధం ఉంది. పైపైకి మాత్రం మేము ఉగ్రవాదానికి వ్యతిరేకం అని పాక్ చెప్తున్నప్పటికీ కూడా పాక్ లో ఉగ్ర స్థావరాలకి కొదవే లేదు. దీనితో ఉగ్ర చర్యల వల్ల  పాక్‌ గగనతలంపై ప్రయాణం చాలా ప్రమాదకరం అని , పాకిస్థాన్ గగనతలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదని అమెరికా నిషేధాజ్ఞలు జారీ చేసింది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈమేరకు అమెరికా ఎయిర్ లైన్స్ సంస్థలకు, అందులో పనిచేసే పైలెట్లకు ఆదేశాలు జారీ చేసింది.

పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ ను వాడటం రిస్క్ తో కూడుకున్న పని అని - అక్కడ తీవ్రవాదులు - మిలిటెంట్ కార్యకలాపాలు అధికంగా జరుగుతున్నాయని, దీనితో విమానాలకు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగాఉన్నాయని యూఎస్ అభిప్రాయపడింది. యూఎస్ పౌర విమానయాన కార్యకలాపాలకు పాకిస్థాన్ గగనతలంపై అవాంతరాలు ఏర్పడవచ్చని భావించిన  తరువాతనే గత ఏడాది డిసెంబర్‌లో దీనిపై ఎయిర్‌మెన్లకు నోటమ్‌ (నోటీస్‌ టు ఎయిర్‌ మెన్‌ )  జారీ చేసిందని అమెరికా అధికారులు వెల్లడించారు.  ఇది అన్ని యూఎస్ కేంద్రంగా నడిచే విమానయాన సంస్థలకు, పైలెట్లకూ వర్తిస్తుందని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.  ముఖ్యంగా పాక్ గగనతళం పై తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలకి ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.


Tags:    
  • US 
  • Airlines 
  • Pakistan airspace 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS